అన్వేషించండి

Papaya Benefits : బ్రేక్‌ఫాస్ట్‌కి పండిన బొప్పాయి తింటే కలిగే లాభాలివే.. ప్రతిరోజూ తినొచ్చా?

Ripe Papaya : బొప్పాయి ఆరోగ్యానికి మంచిది. అయితే దీనిని ఖాళీ కడుపుతో తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. రోజూ తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Papaya Benefits and Precautions : రాత్రి నిద్ర తర్వాత ఉదయాన్నే శరీరానికి మంచి ఫుడ్ అందించడం చాలా అవసరం. మొదటి మీల్​లో బాడీకి కావాల్సిన పోషకాలు అందించే ఆహారం ఇవ్వాలి. తేలికపాటి బ్రేక్​ఫాస్ట్ తీసుకుంటే మీరు రోజంతా ఎనర్జిటిక్​గా ఉంటారు. ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది. అప్పుడే డే హెల్తీగా మొదలవుతుంది. యాక్టివ్​గా ఉంటారు. అలా మీరు హెల్తీగా తినాలనుకుంటే పండిన బొప్పాయి బెస్ట్ ఆప్షన్. అయితే దీనిని రోజూ తింటే శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు అందుతాయో చూసేద్దాం. 

జీర్ణక్రియ మెరుగుపడేందుకు

బొప్పాయిలో ఉండే పాపైన్ ఎంజైమ్.. ఆహారం త్వరగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. మలబద్ధకం, గ్యాస్‌, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారికి ఇది మంచి పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు.

బరువు తగ్గాలనుకునేవారికి..

బొప్పాయి తక్కువ కేలరీలతో ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఉదయం దీనిని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరంగా ఎక్కువ తినాలనే కోరిక తగ్గుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. 

రోగనిరోధక శక్తికై..

పండిన బొప్పాయిలో విటమిన్ C, విటమిన్ A పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. 

చర్మ ఆరోగ్యానికై..

నిపుణుల ప్రకారం బొప్పాయి రోజూ తినేవారిలో చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి స్కిన్ హెల్త్​కి మంచిదని అంటున్నారు.

గుండె ఆరోగ్యం కోసం

బొప్పాయిలో ఉండే ఫైబర్, పొటాషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండేందుకు ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ ఉన్నవారు తీసుకోవచ్చా?

నిపుణుల సూచన ప్రకారం బొప్పాయిని పరిమిత మోతాదులో డయాబెటిస్ ఉన్నవారు కూడా తీసుకోవచ్చు. అయితే ఒకేసారి ఎక్కువ మోతాదులో తినకుండా జాగ్రత్త అవసరం.

ఎలా తింటే మంచిదంటే.. 

ఉదయం ఖాళీ కడుపుతో ఒక కప్పు పండిన బొప్పాయి తింటే సరిపోతుంది. కొందరు రుచికోసం ఉప్పు, చక్కెర వేసుకుని తింటారు. కానీ అలా కాకుండా నేరుగా బొప్పాయిని తినడం మంచిది. బొప్పాయి తిన్న తర్వాత 20–30 నిమిషాల వరకు ఇతర ఆహారం తీసుకోకపోవడం మంచిది.

ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే..

గర్భిణీలు, అలర్జీ సమస్యలు ఉన్నవారు లేదా జీర్ణ సమస్యలు తీవ్రమైన వారు డాక్టర్ సలహాతో మాత్రమే బొప్పాయి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు చూడవచ్చు. లేదంటే తీసుకోకపోవడమే మంచిది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Summer Superfoods : వేసవిలో డీహైడ్రేషన్, అలసటకు చెక్.. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఇవే, ఆరోగ్యంగా ఉండేందుకు డైట్లో చేర్చుకోండి
వేసవిలో డీహైడ్రేషన్, అలసటకు చెక్.. ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ ఇవే, ఆరోగ్యంగా ఉండేందుకు డైట్లో చేర్చుకోండి
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
LPG Crisis Hits Hyderabad : హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
హైదరాబాద్‌లో LPG కష్టాలు.. పనిచేయని యాప్స్, గ్యాస్ బుకింగ్ కోసం ప్రజల పరుగులు
Cooking Without LPG : గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
గ్యాస్ లేకున్నా వంట చేయొచ్చు.. ఇండక్షన్ మాత్రమే కాదు ఈ ప్రత్యామ్నాయాలు కూడా హెల్ప్ చేస్తాయి
Advertisement

వీడియోలు

IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam
Irfan Pathan Predicts Future Captain of Team India | శ్రేయాస్ పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్స్ | ABP Desam
ICC T20 Rankings after T20WC | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా | ABP Desam
Shivam Dube's Secret Train Journey | ట్రైన్ లో ప్రయాణించిన వరల్డ్ కప్ హీరో | ABP Desam
Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: సీఎం చంద్రబాబు
భవానీ ద్వీపం ఇండియా, పాక్ బార్డర్‌లో ఉందా? హైదరాబాద్‌లో ఫ్లైఓవర్ కట్టలేకపోయా: చంద్రబాబు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. 5 ఫ్లోర్ బిల్డింగ్‌లో కాలిబూడిదైన ఫర్నీచర్
Tamil Nadu Assembly Elections 2026: దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
దళపతిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మైండ్ గేమ్ - ఎన్డీఏలో చేరిక ప్రచారం అంతా విజయ్‌ను బలహీనపరిచేందుకేనా?
Gas Charge In Hotel Bills: LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
LPG ఎఫెక్ట్.. హోటల్, రెస్టారెంట్లలో అదనంగా గ్యాస్ ఛార్జీలు! నెటిజన్ల రియాక్షన్ ఇదే
CEC Gyanesh Kumar : సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
సీఈసీపై అభిశంసన - దేశ చరిత్రలో మొదటి సారి - 193 మంది ఎంపీల సంతకాలు!?
Iran Israel War: ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
ఇకచాలు, వెంటనే చర్చలు జరపండి.. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ లకు UN సెక్రటరీ జనరల్ విజ్ఞప్తి
Ustaad Bhagat Singh : సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
సెకండాఫ్ ఇంటెన్స్ సీన్ పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది - ఫ్యాన్స్ గెట్ రెడీ అంటున్న హరీష్ శంకర్
LPG Delivery Delay : గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ డెలివరీ కాకపోతే.. ఇలా ఫిర్యాదు చేయండి
Embed widget