బీట్ రూట్ తినేవాళ్లు చాలా తక్కువ. కారణం దాని రూపం, రంగే. రంగును చూసి తినకూడదనుకుంటే నష్టం మనకే. దీన్ని గత రెండువేల ఏళ్లుగా ఆహారం తీసుకుంటున్నారు ప్రజలు. కానీ ఇప్పుడు దీన్ని తినే వాళ్లు చాలా తక్కువైపోయారు. బీట్ రూట్ ను వారంలో కనీసం రెండు సార్లయినా తినమని చెబుతున్నారు ఆరోగ్యనిపుణులు.
బీట్ రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు (Health Benefits of Beetroot):
1. బీట్ రూట్ లో బెలాటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లభిస్తుంది. ఇది క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. అందుకే బీట్ రూట్ తరుచూ తింటే మంచిది.
2. మహిళ్లలో రక్తహీనత సమస్య ఎక్కువ. ఎనిమియాతో బాధపడుతున్న స్త్రీలు రోజూ చిన్న కప్పుతో బీట్ రూట్ కూర తినడమో లేక పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తాగడమో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
3. బీట్ రూట్లో కొవ్వు ఉండదు. తింటే ఒంట్లో చేరే కెలోరీలు కూడా చాలా తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక.
4. బీట్ రూట్ విటమిన్, బి, సి లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి తరచూ తింటూ చర్మం మెరిసిపోవడం ఖాయం.
5. పొటాషియం, ఫోలేట్ నిల్వలు అధికం. గర్భిణులు తింటే పుట్టబోయే బిడ్డ రక్తహీనత సమస్య లేకుండా, ఆరోగ్యంగా పుడుతుంది.
6. పురుషులకు బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది. వారి లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది. వీళ్లు వారానికి రెండు సార్లయినా బీట్ రూట్ జ్యూసు తాగడం లేదా కూర తినడం చేయాలి.
7. డీ హైడ్రేషన్ బాధితులకు బీట్ రూట్ ఒక వరం. బీట్ రూట్ జ్యూసును తాగితే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. శరీరానికి అవసరమైన నీటి శాతాన్ని ఇది అందిస్తుంది.
8. మూడ్ ని రీఫ్రెష్ చేయడంలో ఈ దుంప ముందుంటుంది. మూడీగా ఉండే వారు బీట్ రూట్ రసం తాగడం అలవాటు చేసుకుంటే, ఉత్సాహవంతంగా మారుతారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఆ సమస్యతో బాధపడుతున్న మహిళలకు గర్భనిరోధక మాత్రలతో మేలు
Also read: ఇలాంటి వ్యక్తులతో వివాహమా... కాస్త ఆలోచించుకోండి
Also read: కెలోరీల గురించి భయపడకుండా రోజులో ఎప్పుడైనా వీటిని తినొచ్చు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి