Best Gifts for Dads : నాన్న ఎందుకో వెనుకబడ్డాడు. నాన్న గురించిన టాపిక్ వస్తే ఎక్కువగా వినిపించే డైలాగ్స్​లో ఇది ఒకటి. కానీ నిజానికి నాన్న వెనకబడలేదు. ఫ్యామిలీని ముందుకు నడిపిస్తూ కొండంత ధైర్యంగా వెనకనే అండగా ఉంటాడు. ఆయనే లేకపోతే ఎన్నో ఫ్యామిలీలు చిందరవందరగా ఉండేవి. అమ్మ తన శరీరాన్ని త్యాగం చేసి జన్మనిస్తే.. నాన్న అదే శరీరాన్ని పణంగా పెట్టి పిల్లల్ని పోషిస్తాడు.

పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు తండ్రి. కానీ ఎన్ని చేసినా సమాజంలో ఆయనకు తగిన గుర్తింపు అయితే దక్కలేదనేది వాస్తవం. తల్లిపై ప్రేమను చూపించినంత ఈజీగా తండ్రిపై పిల్లలు ప్రేమను చూపించలేరు. అందుకే కాస్త ధైర్యం తెచ్చుకుని ఫాదర్స్ డే రోజు మీ ప్రేమను వ్యక్తం చేయండి. అది కుదరకపోతే ఆయనకు నచ్చిన లేదా ఆయన మెచ్చే, అవసరమైన వాటిని గిఫ్ట్ చేయండి. 

ఫాదర్స్ డే స్పెషల్ గిఫ్ట్స్

ఫాదర్స్ డే రోజు మీ నాన్నకి ఏదైనా ఉపయోగపడేవిధంగా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో స్మార్ట్ వాచ్ ఒకటి. మీరు మీ నాన్న ఆరోగ్యం, యాక్టివిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫిట్​నెస్ ట్రాకర్, స్మార్ట్ వాచ్​ వంటివి ఇవ్వొచ్చు. లేదంటే టూల్ కిట్, DIY సెట్ ఇవ్వొచ్చు. ఇవి వారికి బాగా హెల్ప్ అవుతాయి. ఎలక్ట్రిక్ షేవర్, గ్రూమింగ్ కిట్​ కూడా గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఇవి రోజూ ఉపయోగించుకోవడానికి హెల్ప్ అవుతాయి. 

మీ నాన్నకి బుక్స్ చదవడం ఇష్టముంటే మంచి పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వొచ్చు. కస్టమైజ్ చేయించిన పర్స్​ లేదా వాచ్​లను గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందించే పోర్టబుల్ మసాజర్​ మంచి ఛాయిస్ అవుతుంది. వయసుతో పాటు పెరిగే టెన్షన్లు, నొప్పుల నుంచి ఇది మంచి రిలీఫ్ ఇస్తుంది. స్మార్ట్ బాటిల్ లేదా థర్మల్ ఫ్లాస్క్​ కూడా మంచివే. పాటలు లేదా సినిమాలు చూసేందుకు హెడ్ ఫోన్స్ వంటివి ఇవ్వొచ్చు. అలాగే హెల్త్ చెకప్ ప్యాకేజ్ చేయించడం కూడా మంచిదే. 

మీకు నాన్నపై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఓ లెటర్ రాయొచ్చు. చాలామంది పిల్లలు తల్లికి దగ్గరగా ఉంటారు కానీ తండ్రికి దూరంగా ఉంటారు. అందుకే తెలియకుండానే పిల్లలకు, తండ్రికి మధ్య ఓ బోర్డర్ ఏర్పడిపోతుంది. ఆ బోర్డర్ దాటితేనే తండ్రి కష్టంతో పాటు ప్రేమ తెలుస్తుంది. అందుకే మీ నాన్నతో మీ రిలేషన్ ఎలా ఉన్నా.. వారికి ఓ చిన్న గిఫ్ట్ ఇచ్చి.. మీకు వారిపై ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసి ఫాదర్స్ డే విషష్ చెప్పేయండి.