కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఏ పని చేసినా చివరికి అది పొట్ట నింపుకోవడం కోసమే. పొట్ట నిండాలంటే ముందు వంట చేయాలి. తినడానికి అందరూ రెడీనే, కానీ వంట చేయడానికి మాత్రం రెడీగా లేము అని చెబుతున్నారు ఎంతోమంది. ఎంతమందికి వంట చేయడం ఇష్టం లేదో తెలుసుకోవడం కోసం అమెరికాలో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వంట చేయడం ఇష్టం లేదని ప్రతి వందమందిలో 30 మంది చెప్పారు. వంట చేయడం కన్నా యుద్దానికి వెళ్లడమే సులువు అని కూడా కామెంట్లు చేస్తున్నారు. వంట చేయడం వల్ల చాలా అలసిపోతామని, రోజూ వండడం చాలా బోరింగ్ విషయమని వివరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో కూడా 29 శాతం మంది వంట చేయడం ఇష్టం లేదని ఒప్పుకున్నారు. రోజూ వంట చేసే వారిలో ఎంతోమంది తమ ఇంట్లోని ఇతరులను ఒక్కరోజైనా వంట చేయమని అడుగుతూ ఉంటారట. దానికి కారణం రోజూ వంట చేస్తే బోరింగ్ గా ఉంటుందని, తమ వంట తామే తినడం ఇంకా బోరింగ్ గా ఉందని వారు చెబుతున్నారు.
వంట చేయడం కష్టంగా అనిపించే రెడీ టు ఈట్, రెడీ టు కుక్ ఆహారాలను అధికంగా కొని తినేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రపంచంలో 42 శాతం మంది వంటగదిలోకి వెళ్లడంతోనే అలసటగా ఫీల్ అయిపోతారని అంటున్నారు. ఎంతోమందికి పాస్తా, సుషీ, నూడుల్స్ వంటివి ఇష్టం. వాటిని తయారు చేసుకోవడానికి కూడా వారు భయపడుతుంటామని చెబుతున్నారు. ఆ భయానికి కారణం వంట బోరింగ్ గా అనిపించడమేనని వివరిస్తున్నారు.
వంట చేయడం అనేది ఆధునిక తరంలో కష్టమైన ప్రక్రియగా భావిస్తోంది యువత. ఇప్పటికీ ఎన్నో ఇళ్లల్లో పెద్దవారే చక్కగా వంట చేస్తున్నారు. నేటి కాలం కోడళ్ళు వంట చేసే తీరే మారిపోయింది. సులువుగా ఐదు నిమిషాల్లో తయారయ్యే వంటకాలను చేసి పెట్టేస్తున్నారు. వాటిని తినడం వల్ల అనారోగ్యమే తప్పా ఆరోగ్య ప్రయోజనాలు సున్నా. నిజానికి వంట చేయడం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీలో అధ్యయనాన్ని నిర్వహించారు.
ఒత్తిడిని తగ్గించే ఔషధాల్లో వంట కూడా ఒకటని చెప్పారు పరిశోధనకర్తలు. వంట చేయడం మొదలుపెడితే వారికి తెలియక ఉండాలి. ఒత్తిడి పోతుందని దీనివల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు. ఎవరికైతే మానసిక ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటారో వారు రోజూ వంట చేయడం అలవాటు చేసుకోవాలి. వంట చేయడం వల్ల తమపై తమకు విశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే ఇంట్లోని ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి. అందరూ ఆరోగ్యకరమైన భోజనాన్ని తింటారు. దీని వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లోనే మనుషులంతా ఇలా ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కూడా కళకళలాడిపోతుంది.
Also read: చల్లదనం కోసం ఏసీలో ఎక్కువగా ఉంటున్నారా? మీ చర్మంపై ఈ మార్పులు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.