కరివేపాకును వంట రుచిని పెంచేందుకు వాడతారని అనుకుంటారు. ఎంతోమంది నిజానికి కరివేపాకులో ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్నాయి. చాలామంది తినేటప్పుడు కరివేపాకుని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. దానికి విలువే లేదనుకుంటారు. నిజానికి కరివేపాకు చేసే మేలు ఇంతా అంతా కాదు, ఇది ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటున్న వారు కరివేపాకుతో చేసిన వంటకాలను అధికంగా తినండి. ఇది ఇట్టే బరువును కలిగించేస్తుంది. కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీనిలో ఫాస్పరస్, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఏ, క్యాల్షియం అధికంగా ఉంటాయి. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి బరువు తగ్గేలా చేస్తాయి. కాబట్టి కరివేపాకు వేసి చేసిన వంటకాలు తినేందుకు ప్రయత్నించండి. కరివేపాకు పొడి, కరివేపాకు పచ్చడి, కరివేపాకు రైస్ ఇలా రకరకాల వంటకాలను దీంతో చేసుకోవచ్చు.


కరివేపాకు రసాన్ని తీసి నిమ్మరసం కలిపి ప్రతి రోజు తాగుతూ ఉంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాలేయం శుభ్రపడుతుంది. దీనివల్ల కాలేయం పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఎప్పుడైతే కాలేయం ఆరోగ్యంగా పనిచేస్తుందో శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కరివేపాకు తినడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా సాగుతుంది. ఖాళీ కడుపుతో కరివేపాకు రసాన్ని తాగితే కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, మలబద్ధకం వంటివి కూడా పోతాయి. ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా కరివేపాకును తమ ఆహారంలో భాగం చేసుకోండి.


మధుమేహంతో బాధపడుతున్న వారు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో కరివేపాకు ఒకటి. ఇది కొలెస్ట్రాల్‌‌ను పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల డయాబెటిస్ సమస్య పెరగకుండా ఉంటుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం తులసి ఆకులతో కరివేపాకును వేసి రసం తీసి ఆ రసాన్ని తాగుతూ ఉండండి. విటమిన్ ఏ లోపం తొలగిపోతుంది. కంటిచూపు కూడా మెరుగు అవుతుంది. డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. 


కరివేపాకు కనిపిస్తే తీసేవారు ఎక్కువ. అలా తీయకుండా ఉండాలనుకుంటే కరివేపాకు పొడిని చేసుకొని ఉంచుకోండి. కూరల్లో, పప్పులో ఈ కరివేపాకు పొడిని వేసి కలుపుకుంటే మంచిది. కరివేపాకులోని గుణాలు అన్ని శరీరానికి అందుతాయి. విరేచనాలు అధికంగా అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని తినేందుకు ప్రయత్నించండి. ఇది డయేరియా సమస్యకు చక్కని పరిష్కారం. దగ్గు, జలుబుకు కూడా ఇది పెడుతుంది. దగ్గు, జలుబు వేధిస్తున్నప్పుడు కరివేపాకుతో చేసిన అన్నాన్ని తింటే మంచిది. దీనిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా కలిగి ఉంటుంది. కాబట్టి గర్భిణులు కరివేపాకును అధికంగా తినడానికి ప్రయత్నించాలి. అలాగే రక్తహీనత సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు కరివేపాకు ఆకుల్ని నీళ్లలో మరిగించి ఆ నీటిని తాగితే చాలా మంచిది.


Also read: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా
















































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.