పోషకాలతో కూడిన ఆహారం ఆరోగ్యానికి మంచిది. ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది. మనం తినే ఆహారం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఎటువంటి వ్యాధినైనా నయం చేయగల శక్తి ఆహారానికి ఉంటుంది. మీరు తినే కొన్ని ఆహార పదార్థాల ద్వారా క్యాన్సర్ అభివృద్ధి చాలా ప్రభావితమవుతుందని నిపుణులు చెప్తున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు అందించమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.


బ్రకోలి


బ్రకొలీ అనేది సల్ఫోరాఫేన్‌తో కూడిన క్రూసిఫెరస్ కూరగాయలు. అత్యంత శక్తివంతమైన యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉన్న మొక్కల సమ్మేళనం. నేషనల్ లైబారీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం సల్ఫోరాఫేన్ రొమ్ము క్యాన్సర్ కణాల పరిమాణాన్ని 75 శాతం వరకు తగ్గిస్తుంది. బ్రకొలి కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ పోరాట ప్రయోజనాలు పొందటానికి వైద్యులు ప్రతివారం బ్రకొలి తినాలని సిఫార్సు చేస్తున్నారు.


కూరగాయల్లో కెరొటీనాయిడ్స్, విటమిన్ సి, గ్లూకోసినోలెట్స్, ఫోలేట్, డైటరీ ఫైబర్, ఫ్లేవనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ వాస్కులర్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడతాయి.


టొమాటో


ప్రపంచ వంటకాల్లో ప్రధానమైనవి టొమాటోలు. రుచికరమైనవి అలాగే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో లైకోపీన్ తో ఉంటుంది. అందుకే దానికి ఎరుపు రంగు ఉంటుంది. యాంటీ క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం లైకోపీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది గణనీయంగా నిరూపించాయి.


అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ ప్రకారం లైకోపీన్ క్యాన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తుంది. అలాగే కార్సినోజెనిసిస్ పెరుగుదలను నిరోధిస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి. శాండ్ విచ్, సలాడ్ లేదా సాస్ కి జోడించడం ద్వారా ప్రతి రోజు టొమాటోలను తీసుకోమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.


వెల్లుల్లి


వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. వివిధ అధ్యయనాల పర్కారం క్యాన్సర్ కణాలను నాశనం చేస్తుంది. వెల్లుల్లి క్రమం తప్పకుండా తినడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగించేలా చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో 2-5 గ్రాముల తాజా వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు.


బీన్స్


ఫైబర్, ప్రోటీన్లతో కూడిన బీన్స్ కూడా కోలోరెక్టల్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఈ సమస్య కలిగిన చరిత్ర ఉన్న వ్యక్తులు తప్పకుండా బీన్స్ ని ఆహారంలో తీసుకోవడం వల్ల కణితి పునరావృతమయ్యే ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. పింటో, రెడ్ కిడ్నీ బీన్స్ వంటి కొన్ని రకాల బీన్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


బచ్చలికూర


బచ్చలి కూర వంటి ఆకు కూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, లుటిన్, విటమిన్ సి ఉన్నాయి. ఇది క్యాన్సర్ కణాలని అభివృద్ధి చేయకుండా రక్షణగా పని చేస్తుంది. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ కారకాలను నిరోధించడంలో సహాయపడతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఎముకల ఆరోగ్యం కోసం ఇవి తప్పనిసరిగా తినాల్సిందే