బరువు తగ్గించుకుని నాజూకు శరీరం పొందాలని అనుకునే వారికి వేసవి కాలం చాలా అనువైంది. ఎందుకంటే అధిక ఉష్ణోగ్రత కారణంగా ఆహారం కంటే ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఫిట్ నెస్ అంటే ఆకలిని చంపుకోవడం కాదు. ఇష్టమైనవి తక్కువగా ఆరగించడం. సరిగా తినకపోతే తీవ్రమయిన అలసట కలుగుతుంది. టోన్డ్ బాడీ కావాలంటే ఫిట్ నెస్ కి తగిన ఫుడ్ తినాలి. వ్యాయామాలు ఎలా ఎంచుకుంటారో అలాగే బరువు తగ్గించే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఇలా మీ భోజనం ఉంటే మీరు ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు.
తగినంత ప్రోటీన్ తీసుకోవాలి
ప్రతి భోజనంలో లీన్ ప్రోటీన్ తప్పనిసరిగా చేర్చాలి. ప్రోటీన్ కండరాల కణజాలాన్ని నిర్మించడానికి, వాటిని రిపేర్ చేయడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక పౌండ్ శరీర బరువుకు దాదాపు 0.8 నుంచి 1 గ్రాము ప్రోటీన్ ని లక్ష్యంగా తీసుకోవాలి. చికెన్, చేపలు, టోఫు, కాయధాన్యాలు, పెరుగు, గుడ్లు వంటి మంచి ప్రోటీన్ లభించే ఆహారాలు తీసుకోవాలి.
సంపూర్ణ ఆహారం
ప్రాసెస్ చేయని ఆహారాలు తీసుకోవాడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి. ఈ ఆహారాలు సాధారణంగా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి. స్థిరమైన శక్తిని అందిస్తాయి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడతాయి.
తక్కువ పరిమాణం
అతిగా తినడం నిరోధించాలంటే మీరు తీసుకునే ప్లేట్ భాగం చిన్నదిగా ఉండాలి. ఇది భోజనం తక్కువగా తినేలా చేస్తుంది. ఆకలి, సంపూర్ణత మీద శ్రద్ధ వహించాలి. వేగంగా తినకుండా నెమ్మదిగా తినాలి. తినే ప్రతి ముద్ధను ఆస్వాదిస్తూ తింటే ఆహారం తిన్న సంతృప్తి కలుగుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
చక్కెర వద్దు
అదనలు చక్కెరలు తీసుకోవడం తగ్గించాలి. ఇది బరువు పెరగడానికి, పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. చక్కెర పానీయాలు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, డెజర్ట్, తియ్యటి మసాలా దినుసులు తీసుకోవడం తగ్గించుకోవాలి. ప్రాసెస్ చేసిన వాటికి బదులుగా సహజ సిద్ధమైన తియ్యదనాన్ని అందించే పండ్లు తినాలి.
హైడ్రేట్ గా ఉండాలి
అందంగా, ఆరోగ్యంగా కనిపించేందుకు మొదట చేయాల్సిన పని రోజంతా హైడ్రేట్ గా ఉండటం. తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు శారీరక విధులని నిర్వహించడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఫిట్ నెస్ లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. శారీరకంగా చురుకుగా ఉండాలి. రోజూ కనీసం 8 గ్లాసుల నీటిని తాగాలి. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సొంతగా డైట్ ఫాలో అవకుండా డైటీషియన్ ని సంప్రదించి నిర్ధిష్ట పోషకాహారాలు తీసుకుంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో సంపూర్ణత్వం సాధిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: పుట్టుమచ్చలే కాదు ఈ లక్షణాలు కూడా చర్మ క్యాన్సర్ సంకేతాలే