పెళ్లంటే ఇప్పుడు పెద్ద ఈవెంట్. ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ వరకు ప్రతి మధుర క్షణాన్ని కెమేరాల్లో బంధించాల్సిందే. ఆ తీపి జ్ఞాపకాలను బంధించేందుకు ఫొటోగ్రాఫర్లకు భారీ మొత్తాన్నే చెల్లించుకోవాలి. పెళ్లి కోసం అంత ఖర్చుపెట్టడం ఇష్టంలేనివారు.. కేవలం పెళ్లి రోజు మాత్రమే ఫొటోగ్రాఫర్‌ను పెట్టుకుంటారు. ఇందుకు ఒకొక్కరు ఒక్కో విధానాన్ని పాటిస్తారు. కొన్ని పెళ్లిల్లో వరుడి కుటుంబికులే ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేసుకుంటారు. లేదా వధువు కుటుంబికులు ఏర్పాటు చేస్తారు. లేకపోతే, ఇద్దరూ ఎవరి ఫొటోగ్రాఫర్‌ను వారు తెచ్చుకుంటారు. అయితే, ఈ పెళ్లిలో మాత్రం అలా జరగలేదు.
పెళ్లి కోసం అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పెళ్లి కొడుకు ఊరేగింపు నుంచి రాగానే వరమాల కార్యక్రమాన్ని కూడా చేసేశారు. అయితే, పెళ్లి కూతురుకు దరిదాపుల్లో ఎక్కడా ఫొటోగ్రాఫర్ కనిపించలేదు. దీంతో అక్కడికక్కడే వరుడిని నిలదీసింది. ఫొటోగ్రాఫర్ ఎక్కడ అని అడిగింది. రాలేదని, అతడు సమాధానం చెప్పాడు. అంతే, ఆమె తనకు ఆ పెళ్లి వద్దని వెంటనే రద్దు చేసుకుంది. వెంటనే పీటల మీద నుంచి దిగిపోయి, కోపంతో పక్కింటికి వెళ్లిపోయింది.
Also Read: నా భార్య రోజూ మ్యాగీ పెట్టి చంపేస్తోంది - కోర్టుకు భర్త మొర, చివరికి..
ఆమెను పెళ్లి చేసుకోవాలని కుటుంబికులు చాలాసేపు బతిమాలారు. పెళ్లి గురించి పట్టించుకోని వ్యక్తి.. భవిష్యత్తులో తన బాధ్యతలను ఎలా చూసుకుంటాడని సూటిగా ప్రశ్నించింది. అప్పటికీ పెద్దలు ఆమెకు ఎంతో చెప్పిచూశారు. తన నిర్ణయాన్ని ఇదేనని వధువు చెప్పేసింది. దీంతో పెద్దలు ఆ పెళ్లిని రద్దు చేస్తు్న్నట్లు ప్రకటించారు. దీంతో వరుడి కుటుంబికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల మధ్య పోలీసులు రాజీకుదిర్చారు. పెళ్లి ఖర్చులను తిరిగి ఇచ్చేస్తామని వధువు కుటుంబికులు చెప్పడంతో వివాదానికి తెరపడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని మంగలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు కుటుంబికులు వీడియో, ఫొటోగ్రాఫర్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ గొడవ జరిగిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: మిట్ట మధ్యాహ్నం సెక్స్, సడన్‌గా గతం మరిచి ‘గజినీ’లా మారిపోయిన భర్త, ఈ సమస్య మీకూ రావచ్చు!