Create Ghibli-Style Photos : ఇన్​స్టా, వాట్సాప్, ఫేస్​బుక్, x ఇలా ఏ సోషల్ మీడియా చూసినా ఇప్పుడు ఎక్కువమంది ఫాలో అవుతున్న ట్రెండ్ గిబ్లి స్టైల్(Ghibli-Style). ప్రస్తుతం ఈ ట్రెండ్ పట్ల సోషల్ మీడియా బాగా మొగ్గు చూపుతుంది. అందరూ ఈ తరహా ఫోటోలను అప్​లోడ్ చేస్తూ Ghibli-Styleని స్వాగతిస్తున్నారు. మరి ఈ ఫీచర్ డిటైల్స్ ఏంటి? ఫోటోలను Ghibli-Style ఫోటోలుగా ChatGPT ద్వారా ఎలా చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం. 

ప్రపంచవ్యాప్తంగా ChatGPT ప్లస్, ప్రో వినియోగదారులకు OpenAI లోకల్ ఇమేజ్ జనరేషన్ ఫీచర్​ను విడుదల చేసింది. జపాన్​కు చెందిన స్టూడియో Ghibliని డెవలెప్ చేసింది. గిబ్లి ఫోటోలు అంటే మీ రియల్ ఫోటోలను అనిమే (Anime)గా క్రియేట్ చేసుకోవడమే. అనిమే ప్రేమికులే కాకుండా దాదాపు అందరూ ఈ ఫీచర్​ను ఇష్టపడుతున్నారు. తమ ఫోటోలను ChatGPTని ఉపయోగించి.. Ghibli-Style ఫోటోలుగా కన్వర్ట్ చేసి.. వాటిని సోషల్ మీడియాలో అప్​లోడ్ చేస్తున్నారు

మార్చి 26వ తేదీనుంచి ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్​ను OpenAI, ChatGPT ఇమేజ్ జనరేషన్ ఫీచర్​ను మొదట్లో పెయిడ్ సబ్​స్క్రైబర్​లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చి.. ఉచిత వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. అయితే ChatGPT ఫ్రీ యూజర్స్ కూడా Ghiblify ద్వారా ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. మరి వీటిని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

ChatGPT ఫ్రీ యూజర్స్ xAI, Grok చాట్‌బాట్ లేదా జెమిని AIలతో ఈ ఫోటోలను క్రియేట్ చేస్తున్నారు. అయితే OpenAI, ChatGPT మోడల్స్​ని అవి ఏ మాత్రం బీట్ చేయలేకపోయాయి. మరి ఈ గిబ్లి స్టైల్ ఫోటోలు ChatGPT ద్వారా ఎలా జనరేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. 

ChatGPT ద్వారా Ghibli-Style ఫోటోలు చేయండిలా.. 

ముందుగా ChatGPTని వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ ఫోటోను అప్​లోడ్ చేయండి. దీనిని అప్​లోడ్ ఎలా చేయాలంటే.. ముందుగా మీకు నచ్చిన ఫోటో సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ChatGPT పేజ్​లో దిగువన ఎడమవైపు ఉన్న '+' గుర్తుపై క్లిక్ చేయాలి. అప్పుడు మీకు నచ్చిన ఫోటోను అప్​లో డ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత.. ఈ ఫోటోను 'Ghiblify' చేయమని రిక్వెస్ట్ చేయాలి. లేదా 'Turn this image into Studio Ghibli style' అని ChatGPTని అడగాలి. ChatGPT మీ ఫోటోను Ghibli-Styleలో మార్చడానికి కొన్ని సెకన్లు టైమ్ తీసుకుని.. జనరేట్ చేస్తుంది. ఈ ఫోటోను మీరు డైరెక్ట్​గా డౌన్​లోడ్ చేసుకోవచ్చు. 

గిబ్లి స్టైల్ వీడియో కోసం.. 

మీరు ఫోటోలతో గిబ్లి స్టైల్ వీడియోను చేయాలనుకుంటే.. మీరు ఫోటోలతో ChatGPTని ఉపయోగించి వాటిని వీడియోగా కంపైల్ చేయవచ్చు. మీకు నచ్చిన 10 ఫోటోలను ఫ్రేమ్​ వారీగా సెట్ చేసుకోవాలి. వాటిని Ask ChatGPT to generate 10 images, frame by frame, of a specific scene అంటూ అడగాలి. ఫోటోలను కంపైల్ చేయడానికి Python ఉపయోగించాలి. 5 FPS MP4 రూపంలో వీడియోను సేవ్ చేసుకోవాలి. 

మరిన్ని టిప్స్.. 

మీరు ప్రత్యేకమైన గిబ్లి స్టైల్ చిత్రాలను రూపొందించాలనుకుంటే.. విభిన్నమైన ప్రాంప్ట్స్(prompts) ట్రై చేయవచ్చు. గిబ్లి స్టైల్ చిత్రాలను రూపొందించడానికి మీరు xAI, గ్రోక్ చాట్‌బాట్ వంటి ఇతర AI సాధనాలతో వీటిని ట్రై చేయవచ్చు. మీకు కావలసిన రూపాన్ని పొందడానికి ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి మీ రూపొందించబడిన చిత్రాలను మరింత మెరుగుపరచుకోవచ్చు.