Best Yoga Asanas to Boost Your Sexual Life : యోగా అనేది శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు లైంగిక ఆరోగ్యానికి కూడా మద్ధతునిస్తుంది. కొన్ని ఆసనాలు శరీరంలోని రక్తప్రసరణను మెరుగుపరిచి.. ఒత్తిడిని తగ్గిస్తాయి. అంతేకాకుండా హార్మోన్ల సమతుల్యతను కాపాడడంలో, శరీరాన్ని లైంగికంగా యాక్టివ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అలా లైంగిక జీవితాన్ని మెరుగుపరిచే యోగా ఆసనాలు ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

భుజంగాసనం 

లైంగక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో భుజంగాసనం మంచి ప్రయోజనాలు ఇస్తుంది. దీనిని కోబ్రా పోజ్ అంటారు. ఈ ఆసనం చేయడం కోసం బోర్లా పడుకోవాలి. చేతులను భుజాల దగ్గరకు తీసుకుని సపోర్ట్ ఇస్తూ ఛాతీ భాగాన్ని తలతో సహా పైకి లేపాలి. అంటే పాము పడగ విప్పినట్లుగా శరీరం ఉండాలి. ఇలా చేయడం వల్ల శృంగారానికి అవసరమైన అవయవాల్లో రక్తప్రసరణ పెరుగుతుంది. నరాలు బలపడి ఒత్తిడిని తగ్గిస్తాయి. 

సేతు బంధాసనం 

సేతు బంధాసనాన్నే బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి నేలపై పడుకోవాలి. ఇప్పుడు కాళ్లను మడిచి.. చేతులను కింద చాపి ఉంచి.. నడుము భాగాన్ని పెకి లేపాలి. ఈ ఆసనం చూసేందుకు బ్రిడ్జ్​లాగా ఉంటుంది. ఈ ఆసనం రెగ్యులర్​గా వేయడం వల్ల లైంగికంగా స్టామినా పెరుగుతుంది. హార్మోన్ల పనితీరు మెరుగవుతాయి. తొడలు, వెన్నెముకకు బలం చేకూరుతుంది. 

బటర్​ఫ్లై పోజ్

దీనినే బద్ధ కోణాసనం అని కూడా అంటారు. ఈ ఆసనం కోసం నేలపై కూర్చోవాలి. పాదాలను కలిపి.. తొడలను స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు వాటిని సీతకోక చిలుక రెక్కలు ఆడించినట్లు తొడలను ఫ్లాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల యోని ఆరోగ్యం మెరుగుపడుతుంది. తొడలకు బలం చేకూరుతుందని చెప్తున్నారు. 

ధనురాసనం 

ఈ ఆసనం చేయడం కోసం పొట్టపై పడుకోవాలి. మోకాళ్లను వెనక్కి మడిచి చేతులతో వాటిని పట్టుకుని ఛాతిని పైకి లేపాలి. ధనస్సు రూపంలో కనిపిస్తుంది కాబట్టి ఈ ఆసనాన్ని ధనురాసనం అంటారు. ఈ ఆసనం శృంగార జీవితాన్ని ఉత్తేజతం చేయడంతో పాటు శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తుందట. 

పశ్చిమోత్తానాసనం 

పశ్చిమోత్తానాసనం చేయడం కోసం ముందుగా నేలపై కూర్చొని పాదాలు చాపాలి. ఇప్పుడు శరీరాన్ని వంచుతూ.. చేతులతో పాదాలను పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. వెన్నెముక, తొడలకు స్ట్రెంత్ అందుతుంది. ఇది క్రమంగా లైంగిక ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తుంది. 

ఈ ఆసనాలే కాకుండా శృంగార అనుభూతిని పెంచే ఉత్కట కోణాసనం, అలసటను తగ్గించి హార్మోన్లను ప్రేరేపించే విపరీత కరణి వంటి ఆసనాలు కూడా ట్రై చేయవచ్చు. అంతేకాకుండా ప్రాణాయామం రెగ్యులర్​గా చేస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. శరీరానికి అవసరమైన నిద్ర, ఆహారాన్ని అందిస్తే కూడా లైంగిక ఆరోగ్యం మెరుగవుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.