Mothers Day Date in 2025 : తల్లిపై ప్రేమను చూపించడానికి ప్రత్యేకమైన తేది, ప్రత్యేకమైన రోజు అవసరం లేదు. వారిపై ఎప్పుడూ.. ఎలా ప్రేమను చూపించినా వారు మీకు వందరెట్లు ప్రేమను అందిస్తారు. అయితే వారికంటూ స్పెషల్‌గా ఓ రోజును డెడికేట్ చేసి.. ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రతి ఏడాది మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డేని నిర్వహిస్తున్నారు. అసలు ఈ డేని ప్రారంభించడం వెనక రీజన్ ఏంటి? ఈరోజు ఎందుకింత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మదర్స్ డే 2025 తేది..
మదర్స్ డేని ప్రతి ఏడాది మే నెలలో రెండవ ఆదివారం రోజు జరుపుకుంటారు. 2025లో మదర్స్ మే 11వ తేదీన(రెండో ఆదివారం) వచ్చింది. ఈ స్పెషల్ డేని ఇండియాతో సహా పలు దేశాల్లో జరుపుకుంటారు. అయితే పొరుగుదేశాల నుంచే ఈ స్పెషల్ రోజుని భారత్‌లో కూడా సెలబ్రేట్ చేయడం ప్రారంభించారు.
మదర్స్ డే చరిత్ర
గ్రీకు, రోమన్ల కాలం నుంచే మదర్స్ డేని జరుపుకునేవారు. దేవతలను మాతృ దేవతలుగా గౌరవిస్తూ పండుగలు చేసుకునేవారు. 20వ శతాబ్ధంలో అన్నా జార్విస్ అనే అమెరికన్ సామాజిక కార్యకర్త.. తన తల్లి మరణం తర్వాత.. తల్లులకు ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేయాలని ప్రచారాలు చేశారు. అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914 నుంచి మే నెలలోని ప్రతి రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం అమెరికా నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలు మదర్స్ డేని స్వీకరించాయి.
మదర్స్ డే ప్రాముఖ్యత..
తల్లులు పిల్లల కోసం చేసే త్యాగాలు గుర్తు చేసుకుంటూ వారికి, మాతృత్వానికి గౌరవమిస్తూ మదర్స్ డేని సెలబ్రేట్ చేస్తారు. తల్లి ప్రేమ, త్యాగం వంటి వాటిని హైలెట్ చేస్తూ తల్లిపై మనకున్న ప్రేమను చాటడాన్ని ఈ స్పెషల్ డే ప్రాముఖ్యతగా చెప్పవచ్చు.
మదర్స్ డే సెలబ్రేషన్స్
అమ్మలకు తమ ప్రేమను వ్యక్తం చేస్తూ హగ్ ఇవ్వడం, ఓ లెటర్ రాయడం, పూలు ఇవ్వడం వంటి స్వీట్ సర్ప్రైజ్లు ఇవ్వొచ్చు. ఆమెకు నచ్చిన డ్రెస్ లేదా చీర కొనడం. నచ్చిన ఫుడ్ చేసి పెట్టడం. నచ్చిన ప్రదేశానికి తీసుకెళ్లడం వంటివి చేయొచ్చు. మీ బడ్జెట్‌కి తగ్గట్లు అమ్మలకు గిఫ్ట్‌లు కూడా కొనవచ్చు. మదర్స్‌ని తీసుకుని ఓ లంచ్ డేట్‌కి కూడా వెళ్లొచ్చు.
ఇవన్నీ రోజూ చేసేవారు ఉండొచ్చు. కానీ చదువుల్లో, ఉద్యోగాల్లో బిజీగా ఉండేవారు ఈ స్పెషల్ డే రోజున వారితో కలిసి ఉంటే.. ఏడాదంతా వారు సంతోషంగా ఉంటారని గుర్తించుకోండి. ఈ స్పెషల్ డే రోజు అయినా అమ్మ చూపించిన ప్రేమకు ఓ థ్యాంక్యూ అయినా చెప్పి.. ఆమె కళ్లలోని ఆనందాన్ని చూసి మదర్స్ డేని సెలబ్రేట్ చేసేయండి.