South India Destinations to Explore This Winter : చలికాలంలో సౌత్ ఇండియా చాలా అందంగా ఉంటుంది. పచ్చదనంతో, పొగమంచుతో కూడిన కొండలు, లేత సూర్యకాంతిలో మెరిసే ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, సువాసనలు ఇచ్చే తోటలు, ఆహ్లాదకరమైన వాతావరణంతో సౌత్ ఇండియా మారుతుంది. ,ప్రశాంతమైన సరస్సులు, పురాతనమైన దేవాలయాలు, టీ తోటలు, వన్యప్రాణులతో కూడిన అభయారణ్యాల ఇలా ప్రతీది మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ వింటర్​లో ట్రిప్​కి వెళ్లాలనుకుంటే సౌత్​ ఇండియాలో చూడదగ్గ ప్రదేశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

కర్ణాటక, కూర్గ్

(Image Source: freepik)

కాఫీ తోటలతో నిండిన, దట్టమైన అడవులతో చుట్టుముట్టిన కూర్గ్ మీకు ప్రశాంతమైన, అడ్వెంచర్ ట్రిప్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. శీతాకాలంలోని చల్లని గాలులు వాటితో వచ్చి కాఫీ వాసన మీకు రిఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. వీటితోపాటు మీరు జలపాతాలు చూడవచ్చు. హోమ్‌స్టేలు కూడా మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. అందుకే కూర్గ్ వింటర్​లో వెళ్లేందుకు బెస్ట్ ప్లేస్ అవుతుంది.

కేరళ, అలెప్పీ

(Image Source: Canva)

ప్రశాంతమైన బ్యాక్‌వాటర్స్, సుందరమైన హౌస్‌బోట్‌లకు అలెప్పీ ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన కాలువల వెంట జారండి, తాటి చెట్లు చూసేందుకు అందంగా ఉంటాయి. లగ్జరీ స్టేయింగ్స్ మీకు మంచి అనుభూతిని ఇస్తాయి. కేట్టువల్లమ్‌ల ట్రెడీషన్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. చల్లని గాలి, ప్రశాంతమైన సరస్సులు, ప్రకృతి ట్రిప్​కి వెళ్లేందుకు అనువైనది.

Continues below advertisement

తమిళనాడు, మహాబలిపురం

(Image Source: Canva)

మహాబలిపురం ఒక తీర పట్టణం. ఇక్కడి ఇసుక బీచ్‌లు, పురాతన రాతి కట్టడాలు చూసేందుకు అనువైనవి. శీతాకాలపు సూర్యుడు ఆ కట్టడాలపై పడినప్పుడు చూసేందుకు చాలా అందంగా కనిపిస్తాయి. స్మారక చిహ్నాల ఆకర్షణను పెంచుతాయి. సముద్రపు గాలి, ఆధ్యాత్మిక వాతావరణానికి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు ఇచ్చింది. 

తమిళనాడు, ఊటీ

(Image Source: Canva)

నీలగిరి కొండల మధ్య నెలకొని ఉన్న ఊటీ పొగమంచుతో కూడిన ఉదయం, వికసించే తోటలతో శీతాకాలంలో భూతల స్వర్గంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి క్షణం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రియమైన శీతాకాలపు ప్రదేశాలలో ఒకటిగా నిలుస్తుంది.

కేరళ, కుమారకోమ్

(Image Source: Canva)

వేంబనాడ్ సరస్సు ఒడ్డున ఉన్న కుమారకోమ్ పచ్చటి నీరు, పచ్చని వరి పొలాలతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో ఈ ప్రదేశం మరింత ప్రశాంతంగా ఉంటుంది. పక్షులను చూడటానికి, బోటింగ్ చేయడానికి, స్లో లైఫ్​కి ఈ ప్లేస్ బెస్ట్ ఆప్షన్. 

తమిళనాడు, కూనూర్

(Image Source: Canva)

ఊటీ కంటే తక్కువ రద్దీగా ఉన్నప్పటికీ.. కూనూర్ దాని కొండపై ఉన్న టీ తోటలు, ప్రశాంతమైన వైబ్‌ ఇస్తాయి. నీలగిరి కొండల మధ్య ప్రకృతిలో వాకింగ్, ట్రెక్కింగ్‌లు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. వింటర్​లో ట్రిప్​కి వెళ్లేందుకు బెస్ట్ ప్లోస్​లలో ఇది కూడా ఒకటి.