Summer Tips: సమ్మర్ వచ్చింది చాలు ఫ్యాన్స్, ఏసీలు, కూలర్స్ గుర్తుకు వస్తాయి. ఇప్పటి వరకు అవి ఎలా పని చేస్తాయో అని చూస్తుంటారు. కొందరు టెక్నీషియన్స్‌ను పిలుస్తారు. మరికొందరు సొంతంగానే రిపేర్ చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు వేసవిలో ఫ్యాన్లు తక్కువ స్పీడ్‌తో తిరుగుతుంటాయి. వాటి వేగం తగ్గడం వల్ల గాలి కూడా తక్కువగా వస్తంది. అయితే, దీని కోసం ఎలక్ట్రీషియన్‌ను పిలవాల్సిన పని లేకుండానే కొన్నిసార్లు మీరు సొంతంగా పరిష్కరించుకోవచ్చు.
వేసవిలో మీ ఫ్యాన్ నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తే, ఈ సమస్య సర్వసాధారణం కావచ్చు. దుమ్ము పేరుకుపోవడం, కెపాసిటర్ పనిచేయకపోవడం లేదా మోటారులో సమస్య వంటి వివిధ కారణాల వల్ల ఇది జరగొచ్చు. మీ ఫ్యాన్ వేగంగా తిరుగుతూ ధారాళంగా గాలి వచ్చేలా చేయడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు. వాటి గురించి తెలుసుకుందాం.
ఫ్యాన్ శుభ్రం చేయండి
ఫ్యాన్ బ్లేడ్లు, మోటార్ హౌసింగ్‌లపై దుమ్ము పేరుకుపోవడం వేగాన్ని ప్రభావితం చేస్తుంది. కనీసం వారానికి ఒకసారి పొడి గుడ్డ లేదా వాక్యూమ్ క్లీనర్‌తో వాటిని క్లీన్ చేయండి.
కెపాసిటర్‌ను తనిఖీ చేసుకోండి
ప్యాన్ స్లోగా తిరగడానికి కెపాసిటర్ కూడా కారణం కావచ్చు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవచ్చు. కెపాసిటర్లు 50-100 రూపాయలకు లభిస్తాయి. ఏ ఎలక్ట్రీషియన్ అయినా వాటిని సులభంగా ఫిట్ చేస్తారు. చిన్న ఐడియా ఉంటే మీరైనా ఫిట్ చేసుకోవచ్చు.
లూబ్రికేషన్ (నూనె) వేయండి
కాలక్రమేణా ఫ్యాన్ బేరింగ్‌లలో ఘర్షణ పెరుగుతుంది. దీనివల్ల కూడా నెమ్మదిస్తుంది. మోటారు రెండు వైపులా కొద్ది మొత్తంలో మెషిన్ ఆయిల్‌ను అప్లై చేయండి. ఇది కూడా ప్యాన్ వేగాన్ని పెంచుతుంది.
వోల్టేజ్ తనిఖీ చేయండి
తక్కువ వోల్టేజ్ కారణంగా కూడా ఫ్యాన్ నెమ్మదిగా తిరుగుతుంది. మీ ప్రాంతంలో వోల్టేజ్ కంటిన్యూగా తక్కువగా ఉంటే ఫ్యాన్ నెమ్మదిగా తిరగడమే కాకుండా పూర్తిగా పాడైపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే స్టెబిలైజర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం మంచిది.
రెగ్యులేటర్‌ను మార్చండి
పాత రెగ్యులేటర్ల సామర్థ్యం క్రమేణా తగ్గిపోతుంది. దీని వల్ల కూడా ఫ్యాన్స్ తిరగడం స్లో అవుతుంది. దీనికి పరిష్కారం ఎలక్ట్రానిక్ రెగ్యులేటర్‌ను ఇన్‌స్టాల్ చేయడమే. ఇది చవకైనది, ప్రభావవంతమైంది.
కొన్నిసార్లు మోటార్ బైండింగ్ దెబ్బతినడం వల్ల ఫ్యాన్ నెమ్మదిగా నడుస్తుంది, కాబట్టి అనేక ప్రయత్నాల తర్వాత కూడా ఫ్యాన్ నెమ్మదిగా నడుస్తుంటే మోటారును మార్చాల్సి రావచ్చు.
