Butter Chicken Shoes : షూ లో బటర్ చికెన్ పెట్టుకుని తిన్న యువతి.. ఇదెక్కడి ఇంటర్నెట్ స్టంట్ రా బాబు
Butter Chicken from Transparent Shoes : బటర్ చికెన్ షూస్.. అంటూ ఓ షూ లో యువతి బటర్ చికెన్ పెట్టుకుని తింది. ఈ వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇది ఫ్యాషనా? ఫుడ్ స్టంటా?

Butter Chicken Shoe Video : ఇంటర్నెట్‌లో వింత వింత వంటకాలు, వీడియోలూ చూస్తూనే ఉంటాం. అయితే అప్పుడప్పుడు యూజర్స్‌ని ఆశ్చర్యపరిచేవి కొన్ని వీడియోలు కనిపిస్తాయి. అలాంటి వీడియోల్లో ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఓ వీడియో. అదే బటర్ చికెన్ షూస్. పేరు వినడానికి వియర్డ్‌గా ఉంటుంది. అలాగే చూసేందుకు కూడా ఆశ్చర్యపరిచేలాగానే ఉంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ రీల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇది వీక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే గందరగోళానికి గురిచేసింది. అలాగే కొంచెం కలవరానికి గురిచేస్తోంది. ఈ క్లిప్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాల్లో ఒకటైన ఒక ఆహారం కావడంతో.. ఇప్పుడు దాని గురించిన ఆసక్తి.. యూజర్స్‌లో పెరిగింది. అందుకే దానిని వైరల్ చేశారు.
View this post on Instagram
బటర్ చికెన్ షూస్ అంటే ఏంటి?
వీడియోలో కంటెంట్ క్రియేటర్ ఆహారాన్ని ఉంచడానికి వీలుగా క్రియేట్ చేసిన ట్రాన్సప్రెంట్ షూస్ వేసుకుంది. షూ సోల్లో బటర్ చికెన్‌ను వేసి.. జాగ్రత్తగా నింపి.. దానిని పై పొరతో మూసివేసింది. దానిలో స్పూన్‌ను వెళ్లేందుకు తగినంత స్థలం ఉంటుంది. ఈ విచిత్రమైన ఫ్యాషన్ ప్రయోగం, ఊహించని ఆహార ప్రదర్శనతో బాగా వైరల్ అయింది.
బూట్లు వేసుకున్న తర్వాత ఆమె వాటిని ధరించి మాములుగా నడిచింది. తర్వాత అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ.. ఓ చోట కూర్చుని.. ఒక స్పూన్ తీసుకుని.. నేరుగా షూ నుంచి బటర్ చికెన్ తింది. ఇది ప్రేక్షకులలో ఆసక్తిని, అసౌకర్యాన్ని రేకెత్తించింది.
ఇంటర్నెట్ స్పందన
అయితే దీనిపై చిత్ర, విచిత్రమైన కామెంట్స్ వచ్చాయి. కొందరు ఫన్నీగా జోక్స్ వేస్తుంటే.. మరికొందరు ఫుడ్‌ని కాళ్లకింద తొక్కి తినడమేంటి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు పరిశుభ్రత గురించి ఆందోళన చెందారు. కొంతమంది వినియోగదారులు హాస్యంతో స్పందించారు. మరికొందరు ఆమెను విమర్శించారు.
- "As an Indian my soul is leaving my body, we don't bring foods closer to our feet😭"
- "మారథాన్ శిక్షణకు పర్ఫెక్ట్, మధ్యలో తినడానికి స్నాక్స్ రెడీ"
- "SOUL FOOD❌ SOLE FOOD✔"
- "One shoe for curry; one shoe for rice!!! 😍😍😍"
- "Sometimes I pray to God to snatch away my ability to see 🙂"
- "That's a disrespect towards butter chicken"
- "how I’m packing my lunch for culinary school 🫡🍗"
ఇలా చాలామంది కామెంట్స్ చేశారు. అలాగే మరో వ్యక్తి ఇది 10 సైజులో వస్తుందా అంటూ అడిగాడు.
బటర్ చికెన్‌తో నిండిన పాదరక్షలు క్రియెటివిటీ కోసం తయారు చేసినప్పటికీ.. ఆన్‌లైన్‌లో ఇది చాలామంది దృష్టిని ఆకర్షించింది. పైగా ఇదే క్రియేటర్స్ గోల్ కూడా. క్రియేటివ్గా వీడియోలు చేసి.. ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ఇది ఆహార ప్రేరేపిత ఫ్యాషన్ కాదు.
























