Tomato Pesticide Removal : టమాటాలు ఇలా ఈజీగా శుభ్రం చేయండి.. ఉప్పుతో పురుగుమందులు తొలగిపోతాయా?
Tomatoes Cleaning Tips : టమాటాలకు పురుగులు పట్టకుండా పురుగులు వేసి పెంచుతూ ఉంటారు. అయితే వాటిని సరిగ్గా క్లీన్ చేసి వండుకోకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో వాటిని ఎలా క్లీన్ చేయవచ్చో తెలుసా?

Remove Pesticides from Tomatoes : చాలామంది రోజూవారీగా చేసే వంటల్లో ఎక్కువగా వండే వంటల్లో టమాటాలను ఉపయోగిస్తారు. దాదాపు ఉల్లిపాయతో పాటు ఎక్కువగా ఉపయోగించే వాటిలో టమాటా కచ్చితంగా ఉంటుంది. అయితే మార్కెట్లో దొరికే చాలా టమాటాలపై పురుగుమందులు (పెస్టిసైడ్స్) ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాటిని సరిగా శుభ్రం చేసుకోవాలని చెప్తున్నారు.
టమాటాలను ఇంట్లోనే సులభంగా, కెమికల్స్ లేకుండా శుభ్రం చేసుకోవచ్చు. ఉప్పు ఉంటే చాలు. మరి ఉప్పు సహాయంతో టమాటాలను ఎలా శుభ్రం చేయాలో.. ఉప్పుతో కాకుండా టమాటాలను ఎలా పురుగులు మందులు లేకుండా శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటాలపై పురుగుమందులు
టమాటా పంటను కీటకాలు, పురుగుల నుంచి రక్షించేందుకు రైతులు పురుగుమందులు ఉపయోగిస్తారు. కోత తర్వాత కూడా కొన్ని కెమికల్స్ తొక్కపై మిగిలిపోతాయి. అయితే ఇవి కేవలం నీటితో కడగడం వల్ల అన్ని పెస్టిసైడ్స్ తొలగిపోవు. కాబట్టి ఉప్పుతో టమాటాలను శుభ్రం చేసుకోవచ్చు.
శుభ్రమైన నీరు తీసుకుని.. దానిలో ఉప్పు వేసుకోవాలి. దానిలో టమాటాలు వేసి.. ఆ ఉప్పు నీటిలో వేసి 10–15 నిమిషాలు నానబెట్టాలి. తరువాత టమాటాలను తీసి శుభ్రమైన నీటితో బాగా కడగాలి. శుభ్రమైన గుడ్డతో తుడిచి వంటకు ఉపయోగించాలి. ఉప్పు నీరు టమాటా తొక్కపై ఉన్న పురుగుమందులు, మురికి, బ్యాక్టీరియాను విడదీయడంలో సహాయపడుతుంది.
ఉప్పు నీరు ఎలా పనిచేస్తుంది?
ఉప్పు నీటిలో సహజమైన యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది టమాటా తొక్కపై ఉన్న రసాయన అవశేషాలను వదిలిస్తుంది. కీటకాల గుడ్లు, సూక్ష్మజీవులను దూరం చేస్తాయి. అయితే ఉప్పుతో పాటు మరికొన్ని ఇతర చిట్కాలు కూడా టమాటాలను శుభ్రం చేసేందుకు ఉపయోగించవచ్చు.
- వెనిగర్ నీరు
నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి టమాటాలను 10 నిమిషాలు నానబెట్టడం వల్ల కూడా పెస్టిసైడ్స్ తగ్గుతాయి.
- బేకింగ్ సోడా
1 టీస్పూన్ బేకింగ్ సోడాను నీటిలో వేసి టమాటాలను 12–15 నిమిషాలు ఉంచితే మంచి ఫలితం ఉంటుంది.
- వేడి నీటితో
వేడినీటిలో (30–40 సెకన్లు) గోరువెచ్చని నీటిలో ముంచి వెంటనే చల్లని నీటిలో వేస్తే ఉపరితల రసాయనాలు తగ్గుతాయి.
మరిన్ని జాగ్రత్తలు
టమాటాలను కట్ చేసే ముందు మాత్రమే కడగాలి. అలా అని ఎక్కువసేపు నీటిలో ఉంచకూడదు. అలా చేస్తే పోషకాలు తగ్గుతాయి. ఆర్గానిక్ టమాటాలు దొరికితే వాటినే ఉపయోగించండి. పిల్లలు, గర్భిణీలు ఉన్న ఇంట్లో కూరగాయలను శుభ్రం చేయడంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
























