Diabetic Meal Plan : మధుమేహం ఉన్నవారు ఏ ఫుడ్ తీసుకోవాలన్నా కాస్త ఆలోచించాలి. అలాగే వారు బరువు పెరగకుండా మధుమేహాన్ని కంట్రోల్​లో ఉంచే డైట్​ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. బ్లడ్​లో షుగర్​ని కంట్రోల్ చేస్తూ హెల్తీగా ఉంచగలిగే డైట్​ కోసం చూస్తున్నారా? అయితే ఈ సింపుల్ డైట్​ని ఫాలో అయిపోండి. వారానికి సరిపడా ఉదయం నుంచి రాత్రి వరకు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇక్కడ ఉంది. 

సోమవారం

ఉదయాన్నే మెంతుల నీటితో ప్రారంభించాలి. వీటిని రాత్రుళ్లు నానబెట్టుకుని ఉదయాన్నే తాగాలి. నానబెట్టిన బాదంల 5 తినాలి. బ్రేక్​ఫాస్ట్​లో మిల్లెట్ ఇడ్లీ తినొచ్చు. స్నాక్​గా జామపండు, మధ్యాహ్న భోజనంలో మిల్లెట్స్, సాంబార్, బీట్​ రూట్, కీరదోస ముక్కలు తీసుకోవాలి. స్నాక్స్​ సమయంలో సున్నుండ తినొచ్చు. డిన్నర్​లో స్ప్రౌట్స్ సలాడ్, సాంబార్ తినొచ్చు. 

మంగళవారం

ఉదయాన్నే బూడిద గుమ్మడి జ్యూస్​తో ప్రారంభించాలి. మిల్లెట్ దోశను పల్లీ చట్నీతో కలిపి తీసుకోవచ్చు. స్నాక్​గా యాపిల్​, భోజన సమయంలో మిల్లెట్ కిచిడీ, సోయా కర్రీ, సలాడ్ తీసుకోవాలి. సాయంత్రం స్నాక్ సమయంలో బటర్ మిల్క్ తాగొచ్చు. రోటీ, సోయా కర్రీ, పెరుగు తీసుకోవచ్చు. 

బుధవారం

మెంతినీరు, 5 బాదంతో రోజును ప్రారంభించవచ్చు. బ్రేక్​ఫాస్ట్​గా రాత్రి పెరుగుతో కలిపి పెట్టిన చద్దన్నం తినొచ్చు. దీనిలో రైస్ తక్కువ, నీరు ఎక్కువ, పెరుగు తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలి. దానిమ్మను డైట్​లో మార్నింగ్ స్నాక్​గా తీసుకోవాలి. చనా మసాలా కర్రీని రెండు పుల్కాలతో భోజనం తీసుకోవాలి. శనగలను ఉడికించి తాళింపు వేసి స్నాక్​గా తీసుకోవచ్చు. డిన్నర్ సమయంలో చనా మసాల కర్రీని, కూరగాయలు ఉడికించి ఫ్రై చేసుకుని తినాలి. 

గురువారం 

బూడిద గుమ్మడి జ్యూస్​తో రోజును ప్రారంభించాలి. బ్రేక్​ఫాస్ట్​గా మొలకెత్తిన పెసలతో దోస చేసుకుని చట్నీతో తినొచ్చు. పుచ్చకాయను స్నాక్​గా తీసుకోవాలి. బ్రౌన్​ రైస్​ను పాలకూర పప్పుతో కలిపి క్యాబేజ్ ఫ్రైతో కలిపి తినొచ్చు. పల్లీలను ఉడికించి తాళింపు వేసుకుని స్నాక్​గా తీసుకోవచ్చు. పప్పు పాలకూరను పెసలతో చేసిన దోశలతో తినొచ్చు. 

శుక్రవారం 

మెంతినీరు, నానబెట్టిన 5 బాదంలతో రోజు ప్రారంభించాలి. గోధుమ రవ్వ ఉప్మాను కూరగాయలతో కలిపి తీసుకోవాలి. ఖర్బూజ పండును స్నాక్​గా తినొచ్చు. మిల్లెట్ రైస్​ను రసంతో కలిపి తినొచ్చు. క్యారెట్, బీన్స్ కలిపి ఫ్రై చేసుకుని భోజనంలోనే కలిపి తీసుకోవాలి. సాయంత్రం స్నాక్స్​గా నట్స్ తినాలి. చపాతీని క్యారెట్, బీన్స్ ఫ్రైని డిన్నర్​లో తీసుకోవచ్చు. 

శనివారం 

బూడిద గుమ్మడి జ్యూస్ తీసుకుని గ్యాప్ ఇచ్చి బ్రేక్​ఫాస్ట్​గా పనీర్ పోహా తీసుకోవాలి. స్నాక్​గా ఆరెంజ్, మధ్యాహ్నం వెజిటెబుల్ కిచిడి, క్యారెట్ రైతాను లంచ్​కోసం తీసుకోవచ్చు. ఈవెనింగ్ స్నాక్​గా పాప్​కార్న్ తినొచ్చు. పనీర్ బుర్జీని చపాతీతో కలిపి డిన్నర్ ముగించాలి. 

ఆదివారం 

మెంతి నీరు, బాదంతో రోజును ప్రారంభించాలి. ఆమ్లెట్, ఉడికించి ఫ్రై చేసుకున్న వెజిటెబుల్స్​ను బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవాలి. దానిమ్మను స్నాక్​గా, మిల్లెట్స్​ను చికెన్​ కర్రీ లేదా గుడ్డు కూరతో కలిపి తినొచ్చు. సాయంత్రం స్నాక్​గా యోగర్ట్, దానిమ్మ కలిపి తీసుకోవాలి. రాత్రి డిన్నర్​కి బ్రకోలి సూప్, ఉడికించిన వెజిటెబుల్స్​తో కలిపి తీసుకోవాలి. 

ఈ డైట్​ని ఫాలో అవుతూ వైద్యులు సూచించిన మందులు వేసుకోవాలి. అలాగే లైఫ్​స్టైల్​లో వ్యాయామాన్ని కూడా చేర్చుకోవాలి. ప్రతి మీల్ తర్వాత కాస్త కీరదోస తింటే కూడా మంచిదే. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత కీరదోసను తినేలా ప్లాన చేసుకోండి. ఇవి కేవలం అవగాహన కోసమే. మీరు నిపుణుల సలహాలు తీసుకుని ఆ డైట్​ని ఫాలో అయినా మంచి ఫలితాలుంటాయి.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.