Foods For Weight Loss : కొవ్వును తగ్గించి, మెటబాలిజాన్ని మెరుగుపరిచే ఫుడ్స్ ఇవే.. బరువు తగ్గాలనుకుంటే తీసుకోవచ్చు
Healthy Weight Loss Foods : బరువు, కొవ్వు తగ్గి.. మెటబాలీజం పెంచుకోవాలనుకుంటే మీ డైట్లో కొన్ని ఫుడ్స్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. మరి ఆ ఫుడ్స్ ఏంటో.. వాటిని ఎలా తీసుకుంటే మంచిదో చూసేద్దాం.

- పచ్చిమిర్చి, కొబ్బరి నూనె కూడా మెటబాలీజంకు సహాయపడతాయి.
Foods That Boost Metabolism Lose Weight : బరువు తగ్గాలని చూసేవారు కచ్చితంగా ఆహారంలో చాలా మార్పులు చేస్తారు. కొందరు అన్నం తగ్గిస్తే.. మరికొందరు ఉదయాన్నే జీలకర్ర నీళ్లు, గ్రీన్ టీ, మెంతుల నీళ్లు వంటివి తాగుతుంటారు. అయితే మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరిచి.. మెటబాలీజం పెంచడంలో హెల్ప్ చేస్తాయి. పైగా వాటిలోని పోషకాలు, యాక్టివ్ కాంపౌండ్స్ కొవ్వును తగ్గించి.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో.. వాటిని తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో కాటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, కొంతమేర కెఫిన్ ఉంటాయి. ఇవి శరీరంలో కొవ్వు ఆక్సీకరణ ప్రక్రియకు హెల్ప్ చేస్తాయి. అలాగే గ్రీన్ టీ తాగడం వల్ల జీవక్రియలపై కొంత ప్రభావం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించి మెటబాలీజం పెంచడంలో హెల్ప్ చేస్తుంది. తేనె తక్కువ మోతాదులో కలిపి దీనిని తీసుకోవచ్చు.
Also Read : కాలేయంలో కొవ్వు పెరిగిందా? ఈ 5 ఫుడ్స్ వెంటనే డైట్‌లో చేర్చుకోండి.. సిర్రోసిస్ ప్రమాదం తగ్గుతుంది
మెంతులు
మెంతుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిలోని కరిగే ఫైబర్ కడుపు నిండిన ఫీలింగ్ ఇవ్వడంతో పాటు.. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణకు హెల్ప్ చేస్తుంది. దీంతో తరచూ ఆకలి వేయడం తగ్గవచ్చు. వీటిని తీసుకోవడం కోసం మీరు ముందు రోజు మెంతులు నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగడంతో పాటు మెంతులు కూడా తినవచ్చు.
జీలకర్ర
జీలకర్రలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఆ నీటిని తాగడం వల్ల కొందరిలో కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా కొంతవరకు తగ్గవచ్చు. కాబట్టి జీలకర్రను నీటిలో వేసి మరిగించి.. ఉదయాన్నే గోరువెచ్చగా తీసుకోవచ్చు. టీ, కాఫీలను పక్కన పెట్టి హెల్తీగా డే ప్రారంభించేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.
Also Read : జిమ్, నో-కార్బ్ డైట్‌తో తగ్గేది కొవ్వు కాదట.. బరువు తగ్గడానికి తమన్నా ఫిట్‌నెస్ కోచ్ ఇస్తోన్న టిప్స్ ఇవే
కరివేపాకు
కరివేపాకులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, వివిధ రకాల మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి తోడ్పడతాయి. కరివేపాకును పప్పు, కూరలు, చట్నీలు, అన్నంలో భాగంగా తీసుకోవచ్చు. ఇది సమతుల్య ఆహారంలో భాగంగా ఉపయోగపడుతుంది. అయితే కేవలం కరివేపాకు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందని లేదా శరీరంలోని కొవ్వు వేగంగా కరిగిపోతుంది అనుకోకూడదు.
పసుపు
పసుపులో కర్కుమిన్ అనే యాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. దీనికి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. శరీరంలో వాపు సంబంధిత ప్రక్రియలను నియంత్రించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. రోజువారీ వంటల్లో పసుపును ఉపయోగించడం మంచిది.
Also Read : ఎన్ని నిమిషాలు నడిస్తే కొవ్వు కరగడం స్టార్ట్ అవుతుందో తెలుసా? బరువు తగ్గేందుకు ఈ ప్రో టిప్ ఫాలో అయిపోండి
పచ్చిమిర్చి
కారం ఎక్కువగా ఉండే ఎర్ర, పచ్చి మిరపకాయల్లో క్యాప్సైసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో థర్మోజెనిసిస్ ప్రక్రియను కొంతవరకు పెంచుతుంది. అంటే శరీరం వేడిని ఉత్పత్తి చేసే సమయంలో కొంత అదనపు శక్తిని ఖర్చు చేస్తుంది. దీనివల్ల క్యాలరీల వినియోగంపై స్వల్ప ప్రభావం ఉండవచ్చు. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
పెరుగు
పెరుగులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. లైవ్ కల్చర్స్ ఉన్న పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియా సమతుల్యతకు తోడ్పడుతుంది. అలాగే ఇందులోని ప్రోటీన్ వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో అనవసరంగా స్నాక్స్ తినడం తగ్గవచ్చు.
Also Read : EMS ట్రీట్మెంట్తో కొవ్వు తగ్గుతుందా? వ్యాయామం, డైట్ చేయకపోయినా ఇంచ్ లాస్ అవ్వడంలో నిజమెంతంటే
కొబ్బరి నూనె
కొబ్బరి నూనెలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో ఇతర కొవ్వులతో పోలిస్తే భిన్నంగా జీర్ణమై శక్తిగా వినియోగమవుతాయి. అయితే మార్కెట్లో లభించే సాధారణ కొబ్బరి నూనెను స్వచ్ఛమైన MCT ఆయిల్‌తో సమానంగా చూడకూడదు. ఇందులో సంతృప్త కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గడానికి స్వచ్ఛమైన కొబ్బరి నూనెను తగిన మోతాదులో తీసుకోవచ్చు. అలాగే దీనిని వినియోగించాలనుకున్నప్పుడు వైద్యుల సలహా కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మెటబాలీజం మెరుగుపరిచే మరిన్ని టిప్స్..
బరువు తగ్గాలని.. మెటబాలీజం మెరుగుపరచుకోవాలని చూస్తున్నప్పుడు కేవలం ఫుడ్స్ మీదనే కాకుండా మరిన్ని విషయాలపై ఫోకస్ పెట్టాలి. రోజూ కనీసం 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. వారానికి కనీసం 150 నిమిషాల మితమైన వ్యాయామం చేయాలి. కండరాల బలం పెంచే స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. తగినంత నీళ్లు తాగాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్, షుగర్ డ్రింక్స్ తగ్గిస్తే మంచి ఫలితాలు చూస్తారు.
Also Read : జంతువుల కొవ్వు ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? దీర్ఘకాలిక సమస్యలు తప్పవంటోన్న నిపుణులు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















