Makeup Tips in Telugu : అందంగా కనిపించేందుకు చాలా మంది మేకప్ వేసుకుంటారు. అయితే వయసు పెరిగే కొద్ది కూడా సేమ్ మేకప్ టిప్స్ ఫాలో అయితే ఎలా? మిమ్మల్ని మరింత అందంగా తీర్చిదిద్దే, యవ్వనంగా మార్చే టిప్స్​ కూడా ఫాలో అవ్వాలి. అప్పుడే మీరు వేసుకునే మేకప్​కి ఓ అర్థం ఉంటుంది. ఏ లుక్​ని ట్రై చేయాలన్నా.. మేకప్​ గురంచిన అన్ని విషయాలు తెలిసి ఉండాలి. వాటిని ఎలా ఉపయోగించాలి? ఎలాంటి స్ట్రోక్ ఇస్తే కావాల్సిన లుక్​ వస్తుందనేది తెలిసి ఉండాలి. అప్పుడు మేకప్ మీ అందాన్ని మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీకు యవ్వనమైన లుక్​ని ఇస్తుంది. మీరు మేకప్​లో సరిగ్గా కనిపించట్లేదు అంటే మీరు మేకప్​ వేసుకోవడంలో పొరపాటు చేస్తున్నారని అర్థం. అయితే మేకప్​ సమయంలో పాటించే సింపుల్ టిప్స్ మీకు యంగ్ లుక్​ని ఇస్తాయి. ఇంతకీ అవేమి టిప్స్​? వాటిని ఎలా అప్లై చేయాలి?


ఫస్ట్ టిప్


మీరు ఎలాంటి మేకప్ వేసుకున్నా.. ముందుగా మీ చర్మాన్ని మేకప్​ కోసం సిద్ధం చేసుకోవాలి. సహజమైన మెరుపు కోసం మీరు మేకప్ చేయడానికి ముందే మీ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయాలి. ఇది మీ స్కిన్​ హైడ్రేటెడ్​గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం హెడ్రైట్​గా లేకుంటే మీ మేకప్ డల్​గా, నిర్జీవంగా కనిపిస్తుంది. స్కిన్ హైడ్రేట్​గా ఉంటే.. ముఖం స్మూత్​గా, బొద్దుగా కనిపించడమే కాకుండా మేకప్​ను సమానంగా బ్లెండ్ చేస్తుంది. 


సెకండ్ టిప్


మీరు మేకప్​ వేసుకోవాలనుకున్నప్పుడు ముందుగా మీ ముఖంపై ఉన్న మచ్చలను కవర్ చేసుకోవాలి. అప్పుడే మేకప్​ లుక్​లో ఎలాంటి లోపాలు ఉండవు. కొందరు ఇది ఫాలో అవ్వకుండా నేరుగా మేకప్ అప్లై చేస్తారు. దీనివల్ల అక్కడక్కడ మరకలున్నట్లు మొహం కనిపిస్తుంది. కాబట్టి నల్ల మచ్చలను, మొటిమలను కవర్ చేయడం కోసం మీరు కన్సీలర్ ఉపయోగించవచ్చు. అయితే మీ చర్మానికి సూట్ అయ్యే కన్సీలర్ షేడ్​ని మాత్రమే ఎంచుకోవాలి. ఇది మీ మొఖంపై ఉన్న మచ్చలు కవర్ చేసి మీకు మంచి లుక్​ ఇస్తుంది. కన్సీలర్​ మీరు ఎంచుకునేప్పుడు మీ స్కిన్​ టోన్​కి దగ్గర షేడ్ ఎంచుకోవాలి. 


థర్డ్ టిప్


మీ కనుబొమ్మలకు షేప్ ఇవ్వడం మరచిపోకండి. చాలా మంది మేకప్​ అందంగా చేసుకుంటారు కానీ కనుబొమ్మలను మాత్రం పట్టించుకోరు. అయితే మీ కనుబొమ్మలకు మంచి షేప్ ఇస్తే మీరు మరింత యంగ్​గా కనిపించవచ్చు. దీనికోసం మీరు ఐ బ్రో పెన్సిల్ యూజ్ చేస్తే చాలా మంచిది. ఇది మీకు నిండుదనాన్ని ఇస్తుంది.


ఫోర్త్ టిప్


ఐలైనర్​ మస్ట్​గా పెట్టుకోవాలి. ఒకప్పుడు కాటుకను మంచి లుక్​కోసం ఎలా వాడుకునేవారో.. ఇప్పుడు ఐలైనర్​ను అందుకే వాడుతున్నారు. ఇది మీ లుక్​ని చాలా డిఫరెంట్​గా, యవ్వనంగా మార్చగలదు. అయితే మీరు ఐలైనర్​ను లావుగా కాకుండా సన్నగా వేసుకుంటే మంచిది. ముదురు గోధుమరంగులో, యాష్​ కలర్​లో ఉండే ఐ లైనర్​ మీకు మంచి లుక్​ ఇస్తుంది. థిక్, బ్లాక్ ఐలైనర్​ మీరు వయసు పైబడిన వారిలా కనిపించేలా చేస్తుంది. 


ఫిఫ్త్ టిప్


మేకప్ వేసుకునేప్పుడు మీరు న్యూడ్ లిప్​స్టిక్ షేడ్ ఎంచుకోవచ్చు. మీ స్కిన్​ టోన్​కి సెట్​ అయ్యే న్యూడ్ షేడ్స్ మీకు మంచి లుక్​ని ఇస్తాయి. డార్క్ లిప్​స్టిక్స్​ మీరు పెద్దవారిలో కనిపించేలా చేస్తాయి. దీనికి బదులు మీరు క్లియర్ లిప్​గ్లాస్​ని ట్రై చేసినా మంచిగానే ఉంటుంది. మృదువైనా, ఆకర్షణీయమైన పెదవులు పొందేందుకు ఇది సులువైన మార్గం.


ఈ సింపుల్, ట్రెండీ లుక్స్​ మీరు ఎప్పుడూ మేకప్ వేసుకున్నా ఫాలో అయితే.. కచ్చితంగా మీరు మీ వయసుకన్నా యవ్వనంగా కనిపిస్తారు. 


Also Read : వింటర్​లో అల్లం వెల్లుల్లి సూప్​ తాగితే.. ఇమ్యూనిటీ వీర లెవల్​లో వస్తుందట