Gayatri Devi Naivedyam Coconut Rice Recipe : నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో పూజిస్తారు. దానిలో భాగంగా అమ్మవారు రెండోరోజున గాయత్రీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఏడాది నవరాత్రుళ్లో రెండో రోజు సెప్టెంబర్ 23వ తేదీన వచ్చింది. అయితే ఈ రెండో రోజు అమ్మవారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించాలని చెప్తారు. మరి వాటిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

కొబ్బరి అన్నం కోసం కావాల్సిన పదార్థాలు

నీళ్లు - 8 కప్పులు

బియ్యం - కప్పు

Continues below advertisement

దాల్చిన చెక్క - కొంచెం

లవంగాలు - రెండు

యాలకులు - ఒకటి

నెయ్యి - ఒక టీస్పూన్

నెయ్యి - మూడు టీస్పూన్లు

ఆవాలు - అర టీస్పూన్

పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్

అర టీస్పూన్ - జీలకర్ర 

జీడిపప్పులు - 20

ఎండుమిర్చి - 1

పచ్చిమిర్చి - 2

కరివేపాకు - కొద్దిగా

మిరియాలు - పావు టీస్పూన్

కొబ్బరి తురుము - 2 కప్పులు

ఉప్పు - అర టీస్పూన్

కొత్తిమీర - గుప్పెడు

తయారీ విధానం

ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టౌవ్ వెలిగించి ఓ పెద్ద గిన్నె పెట్టి దానిలో 8 కప్పుల నీరు వేయాలి. దానిలోనే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, నెయ్యి వేయాలి. నీరు మరిగిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మంచిగా వండుకోవాలి. బియ్యం ఉడికిన తర్వాత గంజిని వార్చుకోవాలి. అన్నంలోని నీరు పూర్తిగా వాడేలా చూసుకోవాలి. 

వేడిగా ఉన్న అన్నాన్ని ఓ పల్లెంలో వేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల దానిలోని నీరు మరితం దూరమవుతుంది. అన్నం పొడిగా, అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మరో కడాయి పెట్టాలి. దానిలో మూడు టీస్పూన్ల నెయ్యి వేసి.. ఆవాలు, పచ్చి శనగపప్పు వేసి వేయించుకోవాలి. దానిలోనే జీలకర్ర, జీడిపప్పులు కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి.

ఇలా తాళింపు రెడీ అవుతున్న సమయంలో రెండు కప్పుల కొబ్బరి తురుము వేసి బాగా కలపాలి. అవి బాగా కలిసేలా మంటను తగ్గించి మూడు నిమిషాలు ఉడికించాలి. ఇలా చేయడం వల్ల కొబ్బరిలోని నీరు తగ్గి.. పొడి పొడిలాడుతుంది. ఆ సమయంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఉప్పు, కొత్తిమీర కూడా వేసి.. అన్ని కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేసిన మరికొంత సేపు మగ్గనివ్వాలి. 

అన్నాన్ని ఇలా మగ్గనివ్వడం వల్ల ఫ్లేవర్స్ అన్ని బాగా వస్తాయి. అంతే వేడి, వేడి కొబ్బరి అన్నం రెడీ. దీనిని గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. మరికొందరు దీనితో పాటు అల్లం గారెలు కూడా సమర్పిస్తారు. మీ ఓపికని బట్టి వాటిని కూడా మీరు తయారు చేసి సమర్పించవచ్చు. అలాగే మరికొందరు గాయత్రి అమ్మవారికి దద్యోజనం కూడా నైవేద్యంగా పెడతారు. మీ ఇష్టాన్ని బట్టి వీటిని మీరు తయారు చేసుకోవచ్చు.