Happy Valentines Day 2026 : హ్యాపీ వాలెంటైన్స్ డే 2026.. ప్రేమతో ప్రేమించిన వారికి వాట్సాప్, ఫేస్బుక్లో ఇలా విషెష్ చెప్పేయండి
Valentine’s Day Wishes : ప్రేమికులు ఎదురు చూసే వాలెంటైన్స్ డే వచ్చేసింది. మరి ఈ ప్రేమికుల రోజు మీరు ప్రేమించిన వారికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఇలా విష్ చేసేయండి.

Valentine’s Day Quotes and Wishes : ప్రతి సంవత్సరం ఫిబ్రవరి వచ్చిందంటే చాలు ప్రేమికులు ఎంతో యాక్టివ్‌గా కనిపిస్తారు. వాలెంటైన్ వీక్ చేసుకుంటూ.. ఫిబ్రవరి 14న వరకు వివిధ రూపాల్లో ప్రేమను వ్యక్తం చేస్తారు. తమ భావాలను మాటల్లో, బహుమతుల్లో, చిన్న చిన్న సర్ప్రైజ్‌ల్లో వ్యక్తపరుస్తారు. అసలు ఈ ప్రేమికుల దినోత్సవం ఎలా మొదలైంది? ప్రియమైన వారికి వాలెంటైన్స్ డే విషెష్ ఎలా విష్ చెప్పాలో.. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టావంటి సోషల్ మీడియాలో ఎలాంటి కోట్స్‌తో పోస్ట్‌లు పెట్టాలో చూసేద్దాం.
వాలెంటైన్స్ డే చరిత్ర
వాలెంటైన్స్ డే వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. రోమన్ కాలంలో Saint Valentine అనే పూజారి ఉండేవాడు. ఆ సమయంలో అక్కడి రాజు యువకులకు పెళ్లి చేసుకోవడం నిషేధించాడు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నవాళ్లు యుద్ధానికి వెళ్లరని అతని నమ్మకం. కానీ సెంట్ వాలెంటైన్ రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా రహస్యంగా ప్రేమికుల వివాహాలు జరిపించాడు. ఈ విషయం తెలిసిన తర్వాత అతన్ని జైలులో పెట్టి చివరికి ఫిబ్రవరి 14న శిక్ష అమలు చేశారు. ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చిన వ్యక్తిగా సెంట్ వాలెంటైన్ గుర్తింపు పొందాడు. అప్పటి నుంచే ఫిబ్రవరి 14ను అతనికి అంకితమిస్తూ వాలెంటైన్స్ డే జరుపుకుంటున్నారు.
వాలెంటైన్స్ డే ప్రేమికులకేనా?
అయితే ఈ ప్రేమికుల దినోత్సవం కేవలం గర్ల్‌ఫ్రెండ్–బాయ్‌ఫ్రెండ్‌లకే అనుకుంటే పొరపాటే. వాలెంటైన్స్ డే ఫ్యామిలీపై, ప్రియమైనవారిపై మీకున్న ప్రేమ, గ్రాటీట్యూడ్ని వ్యక్తపరిచే రోజుగా చూడవచ్చు. మరి ఈ స్పెషల్ డేన ఎలా వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్పవచ్చో చూసేద్దాం.
ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు
- నీతో ఉన్న ప్రతి రోజు నాకు వాలెంటైన్స్ డే లాంటిదే డియర్. హ్యాపీ వాలెంటైన్స్ డే.
- నా జీవితంలోకి ప్రేమ అంటే ఏంటో చూపించింది నువ్వే. లవ్ యూ రా బుజ్జి.
- మన బంధం ఇలాగే జీవితాంతం ప్రేమతో నిండిపోయి ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ వాలెంటైన్స్ డే లవ్.
- నిన్ను పెళ్లి చేసుకోవడం నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డిసిషన్. నీతో ఉండే ప్రతిరోజూ నాకు వాలెంటైన్స్ డే లానే ఉంటుంది.
- ప్రేమంటే రొమాన్స్ మాత్రమే కాదు… నిజమైన స్నేహం కూడా. హ్యాపీ వాలెంటైన్స్ డే మై డియర్ ఫ్రెండ్.
- నువ్వు నా లైఫ్‌లో ఉన్నందుకు థ్యాంక్స్. ఫ్రెండ్షిప్ విత్ లవ్. హ్యాపీ వాలెంటైన్స్ డే రా.
- నా జీవితానికి అర్థం ఇచ్చింది మీరే. హ్యాపీ వాలెంటైన్స్ డే అమ్మా–నాన్నా. మీ ప్రేమే నాకు బలం.
ఇలా మీరు ప్రేమించిన వారికి వాలెంటైన్స్ డే విషెష్ చెప్పేయవచ్చు. ప్రేమను లవర్స్‌కే కాదు.. ఫ్రెండ్స్, భార్య-భర్త, ఫ్యామిలీకి కూడా చెప్పవచ్చు. కాబట్టి నిస్సందేహంగా మీ ప్రేమను వ్యక్త పరచండి. ఎందుకంటే వాలెంటైన్స్ డే అంటే ఖరీదైన గిఫ్ట్‌లు కాదు. ఒక మంచి మాట, చిన్న కేర్, నిజమైన ప్రేమ. ఉంటే చాలు. అంతే.




















