Donald Trump Suffers with Chronic Venous Insufficiency : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీతో ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారణ అయింది. వైట్ హౌస్​ ప్రతినిధి కరోలిన్ లీవిట్ అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా ట్రంప్ చేతుల్లో వణుకు,  కాళ్లల్లో వాపు వంటి లక్షణాలతో ఇబ్బంది పడడంతో టెస్ట్​లుగా చేయగా క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ (Chronic Venous Insufficiency) ఉన్నట్లు గుర్తించారని తెలిపారు.

Continues below advertisement

ఈమధ్యకాలంలో ట్రంప్ చేతులకు ఉన్న కొన్ని గాయాలపై పలు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఎక్కువమందితో ఇంట్రాక్ట్ అవ్వడం, ఇతర సమస్యలకు మందులు ఉపయోగించడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు వైట్ హోస్ ప్రకటించింది. అయితే ట్రంప్​కి వచ్చిన ఈ వ్యాధి ఏంటో? ఎవరికి ఇది ఎక్కువగా వచ్చే అవకాశముందో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలు ఏంటో చూసేద్దాం.

క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ

కాళ్లలోని సిరల్లో దీర్ఘకాలిక లోపం ఏర్పడడాన్నే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అంటారు. అంటే కాళ్లలోని సిరలు గుండెకు రక్తాన్ని సరిగ్గా పంప్ చేయలేనప్పుడు ఈ సమస్య వస్తుంది. సిరల్లోని కవాటాలు బలహీనంగా మారినా.. దెబ్బతిన్నా.. రక్తం కిందికి వెళ్లి కాళ్లల్లో పేరుకుపోతుంది. దీనివల్ల సిరలపై ఒత్తిడి పెరిగి అసౌకర్యానికి గురవుతారు. కొన్ని సందర్భాల్లో ఇది శరీరంలోని ఇతర భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. 

Continues below advertisement

కారణాలు ఇవే.. 

క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ రావాడానికి కొన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఎక్కువసేపు నిలబడి ఉండడం లేదా కూర్చొని ఉండడం వల్ల రావచ్చు. ఒబెసిటీ, బరువు పెరగడం, ప్రెగ్నెన్సీ, వయసు పెరిగేప్పుడు, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉన్నవారికి కూడా ఇది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 

లక్షణాలు ఇవే

కాళ్లు, మడమల దగ్గర వాపు కనిపిస్తుంది. నడిచేప్పుడు భారంగా ఉంటుంది. చర్మం పొడిగా మారి దద్దుర్లు రావడం కూడా దీని లక్షణాల్లో భాగమే. నరాలు క్లియర్​గా కనిపించడం, చర్మం ముదురు రంగులోకి మారడం.. పరిస్థితి విషయమించినప్పుడు కాళ్లపై గాయాలు కూడా అవుతాయి. 

చికిత్స ఉందా?

ఈ సమస్యను ఫిజికల్​గా, డాపర్ అల్ట్రాసౌండ్, వెనోగ్రామ్​ ద్వారా గుర్తిస్తారు. అయితే మీకు క్రానిక్ వీనస్ ఇన్​సఫిసియెన్సీ ఉందని తేలితే.. చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేజర్​ ట్రీట్​మెంట్​తో పాటు పలు థెరపీలు చేస్తారు. కంప్రెషన్ స్టాకింగ్స్, కాళ్లకు విశ్రాంతినివ్వడం వల్ల పరిస్థితి కంట్రోల్ అవుతుంది. 

రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బరువును అదుపులో ఉంచుకోవడం, రెగ్యులర్​గా వ్యాయామం చేయడం, ఎక్కువసేపు కూర్చోకుండా మధ్యలో నడుస్తూ ఉండాలి. అలాగే ఎక్కువసేపు నిలిచోకూడదు కూడా. వీటితో పాటు గట్టిగా ఉండే దుస్తులు ధరించకూడదు. ఇవన్నీ సమస్యను దూరంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయంటున్నారు నిపుణులు.