అన్వేషించండి

Dry Skin Remedies : చర్మంపై పొడిబారిన, తెల్లని మచ్చలు కనిపిస్తున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో దూరం చేసుకోండి

Winter Skincare Tips : చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. ఎన్ని క్రీములు వాడినా చర్మం పొడిగా ఉంటుందా? అయితే ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి.

Simple Home Remedies to Treat Dry Skin :  చలికాలంలో చలిని దూరం చేసుకోవడానికి వెచ్చని దుస్తులు వేసుకుని.. వేడి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటాము. కానీ ఇది మన చర్మానికి అనేక సమస్యలను కలిగిస్తుంది. చల్లని గాలి, తక్కువ ఉష్ణోగ్రత, పొడి వాతావరణం మన చర్మం నుంచి సహజ తేమను లాగేస్తాయి. దీనివల్ల ముఖం పొడిగా, బిగుతుగా, నిర్జీవంగా కనిపిస్తుంది. ఎన్నీ క్రీమ్స్ రాసినా చాలామంది శరీరం పొడిగానే ఉంటుంది. అలాంటివారు చర్మానికి బయటి నుంచి మాత్రమే కాకుండా లోపలి నుంచి కూడా పోషణ ఇవ్వడం అవసరం. ఈ సీజన్‌లో మీ చర్మం కూడా పదేపదే పొడిగా ఉంటే.. స్కిన్​పై తెల్లని మచ్చలు కనిపిస్తే.. ఏ ఇంటి నివారణలు మీకు హెల్ప్ చేస్తాయో చూసేద్దాం. 

చలికాలంలో చర్మం పదేపదే పొడిగా మారితే.. 

  • మాయిశ్చరైజర్ - కొన్ని సహజమైనవి చర్మానికి లోపలి నుంచి పోషణనివ్వడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఉదాహరణకు కలబంద జెల్ చర్మానికి చల్లదనంతో పాటు తేమను కూడా ఇస్తుంది. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా చేసి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. నువ్వుల నూనె చలికాలానికి ఉత్తమమైనది. సహజ మాయిశ్చరైజర్​గా చెప్పవచ్చు. షియా బటర్ పొడి, పగిలిన చర్మాన్ని బాగు చేస్తుంది. వీటిని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేమను నిలుపుకుంటుంది. పొడిబారడాన్ని తగ్గిస్తుంది.
  • ఆయిల్ మసాజ్ - స్నానం చేయడానికి అరగంట ముందు గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరం మొత్తం తేలికగా మసాజ్ చేయండి. ఇది చర్మంలో తేమను మాత్రమే కాకుండా రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా కూడా చేస్తుంది. ఈ అలవాటును రోజూ పాటిస్తే.. చలికాలంలో పొడిబారడం చాలా వరకు తగ్గుతుంది.
  • వేడి నీటితో స్నానం - చలికాలంలో వేడి నీటితో స్నానం చేయాలనిపిస్తుంది. కానీ వేడి నీరు మీ చర్మంపై సహజ నూనెను పూర్తిగా తొలగిస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు నీటిలో ఉండకండి. ఇది చర్మం తేమను కాపాడుతుంది. పొడిబారడాన్ని పెరగనివ్వదు.
  • హైడ్రేషన్ - చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది. కాబట్టి మనం తక్కువ నీరు తాగుతాము. కానీ ఇది చర్మం పొడిబారడానికి అతిపెద్ద కారణం. రోజంతా గోరువెచ్చని నీరు, హెర్బల్ టీ, నిమ్మకాయతో వేడి నీరు, వేడి సూప్ తాగండి. ఇవి శరీరం, చర్మాన్ని లోపలి నుంచి తేమగా ఉంచుతాయి.
  • హెర్బల్ ఫేస్ మాస్క్‌- ఇంట్లో తయారుచేసిన కొన్ని ఫేస్ ప్యాక్‌లు చర్మానికి చాలా బాగా పోషణనిస్తాయి. మీరు ఈ మాస్క్‌లను వారానికి 1 నుంచి 2 సార్లు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు తేనె, పసుపుతో చేసిన మాస్క్ చర్మానికి తేమను అందిస్తుంది. మెరుపును పెంచుతుంది. రోజ్ పౌడర్, పెరుగుతో చేసిన మాస్క్ చర్మాన్ని శాంతపరుస్తుంది. మృదువుగా చేస్తుంది, దీనితో పాటు కలబంద జెల్, కొద్దిగా పసుపు మాస్క్ పొడి చర్మానికి తక్షణ ఉపశమనం ఇస్తుంది. ఈ మాస్క్‌లు చర్మాన్ని మృదువుగా, హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

ఇవేకాకుండా డైట్​లో కూడా కొన్ని మార్పులు చేయాలి. చలికాలంలో శరీరాన్ని లోపలి నుంచి పోషించే ఆహారం తీసుకోవడం అవసరం. కాబట్టి మీ ఆహారంలో నెయ్యి, బాదం, వాల్‌నట్, అవకాడో, జ్యూసీ పండ్లు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారం చర్మంపై వెంటనే ప్రభావం చూపిస్తుంది. వీటిని రెగ్యులర్​గా ఫాలో అయితే పొడిబారడం తగ్గి.. చర్మం ఫ్రెష్​గా మెరుస్తూ ఉంటుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IndiGo Flight Cancelled : శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Advertisement

వీడియోలు

Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam
Putin on oil trade with India | చమురు వాణిజ్యంపై క్లారిటీ ఇచ్చిన వ్లాదిమిర్ పుతిన్ | ABP Desam
Vintage Virat Kohli | సఫారీలతో రెండో వన్డేలో వింటేజ్ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్న విరాట్
Ruturaj Gaikwad Century in India vs South Africa ODI |  అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IndiGo Flight Cancelled : శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
శనివారం ఎన్ని ఇండిగో విమానాలు రద్దు అయ్యాయి? పరిస్థితి ఎప్పుడు సాధారణ స్థితికి వస్తుంది? CEO ఏం చెప్పారు?
Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం! ఇద్దరు తెలుగు విద్యార్దులు మృతి
Indigo Issue: ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
ఇండిగోకు వెసులుబాట్లు, ఇతర సంస్థల అదనపు సర్వీసులు - విమానాల సమస్య పరిష్కారానికి రామ్మోహన్ నాయుడు వార్ రూమ్
Russia India trade ties: మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
మరో ఐదేళ్లు వాణిజ్య బంధం బలోపేతం - మోదీ, పుతిన్ ఉమ్మడి ప్రకటన
Hawala money seizure: కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
కారులో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే .. షాక్ అయిన పోలీసులు - ఎవరి డబ్బు ?
Live in Relationship: భారత్‌లో సహజీవనం నేరమో కాదు ఘోరమో కాదు: రాజస్థాన్ కోర్టు సంచలన కామెంట్స్
భారత్‌లో సహజీవనం నేరమో కాదు ఘోరమో కాదు: రాజస్థాన్ కోర్టు సంచలన కామెంట్స్
Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
Tegalu Health Benefits : తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే
తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే
Embed widget