Best Bangles to Match Your Diwali Look : దీపావళి(Deepawali 2025)కి దాదాపు అందరూ ట్రెడీషనల్ డ్రెస్​లు వేసుకుంటారు. చీరలు నుంచి లెహంగాస్, అనార్కలీలు, ఇండో-వెస్ట్రన్ గౌన్లు వేసుకుంటారు. ప్రతి పండుగ సమయంలో ఈ తరహా దుస్తులు అమ్మాయులు ఎక్కువగా ఎంచుకుంటారు. అయితే మీరు వేసుకున్న డ్రెస్​లకు తగ్గట్లుగా మీ లుక్​ ఉండాలనుకుంటే గాజులు చాలా ముఖ్యం. మరి మీరు ఎంచుకునే డ్రెస్​ల కోసం ఎలాంటి గాజులు వేసుకోవచ్చో.. ఎలాంటివి వేసుకుంటే మీ లుక్ ఎలివేట్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

త్రెడ్ బ్యాంగిల్స్

(Image Source: Pinterest/ crystallight02)

త్రెడ్ బ్యాంగిల్స్ దీపావళి లుక్​ని మరింత ఎలివేట్ చేస్తాయి. మెరిసే దారాలు, సీక్విన్లు, అద్భుతమైన డిజైన్లతో తయారు చేసిన వాటిన ఎంచుకోవచ్చు. ఈ గాజులు మీ సాంప్రదాయ దుస్తులకు బాగా నప్పుతాయి. అనార్కలి లేదా ట్రెడీషనల్ గౌన్స్ వేసినప్పుడు వీటిని వేసుకోవచ్చు. టోన్డ్ దుస్తులను బ్యాలెన్స్ చేయడానికి మల్టీపుల్ కలర్ త్రెడ్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చు.

వెండి గాజులు

(Image Source: Pinterest/ sahibafeb04)

అధునాతనతను ఇష్టపడే వారికి వెండి గాజులు పర్​ఫెక్ట్ ఎంపిక. ఇవి సున్నితమైన మెరుపును అందిస్తాయి. మెరూన్, నేవీ లేదా నలుపు వంటి ముదురు షేడ్స్​ డ్రెస్​లకు పూర్తి పర్​ఫెక్ట్​. పట్టు చీరలు లేదా లెహంగాలు వేసుకున్నప్పుడు మీరు వీటిని వేసుకోవచ్చు.

Continues below advertisement

యాంటిక్ గాజులు

(Image Source: Pinterest/ hibasaesthetic)

యాంటిక్ నలుపు-వెండి టోన్​తో చేసిన గాజులు దీపావళికి బాగా నప్పుతాయి. ఇవి మీకు రస్టిక్ లుక్ ఇస్తాయి. ఘాగ్రా చోలీస్ లేదా ఎంబ్రాయిడరీ కుర్తాలకు బాగుంటాయి. పండుగ ట్విస్ట్ను జోడించడానికి లాంగ్ స్కర్ట్, క్రాప్ టాప్ వంటి ఫ్యూజన్ దుస్తులతో కూడా వీటిని వేసుకోవచ్చు. 

గాజు గాజులు

(Image Source: Canva)

భారతీయ సంప్రదాయాన్ని రెట్టింపు చేసేవాటిలో గాజు గాజులు ఒకటి. ఇవి మృదువైన శబ్దం ఇస్తూ.. చేతులకు మంచి లుక్​ ఇస్తాయి. దీపావళి పూజ లేదా కుటుంబ సమావేశాలకు పర్ఫెక్ట్. మీ పండుగ దుస్తులకు తగ్గట్లుగా రంగు ఎంచుకుంటే బాగుంటుంది. వీటిని మెటల్ లేదా బంగారు గాజులతో కలిపి వేసుకోవచ్చు. చీరలు, లెహంగాస్తో అద్భుతంగా ఉంటాయి.

స్టోన్ బ్యాంగిల్స్

(Image Source: Canva)

మీరు మీ ఆభరణాలను మినిమల్​గా ఉంచుకోవాలనుకున్నప్పుడు స్టోన్-స్టడెడ్ గాజులు వేసుకోవచ్చు. రంగురంగుల రత్నాలతో వీటిని డిజైన్ చేస్తారు. ఇవి మీ పండుగ దుస్తులకు రాయల్ టచ్​ను ఇస్తాయి. దీపావళి పార్టీ కోసం వాటిని ఎంబ్రాయిడరీ చేసిన చీరలు, లెహంగాస్తో జత చేసుకోవచ్చు. పండుగ లైట్లలో ఇవి మంచి మెరుపు ఇస్తాయి. 

మరి మీ డ్రెస్​లకు తగ్గట్లు ఈ గాజులు ఎంచుకోండి. చాలామంది చేతులకు గాజులు వేసుకునేందుకు ఇష్టపడరు. అలాంటివారు కూడా పండుగల సమయంలో వీటిని ట్రై చేయవచ్చు. అలాగే గాజు గాజులు మీరు హ్యాండిల్ చేయలేరు అనుకుంటే మెటల్, సిల్వర్, థ్రెడ్ బ్యాంగిల్స్ వంటివి ఎంచుకుంటే మంచిది.