ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారు. ఫ్రెండ్స్ లేకుండా ఎవరూ ఉండరు. మనం ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా.. ముఖ్యంగా ఒత్తిడి, విచారాన్ని తగ్గించేందుకు స్నేహితులు తోడు చాలా అవసరం. మన స్నేహితుల్లో కొందర్ని కుటుంబంతో సమానంగా చూస్తాం. నిజానికి మీరు మీ రహస్యాలను మీ స్నేహితులతో మాత్రమే పంచుకుంటారు. ఏది ఏమైనప్పటికీ, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి మధ్య స్నేహం ఉత్తమమైనది. ఎందుకంటే అబ్బాయితో స్నేహం చాలా స్పెషల్ గా ఉంటుంది. ప్రతీ అమ్మాయి జీవితంలో ఒక అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటాడు. అసలు ఎందుకు అబ్బాయి, అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలంటే..


ఎలాంటి డ్రామాలు ఉండవు


బాయ్ బెస్టీకి అసూయ అసలు ఉండదు. మీరు గొడవ పడినా.. కేవలం పది నిమిషాల్లో మళ్లీ కలిసిపోతారు. ఫ్రెండ్స్‌పై పగ పెంచుకోవడం అబ్బాయిలకి ఇష్టం ఉండదు. ఒక వేళ మీరు తిట్టుకున్నా సరే.. మీ రోజువారీ మాటలు మాత్రం ఆగిపోవు. తప్పు వారి వైపు ఉంటె మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి సాధ్యమైనవన్నీ చేస్తుంటారు. 


ఏది అనుకున్నా అతను మీకు నిజాయితీగా చెబుతాడు


అబ్బాయిలు మీకు ఎప్పటికీ అబద్దం చెప్పరని మీరు నమ్మండి. మీరు కనిపించే తీరు గురించి లేదా ఒక నిర్దిష్ట పరిస్థితి గురించి వారు ఎల్లప్పుడూ నిజాయితీగా ఉంటారు. మీరు చెడుగా ఏమి మాట్లాడినా కూడా వారు అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే మీతో నిజాయితీగా ఉండటడానికే ఇష్టపడతారు. 


గొడవ పడినా మీ రహస్యాలను ఎవరితో చెప్పరు 


ఒక అబ్బాయికి ఏదయినా చెబితే అది అక్కడే మర్చిపోతారు. అదే అమ్మాయిలకు ఏదైనా విషయం చెబితే కొద్దీ పాటి నిమిషాల్లోనే అందరికి చేరుతుంది. కాబట్టి మీరు మీ సీక్రెట్స్ వాళ్లతో షేర్ చేసుకోవచ్చు. అది సురక్షితంగా ఉంటుందని నమ్మండి. మీ మధ్య గొడవలు జరిగినా, మాట్లాడకుండా నెలలు గడిచినా, అతను మీ రహస్యాలను భద్రంగా ఉంచుతాడు. మీ ప్రవర్తన ఎలా ఉన్నా మీ బెస్ట్ ఫ్రెండ్‌ వాటిని పెద్దగా పట్టించుకోడు.


వారు మిమ్మల్ని ఎప్పటికీ జడ్జ్ చేయరు


ఒకసారి ఆలోచించండి.. అమ్మాయిలు, అమ్మాయిలు తిట్టుకుంటే జడ్జ్ చేసి మాట్లాడతారు. అదే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి గొడవ పడినప్పుడు అబ్బాయిలు, అమ్మాయిలను అస్సలు జడ్జ్ చేయరు. మీరు ఎంత అసహ్యంగా ప్రవర్తించినా లేదా మీరు ఎంత చెడ్డగా కనిపిస్తున్నారనే దానితో సంబంధం లేకుండా మీకు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. మీరు ఏ పని చేసినా సపోర్టుగా ఉంటారు. సాయం చేస్తారు.


జాగ్రత్తగా చూసుకుంటారు 


మీరు, మీ బాయ్ బెస్ట్ ఫ్రెండ్‌తో, ఎక్కడికి వెళ్లినా మీరు జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు ఇబ్బందుల్లో ఉంటే, ఎప్పుడైనా, మీ దగ్గరికి వచ్చే మొదటి వ్యక్తి వారే ఉంటారు. మిమ్మల్ని కష్టాల నుండి బయటకు తీసుకువస్తాడు. అతను మీ కోసం పోరాడతాడు. అలాగే మీ కోసం నిలబడతాడు. ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా బాధపెట్టడం చూస్తే.. అతను సహించలేడు.


Also Read : ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే మీ గుండె పదిలంగా ఉంటుంది