Top Nutrition Secrets For Kids : ప్రపంచంలోని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లతో పోల్చితే, అందరికంటే బాగా పోషకాహారం గురించి తెలిసి వ్యక్తి అమ్మ. తమ పిల్లలు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలో ఆమె కంటే మరెవరికీ ఎక్కువగా తెలియదు. పిల్లలు ఏ ఫుడ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు? వారికి రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఇవ్వాలనేది ఆమెకు బాగా తెలుసు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కూడా తమ పిల్లలకు చక్కటి పోషకాహారాన్ని అందిస్తూ ఆరోగ్యంగా పెంచుతున్నారు. బాలీవుడ్ టాప్ 5 స్టార్స్ తమ పిల్లలకు ఎలాంటి ఫుడ్ అందించారో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. 


1.ఐశ్వర్య రాయ్


పిల్లలకు లైట్ గా ఉండే సంప్రదాయ ఫుడ్ అందించేందుకు ఐశ్వర్య రాయ్ ఇష్టపడుతుంది.ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అలవాటు పెంపొందిస్తే, పిల్లలు పెద్దయ్యాక కూడా ఇదే పద్దతిని పాటించే అవకాశం ఉంటుందని భావిస్తుంది. కష్టమైన వర్కౌట్స్ లేకుండానే హెల్దీ వెయిట్ ఉండే ఫుడ్ తీసుకునేలా చేయాలంటుంది. “ఆరాధ్య ఇంటి ఫుడ్ తినేందుకు ఇష్టపడుతుంది. మా ఆహారపు అలవాట్లు కూడా లైట్ గా ఉంటాయి. రోటీ, సబ్జీ, దాల్ రైస్ ను ఇష్టంగా తింటాము. భారతీయ వంటకాలు చాలా ఆరోగ్యకరమైనవి. థాయ్, మెక్సికన్, ఇటాలియన్‌ ఫుడ్స్ ప్రయత్నించాల్సిన అవసరం మాకు లేదు” అంటుంది ఐశ్వర్య.


2.శిల్పాశెట్టి


శిల్పాశెట్టి ఎంత ఫిట్ గా ఉంటుందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చక్కటి ఫుడ్ డైట్ ఫాలో అవుతుంది. తన పిల్లలు కూడా హెల్దీ ఫుడ్ తీసుకునేలా జాగ్రత్త పడుతుంది. ఆమె తన తల్లి నుంచి నేర్చుకున్న ఫుడ్ సీక్రెట్స్ ను తన పిల్లలకు విషయంలో ఉపయోగిస్తుంది. “మా అమ్మకు నా కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి పూర్తి విషయాలు తెలుసు. గుండె ఆరోగ్యాన్ని పెంచే ఫుడ్ తీసుకుంటాం. కూరగాయాలను ఎక్కువ తినేలా జాగ్రత్త పడుతుంది. సాధారణ పాలను కాకుండా కొబ్బరి పాలను ఎక్కువగా వినియోగిస్తుంది. కొబ్బరిపాలలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా ఉండే ఫుడ్ తీసుకుంటాము” అని శిల్పా వెల్లడించింది.


3.రవీనా టాండన్


రవీనా తన పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ నుంచే పోషకాహారాన్ని అందిస్తుంది. పాలు, అరటిపండు, గుడ్లు, తృణధాన్యాలు,  వోట్మీల్, పెరుగు, గింజలు ఉండేలా చూసుకుంటుంది. పిల్లలు నూనె, ఫ్రైడ్ ఫుడ్, మైదా, ఎరేటెడ్ డ్రింక్స్‌ కు దూరంగా ఉండేలా చూసుకుంటుంది. “సాధారణంగా, నేను వారికి ఇష్టంలేని వంటకాలను ఇష్టమైన ఫుడ్ గా తయారు చేసి అందిస్తాను. పిల్లలు కూరగాయలను తినేందుకు ఇష్టపడరు. కానీ, వారికి తినాలి అనే ఆసక్తి కలిగించేలా చేయాలి” అని చెప్పుకొచ్చింది. 


4.మలైకా అరోరా


మలైకా కూడా ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆమె పిల్లలు బయటి ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. మలైకా కొడుకు సౌత్ ఇండియన్ ఫుడ్(పాస్తా)ను చాలా ఇష్టపడుతాడు. అయితే, మలైకా తమ పిల్లలకు  పరిశుభ్రత ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తుంది. అనారోగ్యకరమైన ఫుడ్ ను మాత్రం అస్సలు తినకుండా జాగ్రత్తపడుతుంది. “నేను పిల్లలకు పెట్టే ఫుడ్ లో ఎప్పుడూ స్పెషల్ సాస్ ఉంటుంది. పిల్లలకు కొత్త పదార్థాలతో కూడిన ఫుడ్ పెడతాను. నేను డైనింగ్ టేబుల్ దగ్గరే పిల్లలకు భోజనం పెడతాను. పిల్లలు టీవీ చూస్తున్నప్పుడు, ఇతర పనుల్లో ఉన్నప్పుడు ఫుడ్ తీసుకోకుండా చూసుకుంటాను” అని చెప్పింది.  


5.కరిష్మా కపూర్


కరిష్మా పిల్లలు ఆమె తయారు చేసే ఫుడ్ ను ఇష్టంగా తింటారు. దాల్ చావల్, భిండి అంటే చాలా ఇష్టం. బ్రోకలీ, క్యారెట్ లాంటి కూరగాయలను పెద్దగా ఇష్టపడరు. వారిలో ఇష్టాన్ని పెంచేలా వివిధ ఆకారాలలో కట్ చేసి తినేలా ప్రోత్సహిస్తుంది. “పిల్లలు ఇష్టం లేని ఫుడ్ తినేలా ప్రోత్సహించేందుకు వారికి కథలు చెప్తాను. ఆరోగ్యకరమైన ఫుడ్ పెడతాను. వీకెండ్ లో కాస్త జంక్ ఫుడ్ పెడతాను. కానీ, మోతాదును మించి తినకుండా చూసుకుంటాను” అని చెప్పుకొచ్చింది.


Read Also: జిమ్‌‌కు వెళ్తే జ్వరమొస్తాది, వ్యాయామం వల్ల కాదు.. ఇవిగో ఈ కారణాల వల్ల, జర భద్రం!