Healthier Snack Choice Popcorn or Chips  : కొందరికి ఆకలి ఎక్కువగా ఉంటుంది. అలాగే మరికొందరికి శీతాకాలంలో జీర్ణక్రియ పెరగడం వల్ల ఆకలి కాస్త త్వరగా వేస్తుంది. తిన్న కొన్ని గంటల్లోనే కారంగా, ఘాటైన ఫుడ్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఆకలిని తగ్గించుకోవడానికి చిప్స్, స్నాక్స్, టీతో పాటు వేయించిన ఆహారాన్ని తీసుకుంటారు. ఇవన్నీ జీర్ణవ్యవస్థకు, గుండెకు హాని కలిగిస్తాయి. ఇటువంటి సమయాల్లో చిప్స్ కంటే పాప్‌కార్న్ మంచిది అనుకుంటారు. మరి ఇది ఎంతవరకు నిజం. చిప్స్ కంటే పాప్‌కార్న్ నిజంగా మంచిదేనా? చూసేద్దాం.

Continues below advertisement

పాప్‌కార్న్? చిప్స్? 

చిప్స్​తో పోలిస్తే పాప్‌కార్న్ వేయించము, కారంగా ఉండదు. కాబట్టి ఇది మంచి స్నాక్ ఎంపిక. రెండవది ప్యాకేజీ లోపల చిప్స్‌ను తాజాగా ఉంచడానికి రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యానికి హానికరం. పాప్‌కార్న్ ఒక తృణధాన్యం. దీనికి చాలా తక్కువ నూనె లేదా సుగంధ ద్రవ్యాలు అవసరం. తక్కువ సమయంలో ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల ఆకలి కంట్రోల్ అవుతుంది. అతిగా తినడాన్ని నిరోధిస్తుంది.

పాప్‌కార్న్‌లోని పోషకాలు ఇవే..

పాప్‌కార్న్‌లో ఇతర స్నాక్స్ కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, కొవ్వు, ఇనుము, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో శరీరంలో వాత దోషం పెరుగుతుంది. పాప్​కార్న్ పొడి స్వభావం కారణంగా ఈ వాత పెరుగుదలను సమతుల్యం చేస్తుంది. అధిక కేలరీలు ఉండవు. దీనివల్ల పాప్‌కార్న్ తిన్నా బరువు పెరిగే ప్రమాదం ఉండదు. 

Continues below advertisement

చిప్స్ ఎంత ప్రమాదకరమైనవి?

వేయించిన, కారంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె, రక్త నాళాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. అయితే పాప్‌కార్న్ కొలెస్ట్రాల్-తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్త నాళాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇంకా పాప్‌కార్న్ మితంగా తీసుకుంటే కడుపు ఆరోగ్యానికి కూడా మంచిది. కానీ మీరు గ్యాస్ లేదా అజీర్ణంతో ఇబ్బంది పడుతుందే వాటికి దూరంగా ఉంటే మంచిది. 

పాప్‌కార్న్ ఎలా తీసుకోవాలి?

పాప్‌కార్న్ తింటే మంచిదని తెలుస్తుంది. కానీ వాటిని ఎలా తీసుకుంటే ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. పాప్‌కార్న్‌ను ఎల్లప్పుడూ బ్లాక్ సాల్ట్, నెయ్యి, జీలకర్ర పొడితో తయారు చేసుకోవాలి. ఇది రుచిని పెంచుతుంది. కడుపునకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.