Dubai Visa Approval Guide and Requirements : దుబాయ్ అద్భుతమైన స్కైలైన్‌లు, బీచ్‌లు, ప్రపంచ స్థాయి షాపింగ్​తో ఆకట్టుకుంటుంది. అందుకే ప్రపంచ యాత్రికులకు ఇది ప్రసిద్ధ గమ్యస్థానం. అలా వెళ్లాలనుకునేవారికి కచ్చితంగా వీసా ఉండాలి. అయితే దుబాయ్​ వీసాను చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేస్తారు. మీరు దుబాయ్​కి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే.. మీ వీసా ఓకే అవ్వాలనుకుంటే ఏమి చేస్తే మంచిదో.. ఏ తప్పులు చేయకూడదో.. ఏ డాక్యుమెంట్లు అవసరం ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందా. ఇవి మీకు సమయాన్ని, స్ట్రెస్​ని తగ్గించి ఈజీగా దుబాయ్​కి వీసా తెచ్చుకోవడంలో హెల్ప్ చేస్తాయి. అలాగే ట్రావెల్ ఇన్సూరెన్స్ దుబాయ్, విదేశీ ప్రయాణ ఆరోగ్య బీమా గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం. 

Continues below advertisement

దుబాయ్ వీసాకి ట్రావెల్ ఇన్సూరెన్స్ అవసరమా?

మీరు అత్యవసర పరిస్థితులను ఎదుర్కోగలరని వీసా అధికారులు హామీ కోరుకుంటారు. విదేశీ ప్రయాణంలో ప్రమాదాలు, ఆకస్మిక అనారోగ్యం లేదా వైద్య తరలింపు విషయంలో ఆర్థిక సహాయం ఉందనే భరోసా ఇది ఇస్తుంది. కొన్ని దుబాయ్ వీసా రకాలకు ట్రావెల్ ఇన్సూరెన్స్ సిఫార్సు చేసినప్పటికీ.. ఇది అన్ని దరఖాస్తుదారులకు వర్తించదు. అవసరాలు, వీసా రకం, నేషనల్ బట్టి మారుతూ ఉంటుంది. వైద్య, అత్యవసర ప్రయోజనాలను అందించే ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ దుబాయ్ పాలసీ (UAE Travel Insurance for Visa) తీసుకుంటే మంచిది.

దుబాయ్ వీసా తిరస్కరించడానికి కారణాలు ఇవే (Dubai Visa Rejection Reasons)

దుబాయ్ వీసాను చిన్న తప్పులకే రిజెక్ట్ చేస్తారు. ఫీల్డ్‌లు లేకపోవడం, స్పెల్లింగ్ తప్పులు లేదా మీ పాస్‌పోర్ట్‌తో సరిపోలని డేటా వల్ల ఎక్కువగా రిజెక్ట్ చేస్తారు. అలాంటివాటిలో కొన్ని తప్పులు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

  • వీసా కేటగిరి

మీరు వ్యాపారం, చదువు లేదా కుటుంబ సందర్శనతో దుబాయి వెళ్తే..  దానికోసం పర్యాటక వీసా కోసం అప్లై చేయకూడదు. మీ అవసరానికి, ప్రయోజనానికి సరిపోయే వర్గాన్ని ఎంచుకోవాలి. దానికి తగిన సహాయక పత్రాలను అటాచ్ చేయాలి.

  • ప్రయాణ ఉద్దేశం

మీ ప్రణాళికలు అస్పష్టంగా కనిపిస్తే.. అధికారులు వీసా రిజెక్ట్ చేస్తారు. మీ ప్రయాణ మార్గం, తేదీలు, ట్రిప్ నిధులు వివరిస్తూ ఒక చిన్న కవర్ నోట్ అందించాలి. మీ ప్రయాణ తేదీలకు సరిపోయే ఫ్లైట్ బుకింగ్‌లు, హోటల్స్, కార్యాచరణ ప్రణాళికలను అటాచ్ చేయాలి.

