Disadvantages of Skipping or Delay Breakfast : ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. బ్రేక్​ఫాస్ట్​ స్కిప్ చేయవద్దని ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తారు నిపుణులు. అంతేకాకుండా మీరు ఏ టైమ్​కి తింటున్నారు.. ఏమి తింటున్నారనేది కూడా ముఖ్యమేనని చెప్తున్నారు.  ఎందుకంటే ఈరోజు మీరు తీసుకునే ఆహారం.. వయసు పెరిగే కొద్ది ఆరోగ్యంపై ఇంపాక్ట్ చూపిస్తుందట. వయసు పెరిగేకొద్ది తెలియకుండానే ఆహారంలో మార్పు చేస్తూ ఉంటాము. అలా చేసే మార్పుల్లో కొందరు అల్పాహారం చాలా లేట్​గా తింటారు. లేదా అస్సలు పూర్తిగా తినడాన్ని ఆపేస్తారు. ఇది అస్సలు మంచిది కాదని.. ఇప్పుడు బాగానే ఉన్నా.. ఫ్యూచర్​లో ఇది మీ ఆరోగ్యంపై నెగిటివ్​ ప్రభావాలు చూపిస్తుందని చెప్తున్నారు. 

Continues below advertisement

చిన్నవారికి, పెద్దవారికి తేడా అదే

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, టైమ్-రెస్ట్రిక్టెడ్ ఈటింగ్ వంటి పోకడలు ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి. అయితే వాటి ప్రభావాలు వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య స్థితిని బట్టి మారవచ్చు. వయుసు తక్కువగా ఉండేవారు.. ఆహారం తీసుకునే సమయాన్ని తగ్గించడం వల్ల జీవక్రియకు ప్రయోజనం చేకూరుతుంది. కానీ పెద్దవారిలో ఆలస్యంగా లేదా అల్పాహారం మానేయడం వల్ల మంచి కంటే ఎక్కువ హాని జరుగుతుంది.

టిఫిన్​ లేట్​గా తింటే మంచిది కాదా?

బ్రేక్​ఫాస్ట్​ ఆలస్యంగా చేయడం వల్ల అంతర్లీన శారీరక లేదా మానసిక ఆరోగ్య సమస్యలు వస్తాయట. మొదటి భోజనాన్ని ఎంత ఆలస్యం చేస్తే అంత సమస్యలు పెరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది అలసట ఎక్కువ అవ్వడం, మానసిక స్థితిలో మార్పులు, నోటి ఆరోగ్యంలో ఇబ్బందులు, నిద్రలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ అలవాట్లు రోజూ చేసే పనులు చేయడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. 

Continues below advertisement

ఆహారం ఆలస్యంగా తీసుకోవడం వల్ల సర్కాడియన్ రిథమ్​లో మార్పులు వస్తాయి. ఇది నిద్ర, ఆకలిని నియంత్రిస్తుంది. దీనివల్ల సహజంగానే ఆలస్యంగా నిద్రపోయే, మేల్కొనే వ్యక్తులు రోజులో ఆలస్యంగా భోజనం చేసే అవకాశాలు పెరుగుతాయి. ఉంది. అయితే పెద్దవారిలో ఈ మార్పు జీవక్రియ, శక్తి స్థాయిలు, మొత్తం శ్రేయస్సుపై ప్రభావం చూపిస్తుంది.

ఆయుష్షుపై ప్రభావం.. 

ఆహార షెడ్యూల్‌ పాటించకపోతే.. వృద్ధాప్యం త్వరగా రావడంతో పాటు.. వయసు పెరిగాక ఆరోగ్య సమస్యలు మరింత పెరుగుతాయని చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయం తీసుకునే మొదటి భోజనం.. జీర్ణక్రియ, హార్మోన్ల సమతుల్యత, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది కాబట్టి దానిని అస్సలు విస్మరించవద్దని చెప్తున్నారు. బ్రేక్​ఫాస్ట్​ అనేది శరీరంలోని అంతర్గత వ్యవస్థలను సమకాలీకరించడానికి సహాయపడుతుందని.. సరిగ్గా తినకపోయినా, తినడం మానేసినా ఇబ్బందులను కలిగిస్తుంది. ఆరోగ్య ప్రమాదాలతో పాటు మరణాల రేట్లతో సంబంధం కలిగి ఉంటుందట.

క్రమం తప్పకుండా భోజనం తీసుకోవడం.. ముఖ్యంగా అల్పాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం.. మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును కాపాడుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సమతుల్యమైన భోజనం తీసుకోవడం, టైమ్​కి తీసుకోవడం ప్రారంభించినప్పుడు శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఆరోగ్యానకి మేలు జరుగుతుంది. అల్పాహారం టైమ్​కి తినడం చిన్న మార్పే అయినా.. ఫ్యూచర్​లో మంచి ప్రయోజనాలు ఇస్తుంది.