Summer Speical Online Celebrations : ఎండల ఎఫెక్ట్‌తో ఆన్లైన్ వేడుకలు.. బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ వినూత్న సెలబ్రేషన్స్
Bengalee Celebrations : రవీంద్ర జయంతి, నజ్రుల్ జయంతి, మదర్స్ డే సందర్భంగా బెంగాలీ కల్చరల్ అసోసియేషన్ పలు వేడుకలు నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆన్లైన్లో చేయడం.

Bengalee Community Online Cultural Festival 2026 : ఎండల ఎఫెక్ట్‌తో సెలబ్రేషన్స్ ఎందుకు ఆపుతాము.. ఆన్లైన్లో చేసుకుంటామంటున్నారు బెంగాలీ కల్చరల్ ఆసోసియేషన్ సభ్యులు. రవీంద్ర జయంతి, నజ్రుల్ జయంతి, మదర్స్ డే (Rabindra Jayanti, Nazrul Jayanti, and Mothers Day)సందర్భంగా హైదరబాద్‌లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది జరుపుకునే వేడుకలే అయినా.. ఈసారి కాస్త భిన్నంగా జరుగుతున్నాయి. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆన్లైన్లో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
బెంగాలీ సంస్కృతి, సంగీతం, సాహిత్యం ఉట్టిపడేలా.. మే 1 నుంచి మే 10 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆన్లైన్లో చేస్తోన్న ఈ వేడుకలకు మంచి స్పందన లభిస్తుంది. ఎందుకంటే అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్లో చేయాలనే ఆలోచనతో.. అందరూ సురక్షితంగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఆశ్చర్యం కలిగించే విధంగా.. 7 ఏళ్ల పిల్లల నుంచి 70 ఏళ్ల పెద్దల వరకు అందరూ వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
వేడుకల్లో హైలెట్స్..
చిన్నపిల్లలు పాటలు, డ్యాన్స్‌లతో ఆకట్టుకుంటుండగా.. పెద్దలు సాహిత్యం, సంగీత కార్యక్రమాలతో వేడుకకు మరింత ప్రత్యేకత తీసుకొస్తున్నారు. ఉత్సవంలో భాగంగా రవీంద్ర సంగీత్ గాన ప్రదర్శనలు, ఠాగోర్ కవితల ఆధారంగా రూపొందించిన నృత్యాలు, కాజీ నజ్రుల్ రచనలకు నివాళులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే మదర్స్ డే సందర్భంగా అమ్మలకు పాటలు, కవితలు అంకితం చేస్తూ.. వారితో ఉన్న జ్ఞాపకాలను పంచుకునేవిధంగా వేడుకలు డిజైన్ చేశారు.
ఈ ఉత్సవం కేవలం వినోద కార్యక్రమంగానే కాకుండా.. బెంగాలీ వారసత్వాన్ని కొత్త తరాలకు పరిచయం చేయడం, కుటుంబ బంధాలను మరింత బలపరచడం, సభ్యుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెప్తోన్నారు అసోసియేషన్ సభ్యులు. పిల్లలు వారి సంస్కృతి, సంగీతం, సాహిత్యం గురించి తెలుసుకునే మంచి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు.
సమ్మర్లో అందరికీ అనుకూలంగా ఇలా ఆన్లైన్ ద్వారా వేడుకలు జరుపుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో నెవర్ కాంప్రిమైజ్ ఫర్ సెలబ్రేషన్స్ అంటూ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు.
Before You Go
Simple Yoga for Body Fat | చెడు కొవ్వును సింపుల్ యోగాసనాలతో దూరం చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















