Develop a punctuality mindset :  సమయం పోతే మళ్లీ రాదు అంటారు. కానీ సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియకపోతే.. ఎంత సమయం ఉన్నా దానిలో ప్రొడెక్టెవిటీ ఉండదు. చాలామంది ఫేస్ చేసే అత్యంత సాధారణ విషయాల్లో టైమ్ మేనేజ్​మెంట్ ఒకటి. ముఖ్యంగా ఈ ఫోన్​లు, సోషల్ మీడియా వాడకం ఎక్కువయ్యేకొద్ది.. చాలామందికి సమయం అస్సలు సరిపోవట్లేదు. అలా అని బిజీగా వర్క్ చేసి.. దాని వల్ల సమయం సరిపోవట్లేదా అంటే.. అది ఉండదు. మరి ఈ సమయం అంతా ఎటుపోతుంది? దానిని ఎలా మేనేజ్ చేసుకోవాలి?


సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మీరు ఎప్పుడూ ఆన్​ టైమ్ ఉండలేరు. పైగా మీపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేందుకు కొన్ని రియాలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోవాలి. మీరు చేసే పనికి.. ఎంత సమయం పడుతుందో గుర్తించుకోవాలి. దానికి తగ్గట్లు రెగ్యూలర్ పనులు షెడ్యూల్ చేసుకోవాలి. మీది రోటీన్ లైఫ్ అయితే.. వారానికి, నెలకి మీరు షెడ్యూల్ పెట్టుకోవచ్చు. అయితే ఇదే షెడ్యూల్​కి టాస్క్​లు కంప్లీట్ చేయలేకపోవచ్చు కాబట్టి.. టాస్క్​కి మధ్యలో కాస్త సమయం ఉండేలా చూసుకోండి. 


మార్నింగ్ రోటీన్ ఎలా ఉండాలంటే.. 


ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తే కచ్చితంగా సమయం ఎక్కువ మిగులుతుంది. ఉదయాన్నే త్వరగా నిద్రలేవాలంటే.. రాత్రుళ్లు త్వరగా పడుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏమిటంటే.. అలారం మోగగానే దానిని ఆపి.. మళ్లీ అలారమ్ సెట్ చేసుకుని పడుకుంటారు. ఇది అస్సలు మంచిదికాదు. అలారం మోగిన వెంటనే లేస్తే మంచిది. ఇలా ఉదయం లేచిన వెంటనే వర్క్ చేయమని కాదు.. మీ పర్సనల్ టైమ్​ తీసుకోవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. ముందురోజు రాత్రి.. మీరు నెక్స్ట్​ డే వేసుకోవాల్సిన డ్రెస్​లు, బ్యాగ్ సిద్ధం చేసుకుంటే.. మార్నింగ్ హడావుడి లేకుండా ఉంటుంది. అలాగే బ్రేక్​ఫాస్ట్ ఏమి తీసుకోవాలో ముందే ఆలోచించుకుంటే.. ఉదయాన్నే దానిని ప్రిపేర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. 


టైమ్ మేనేజ్మెంట్.. 


మీరు రోజులో చేయాల్సిన అతిముఖ్యమైన టాస్క్​ ఏంటో తెలుసుకోండి. దానిపై వర్క్ చేసేందుకు సమయాన్ని కేటాయించండి. అలాగే మీరు ఎప్పుడూ బ్రేక్ తీసుకోవాలి.. ఎప్పుడు టాస్క్​ కంప్లీట్ చేయాలో తెలుసుకుని.. ఆ టైమింగ్స్​కి స్టిక్​ అవుతూ ఉంటే.. వర్క్ కంటిన్యూగా జరుగుతుంది. నో చెప్పడం తెలుసుకోండి. మీ పనులు మానేసి.. ఇతరుల పనులకు ఓకే చెప్పడం వల్ల మీ వర్క్ పెండింగ్​లో పండుతుంది. మీ వర్క్ చేసిన తర్వాత సమయం ఉంటే.. ఇతరులకు హెల్ప్ చేయవచ్చు. 


ప్రయాణం చేసేప్పుడు.. 


చాలామందికి సమయం వేస్ట్ అయ్యేది ఎప్పుడంటే ఆఫీస్​కి వెళ్లేప్పుడు. ట్రాఫిక్​లో చిక్కుకుపోయి.. ఆ చిరాకుతో ఆఫీస్​కి వెళ్లి.. టైమ్​ని వేస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ట్రాఫిక్​ ఎప్పుడూ ఉండదనే అంచనాకు వచ్చి.. మీరు వెళ్లాల్సిన రూట్​ని ఫిక్స్ చేసుకోవాలి. ట్రాఫిక్​లో చిక్కుకోకూడదనుకుంటే.. కాస్త ముందుగా వెళ్లాలి. మీరు వెళ్లే రూట్​ ఎప్పుడూ బిజీగానే ఉంటుందనుకుంటే.. ముందుగానే ఆఫీస్​కి బయలుదేరి వెళ్లాలి. 



అలవాటు చేసుకోండి.. 


ఏదైనా టైమ్​ అనుకుంటే దానికి punctualityగా ఉండేలా చూసుకోండి. ఇది మీకో అలవాటులా మారితే మంచిది. అపాయింట్​మెంట్స్, డెడ్​లైన్స్ వంటివి ఉంటే రిమైండర్స్ పెట్టుకోవాలి. మీ షెడ్యూల్​ను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. మీరు ఏ పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నారో టైమ్​ని ట్రాక్ చేయండి. 


సోషల్ మీడియాకు కూడా ఓ టైమ్​ని సెట్​ చేసుకోండి. ఆ పరిధి దాటకుండా ఉండేలా చూసుకోండి. బ్రేక్ ఎప్పుడూ చిన్నవిగానే ఉండాలి. కానీ రెగ్యూలర్​ బ్రేక్స్ తీసుకోవాలి. మీ షెడ్యూల్​ని డిస్టర్బ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని అడ్జెస్ట్ ఎలా చేసుకోవాలో ప్లాన్​ బి పెట్టుకోవాలి. ఈ టిప్స్ రెగ్యూలర్​గా ఫాలో అయితే.. మీరు అనుకున్న పనిని.. అనుకున్న సమయంలో చేయగలుగుతారు. ఒత్తిడి కూడా ఉండదు. 



Also Read : రిలేషన్ షిప్​లో 2-2-2 రూల్.. హ హ ఈ రూల్ ఫాలో అయితే బ్రేకప్స్ జరగవేమో