సీజన్‌లో దొరికే పండ్లను ఆ సీజన్‌లోనే తినేయాలని మన పెద్దలు చెబుతుంటారు. వేసవిలో లభించే మామిడి పండ్లనే కాదు.. నేరేడు పండ్లను సైతం మిస్ కాకుండా తీసుకోవాలి. నేరేడు పండ్లు కాస్త వగరుగానే ఉన్నా.. ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేస్తాయి. ఒక వేళ మీరు నేరేడు పండ్లను తినడం మిస్సవుతున్నట్లయితే.. ఈ ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోతున్నట్లే. అవేంటో చూసేయండి మరి. 



  • నేరేడులో విటమిన్-C ఎక్కువగా ఉంటుంది. ఇది మీలో రోగనిరోధక శక్తి పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

  • నేరేడు తినేవారికి విటమిన్ B, విటమిన్ B6, రైబోఫ్లేవిన్, నియాసిన్‌లు కూడా లభిస్తాయి.

  • నేరేడులో కాల్షియమ్‌తోపాటు మెగ్నీషియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. 

  • డయాబెటిస్ రోగులకు నేరేడు సంజీవనిలా పనిచేస్తుంది. 

  • నేరేడు పండును రోజు తీసుకుంటే బ్లడ్ షుగర్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయి. 

  • డయాబెటిక్స్‌లో తరచు ఏర్పడే మూత్ర సమస్యలను నేరేడు అదుపు చేస్తుంది.

  • నేరేడులో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియకు సహకరిస్తుంది. జీవక్రియ రేటు పెరుగుతుంది.

  • వాతావరణ మార్పులు, వర్షాకాలంలో సోకే రోగాల నుంచి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది.

  • నేరేడు ఐరన్ శాతం ఎక్కువ. ఇది మన శరీరానికి కావల్సిన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. 

  • నేరేడు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇందులో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 

  • నేరేడు అధిక రక్తపోటు నుంచి కూడా కాపాడుతుంది. 

  • నేరేడు ముఖం మీద మడతలు రాకుండా చూస్తుంది. దీన్ని రోజూ తింటే వృద్ధాప్య ఛాయలు కనిపించవు.  

  • దంతాలు, చిగుళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా నేరేడు మేలు చేస్తుంది.  

  • నేరేడు విత్తనంలో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కొందరు దీన్ని ఎండలో ఆరబెట్టి పొడిగా చేసుకుని తీసుకుంటారు. 

  • ఆస్తమా, బ్రాంకైటిస్‌ సమస్యలతో బాధపడేవారికి సైతం నేరేడు మంచిది. 


నేరేడు మేలు చేస్తుందని అదే పనిగా అతిగా తినొద్దు. దానివల్ల రక్తపోటు, జీర్ణ, చర్మ, శ్వాస సమస్యలు వస్తాయి.  


గమనిక: ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే అందించాం. కొన్ని ఆహారాలు అందరిలో ఒకే ఫలితాలను ఇవ్వవు. కొందరికి అలర్జీలను కూడా కలిగిస్తుంది. మీరు ఇప్పటికై ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లయితే వైద్యుడి సలహా తీసుకున్న తర్వాత ఇలాంటి పండ్లను తీసుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏపీబీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 


Also Read: కక్కుర్తి పడితే ఇంతే, ఆ ఫుడ్ కోసం తమ పేర్లను ఫన్నీగా మార్చుకున్న జనం, షాకిచ్చిన ప్రభుత్వం


Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..