Mothers Day 2026 Wishes : హ్యాపీ మదర్స్ డే విషెష్.. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాల్లో మాతృదినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పేయండి
Happy Mothers Day 2026 Wishes : మే 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మదర్స్ డే జరుపుకుంటున్నాము. ఈ స్పెషల్ డే రోజు వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల్లో మీ అమ్మకి హ్యాపీ మదర్స్ డే అంటూ విష్ చేసేయండిలా.

- తల్లి ప్రేమ జీవితంలో ధైర్యం, బలం ఇస్తుంది.
- తల్లి ప్రేమ స్వార్థం లేనిది, ఎక్కడా దొరకదు.
- తల్లి ఆశీర్వాదాలు జీవితంలో ప్రతి అడుగుకు బలం.
- తల్లుల సంతోషమే పిల్లల జీవిత లక్ష్యం.
Happy Mothers Day 2026 Wishes in Telugu : అమ్మ అంటే కేవలం ఒక పదం కాదు. అది ఒక అనుభవం. జీవితంలో ఎవ్వరూ ఇవ్వలేని ప్రేమ ఇచ్చేది అమ్మ మాత్రమే. అందుకే అమ్మను మించి దైవము.. ఆమెను మించిన యోధులు ఎవరూ లేరని అంటారు. పుట్టినప్పటి నుంచి మనం నడిచే ప్రతి అడుగులో అమ్మ చేయి ఉంటుంది. కష్టాల్లో ధైర్యంగా.. సుఖాల్లో సంతోషంగా.. ఇలా అన్ని ఎమోషన్స్ అమ్మతోనే ముడి పడి ఉంటాయి. అందుకే అమ్మల కోసం ఓప్రత్యేకమైన స్పెషల్ డే ఉంది. అదే మదర్స్ డే. మరి ఈ సందర్భంగా మీ అమ్మకు విషెష్ చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇలా చెప్పేయండి.
మాతృదినోత్సవ శుభాకాంక్షలు..
- అమ్మా.. నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా.. నీ దగ్గరికి వచ్చినా.. నీతో మాట్లాడినా చాలా ధైర్యం వచ్చేస్తాది. నా ధైర్యం, నా స్ట్రెంత్ నువ్వే అమ్మ. హ్యాపీ మదర్స్ డే.
- నీ కళ్లలో నేను చూసిన ప్రేమ.. నాకు ఇంక ఎక్కడా దొరకదు అమ్మ. స్వార్థం లేనిది నీ ప్రేమ. ఐ లవ్ యూ మామ్. హ్యాపీ మదర్స్ డే.
- నా మొదటి అడుగు నీ చేయి పట్టుకుని వేశాను. జీవితంలో నా ప్రతి అడుగు వెనుక నీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అవే నాకు బలం. మదర్స్ డే శుభాకాంక్షలు అమ్మా.
- ప్రపంచంలో ఎన్ని ప్రేమలు ఉన్నా.. నీ ప్రేమకు సాటి రావు. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
- ఈ లోకంలో నా ఫస్ట్, బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అమ్మ. నాకు వయసు ఎంతవచ్చినా.. ఎంతమంది ఫ్రెండ్స్ నా లైఫ్లోకి వచ్చినా నువ్వే నా బెస్ట్ బడ్డీ.
- జీవితంలో ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నా కన్నీళ్లు తుడిచావు. నవ్వు మరచిపోయినప్పుడు నవ్వించావు. నాకు ఎన్నోసార్లు తిరిగి జన్మనిచ్చావు. నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అమ్మ. నువ్వుంటే చాలు.
- నా ఆనందంలో నీ సంతోషాన్ని వెతుక్కుంటూ.. నా కష్టంలో తోడుగా ఉంటూ.. నాకోసం ఎన్నో త్యాగాలు చేసిన నీకు హ్యాపీ మదర్స్ డే అమ్మ. ఐ లవ్ యూ.
- ఎలాంటి ఒత్తిడిలో ఉన్నా.. నా మనసు తేలికైపోవాలంటే నువ్వు చాలు అమ్మ. ఐ మిస్ యూ. హ్యాపీ మదర్స్ డే.
- నీ సంతోషాలు, నీ ఇష్టాలు మాకోసం దూరం చేసుకుని.. మా ఆనందంలోనే నీ సంతోషాన్ని వెతుక్కున్న గొప్ప వ్యక్తివి నువ్వు అమ్మ. నెక్స్ట్ జన్మలో నేను నీకు తల్లిగా పుట్టి.. నీ రుణం తీర్చుకోవాలనుంది. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
- నా తప్పులను మందలించి.. నా కష్టాల్లో తోడుగా నిలిచి.. నా విజయాల్లో వెనక ఉన్న మొదటి మనిషి నువ్వే అమ్మా. హ్యాపీ మదర్స్ డే.
- అమ్మా ఈ ప్రపంచంలో ఎందరో సూపర్‌హీరోలు ఉన్నా.. నా హీరో మాత్రం నువ్వే. నీ ప్రేమే నీ సూపర్ పవర్. హ్యాపీ మదర్స్ డే మామ్.
- దేవుడు అందరికీ తోడుగా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. నిజమే అమ్మా. నువ్వు నాకు దేవమై. హ్యాపీ మదర్స్ డే.
- అమ్మా నీ నవ్వు చూస్తే ప్రపంచంలోని అన్ని బాధలు మరిచిపోతాను. నీ ఆనందమే నా జీవిత లక్ష్యం. హ్యాపీ మదర్స్ డే రా చిట్టి.
- నీ గురించి రాయాలంటే పదాలు సరిపోవు అమ్మా. అందుకే ఐ లవ్ యూ. నువ్వే నా ప్రపంచం. ఇంతకు మించి ఏమి చెప్పగలను. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
- ఎన్ని జన్మలు ఎత్తినా నేను నీకు బిడ్డగానే పుట్టాలని కోరుకుంటాను. నీ ప్రేమ ఈ జన్మకే కాదు అన్ని జన్మలకు కావాలి. నీతో తిట్టించుకోవాలి. నీతో కొట్టించుకోవాలి. నీ ప్రేమను మళ్లీ అనుభవించాలి. హ్యాపీ మదర్స్ డే అమ్మ.
ఈ మదర్స్ డే రోజు మీరు మీ అమ్మకు ఏ గిఫ్ట్ ఇవ్వకున్నా పర్లేదు కానీ.. దగ్గరగా ఉంటే ఓ హగ్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పి.. హ్యాపీ మదర్స్ డే చెప్పండి. అమ్మ కదా.. హ్యాపీగా ఫీల్ అవుతుంది. దూరంగా ఉంటే కాల్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పండి. పిల్లలు తనని ప్రతీ దశలో గుర్తించుకోవడమే.. నిజమైన బహుమతిగా ఫీల్ అవుతారు అమ్మలు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇది క్లిక్ చేయండి.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