  • ఆర్థిక నిధులు

మీరు దుబాయ్​లో స్టే చేసేందుకు అవసరమైన డబ్బులు ఉన్నాయని చూపించేలా.. బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు చూపించాలి. వీసా రకాన్ని బట్టి నిర్దిష్ట ఆర్థిక అవసరాలు మారవచ్చు. మరెవరైనా చెల్లిస్తుంటే సాధారణ ఆదాయం లేదా స్పాన్సర్‌షిప్ ప్రూఫ్స్ చూపించాలి.

  • పాస్‌పోర్ట్ సమస్యలు

చెల్లుబాటు తక్కువగా ఉండే లేదా దెబ్బతిన్న లేదా చాలా తక్కువ ఖాళీ పేజీలు ఉన్న పాస్‌పోర్ట్‌లు రిజెక్ట్ అవ్వొచ్చు. చాలా మంది దరఖాస్తుదారులు ప్రయాణ తేదీ తర్వాత కనీసం ఆరు నెలల చెల్లుబాటును కలిగి ఉండాలి. దరఖాస్తు చేయడానికి ముందు దెబ్బతిన్న పాస్‌పోర్ట్‌లను మార్చాలి.

  • ప్రయాణ బీమా

వైద్య, అత్యవసర పరిస్థితులు, తరలింపు లేదా పూర్తి యాత్ర వ్యవధిని కవర్ చేయని పాలసీ అప్లై చేయకూడదు. మీ ట్రావెల్ ఇన్సూరెన్స్ దుబాయ్ ప్లాన్ మీ మొత్తం యాత్రకు చెల్లుబాటు అవుతుందని చూపించాలి. కొన్ని బీమా సంస్థలు UAE-నిర్దిష్ట ప్రయాణ బీమా సర్టిఫికెట్‌లను అందిస్తాయి. అలాంటివి తక్షణమే పాలసీ జారీ చేసి.. 24/7 సహాయం, UAEలో నగదు రహిత ఆసుపత్రి వసతి అందిస్తాయి. 

  • ఫోటో, డాక్యుమెంట్స్

ఫోటో సైజు, పేలవమైన నాణ్యత గల స్కాన్‌లు లేదా తప్పు ఫైల్ రకంలో ఉన్న డాక్యుమెంట్‌లు తిరస్కరణకు దారి తీయవచ్చు. వీసా పోర్టల్‌లోని ఖచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించండి.

వీసా ఆమోదించాలంటే చేయాల్సినవి ఇవే.. (Dubai Visa Approval Tips)

దుబాయ్ వీసాకు అప్లై చేసేముందు మీ డాక్యుమెంట్‌లను రెండు మూడు సార్లు తనిఖీ చేయండి. సరైన ప్రయాణ బీమాను ఎంచుకోవాలి. స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వీటిని ఫాలో అయితే వీసా ఆమోదం పొందే అవకాశాలను గణనీయంగా ఉంటాయి. మీ పేరు, పుట్టిన తేదీ, పాస్‌పోర్ట్ నంబర్, ప్రయాణ తేదీలు మీ ఫారమ్, టిక్కెట్‌లు, హోటల్ బుకింగ్‌లు, బీమా సర్టిఫికెట్‌లో అన్ని కరెక్ట్​గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మంచి విదేశీ ప్రయాణ ఆరోగ్య బీమా ఎంచుకోవాలి. రిటర్న్ టిక్కెట్‌లు, రోజువారీ బస వివరాలు, నిధులు, వాటి ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. 

ఒక చిన్న కవర్ నోట్‌ రాయండి. ఎందుకు ప్రయాణిస్తున్నారు.. ప్రయాణ తేదీలు, సహచరులు, నిధుల మూలం, వసతి వివరాలు రాయాలి. అవసరమైన ఫార్మాట్‌లో స్పష్టమైన స్కాన్‌లను ఉపయోగించాలి. వాటి పరిమాణం, నేపథ్యం, ఇటీవలె దిగిన ఫోటో దగ్గర ఉంచుకోవాలి. ఎంబసీ ద్వారా గుర్తించిన లోపాలను పరిష్కరించుకోవాలి. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల మీ మొత్తం యాత్రలో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.