Salt vs Sugar Weight Gain : సాల్ట్, షుగర్ శరీర బరువుపై వివిధ రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తాయి. షుగర్​ తింటే బరువు పెరుగుతారని అందరికీ తెలుసు. అందుకే ఈ మధ్యకాలంలో చాలా మంది పంచదారను, స్వీట్లను తమ డైట్​ల నుంచి తొలిగించేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన మరొక్క ప్రశ్న ఏంటి అంటే.. సాల్ట్ తింటే కూడా బరువు పెరుగుతారా? షుగర్ మాదిరే ఇది కూడా బరువు పెరిగేలా చేస్తుందా? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. అసలు సాల్ట్​ తింటే బరువు పెరుగుతారా? లేదో ఇప్పుడు తెలుసుకుందాం. 

సాల్ట్​తో బరువు పెరుగుతారా?

అధ్యయనాల ప్రకారం సాల్ట్ డైరక్ట్​గా బరువు పెరగడంపై ప్రభావం చూపించదట. కానీ.. తాత్కాలికంగా వాటర్ వెయిట్ పెరిగేలా చేస్తుంది. దీనివల్ల బరువు పెరిగినట్లు అనిపించవచ్చు. సాల్ట్​ని ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరం తనలోని నీటి శాతాన్ని నిలిపేస్తుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా బరువు పెరిగినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా బరువు చెక్ చేసుకున్నప్పుడు కూడా బరువు పెరుగుతారు. అయితే ఇది ఫ్యాట్ అయితే కాదని చెప్తున్నారు నిపుణులు. 

సాల్ట్​లో కేలరీలు కూడా ఉండవు. కాబట్టి ఇవి డైరెక్ట్​గా ఫ్యాట్​ని పెరిగేలా చేయవు. అలా అని శరీరంలో కొవ్వును పేర్కొనేలా చేయవు. కానీ సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే తాత్కాలికంగా శరీరంలో నీరు నిలిచిపోయి బరువు పెరిగిన ఫీల్ ఇస్తుంది. దీనితో పాటు బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. 

షుగర్ ఎందుకు అవాయిడ్ చేయాలంటే.. 

షుగర్​లో కేలరీలు ఉంటాయి. దీనిని ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు బరువు పెరిగేలా చేస్తాయి. అంతేకాకుండా కేలరీలు ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈజీగా బరువు పెరగడంతో పాటు వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే షుగర్​ ఎక్కువగా తీసుకున్నప్పుడు శరీరంలో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ఫ్యాట్ స్టోరేజ్ అయ్యేలా చేస్తుంది. వివిధ రూపాల్లో చక్కెరను శరీరానికి అందిచేవారికి ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

షుగర్ అనేది అడిక్టివ్. దీని రుచి కాస్త నోటికి తగలగానే మరింత ఎక్కువ తినాలనే క్రేవింగ్స్ పెంచుతుంది. దీనివల్ల ఎక్కువగా తింటారు. కేలరీలు కూడా ఎక్కువగా శరీరానికి అందుతాయి. దీనివల్ల బరువు పెరుగడంతో పాటు మధుమేహ సమస్యలు పెరుగుతాయి. బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఒబెసిటీ, గుండె సమస్యలు కూడా ఎక్కువయ్యే ప్రమాదముంది. అందుకే షుగర్​ని అవాయిడ్​ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. 

రెండింటికీ ఉన్న తేడా ఇదే

సాల్ట్​తో వాటర్ వెయిట్ పెరుగితుంది కానీ బాడీ ఫ్యాట్ పెరగదు. షుగర్​తో ఫ్యాట్ పెరుగుతుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలముకుంటే షుగర్​కి వీలైనంత దూరంగా ఉండాలి. దీనిని కంట్రోల్ చేసి రెగ్యులర్​గా వ్యాయామం చేస్తే బరువు కంట్రోల్ అవుతుంది. మీరు బాడీ లుక్​ని ప్రోపర్​గా కనిపించాలి.. వాటర్ వెయిట్ ఉండకూడదనుకుంటే మీరు సాల్ట్​ని కంట్రోల్ చేయవచ్చు. ఉదహారణకు మీరు మీ సిక్స్ బాడీ చూపించాలనుకున్నప్పుడు మీరు సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే అవి ప్రోపర్​గా ఆ లుక్​ కనిపించదు. వాటర్ అనేది శరీరంలో ఎక్కువగా పేరుకుపోయి.. ఆ లుక్​ని కరాబ్ చేస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.