చిరుధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ వాటి ప్రయోజనాలు గురించి చాలా మందికి తెలియక చిరుధాన్యాలు పక్కన పెట్టేస్తారు. అందుకే వాటి ప్రాముఖ్యత తెలియజేస్తూ, అవగాహన కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాది మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించింది. దీని మీద స్టాంప్ కూడా విడుదల చేసింది. రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, కొర్రలు వంటివి చిరుధాన్యాల కిందకి వస్తాయి. పూర్వం వరి అన్నం కాకుండా మిల్లెట్స్ తినేందుకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు.
మిల్లెట్ తినడం వల్ల ప్రయోజనాలు
ప్రతిరోజు మిల్లెట్స్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మెనోపాజ్ తర్వాత గుండె జబ్బులతో పోరాడటానికి మహిళలకు ఇవి సహాయపడతాయి. శరీరంలో అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రించవచ్చు. పిత్తాశయంలో రాళ్ళతో బాధపడే వాళ్ళు వాటిని పోగొట్టుకోవాలని అనుకుంటే మిల్లెట్స్ చక్కని ఆహారం. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇవి గ్లూటెన్ ఫ్రీ. చిరుధాన్యాలు తినడం వల్ల కొంతమందికి ఆరోగ్యకరమే కానీ మరికొంతమందికి తీవ్ర సమస్యలు తీసుకొస్తాయి. అందుకే మొదటి సారి మీరు మిల్లెట్స్ తీసుకోవాలని అనుకుంటే కొద్ది కొద్దిగా తినాలి. ఎసిడిటీ లేదా ఉబ్బరం వంటి సంకేతాలు కనిపిస్తే వాటిని తినకపోవడం మంచిది.
మిల్లెట్స్ ఉడికించుకుని తినడం మంచిది. జీర్ణం చేయడం కూడా సులభంగా ఉంటుంది. జోవర్, బజ్రా ముందుగా కాకుండా కోడో వంటి ధాన్యాలతో ప్రారంభించడం ఉత్తమం.
ఎవరు తినకూడదు?
మిల్లెట్స్ అందరి శరీరానికి నప్పుతాయని అనుకుంటారు. కానీ అవి తింటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మిల్లెట్స్ తిన్న తర్వాత మీకు కడుపులో ఎటువంటి అసౌకర్యం లేకపోతే తినవచ్చు. కిచిడీ, రోటీలాగా చేసుకుని తినడం ఉత్తమం. మిల్లెట్స్ ఏ టైమ్ లో తింటే మంచిదనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకోవచ్చు. కానీ మితంగా మాత్రమే తీసుకోవడం ఉత్తమం. వారానికి మూడు లేదా నాలుగు సార్లు తినవచ్చు. హైపోథైరాయిడిజం ఉన్నవారికి మాత్రం ఇది వర్తించదు.
థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు మిల్లెట్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది థైరాయిడ్ పెరుగుదలకు దారి తీస్తుంది. అయోడిన్ శోషణకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్ లు ఉంటాయి. ఇవి ఇబ్బంది కలిగిస్తాయి.
ఇవి తప్పని సరి
☀ మిల్లెట్స్ తినేటప్పుడు నీరు బాగా తాగాలి
☀ బాగా ఉడికించిన తర్వాత మాత్రమే తీసుకుంటే మంచిది
☀ వాతావరణం ప్రకారం మిల్లెట్స్ ఎంచుకోవాలి
☀ కొన్ని మిల్లెట్లు వేసవిలో మంచివి, మరికొన్ని చలికాలంలో తింటే శరీరానికి వెచ్చదనం అందిస్తాయి. వేసవిలో జొన్నలు, రాగులు, ఫాక్స్‌టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, కోడో తినడం మంచిది. ఇవి మీకు వెచ్చని వాతావరణంలో చల్లదనం అందిస్తాయి.
భారతదేశంలో వర్షాకాలంలో దాదాపు 8 రకాల మిల్లెట్స్ పండిస్తారు. వీటికి తక్కువ నీరు, తేమ అవసరం లేదు. ఉదాహరణకు జోవర్ వర్షాధార పంట. నీటి పారుదల లేని ప్రాంతాల్లో పండిస్తారు. రాగులు, ఫాక్స్‌టైల్ మిల్లెట్, బార్న్యార్డ్ మిల్లెట్, సజ్జలు చలికాలంలో తింటే మంచిది. లిటిల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్ శీతలీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిని వేసవి కాలంలో తినవచ్చు.
Also Read: వేసవితాపాన్ని తట్టుకోవాలంటే రోజుకో కొబ్బరి బోండాం తాగాల్సిందే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.