Sreemukhi Traditional Looks : తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేషన్స్ పీక్స్​లో ఉంటాయి. ఈ సమయంలో హడావుడి అంతా అమ్మాయిలదే. పైగా వెంటనే దసరా కూడా వచ్చేస్తుంది. ఈ సమయంలో ఎలాంటి లుక్స్ బాగుంటాయో అనేది చాలామందిలో మెదిలే క్వశ్చన్. ట్రెడీషనల్​గా, ట్రెండీగా ఉంటూనే బ్యూటీఫుల్​ లుక్స్​ని ఎలా సెట్​ చేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీరు తెలంగాణ పోరి శ్రీముఖిని ఫాలో అయిపోండి. అవును లెహంగా లుక్స్​ గురించి మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. శ్రీముఖి ఇన్​స్టా పేజ్​ని ఫాలో అయిపోతే మంచిది. దసరా, బతుకమ్మ కోసమే కాకుండా ఎలాంటి ట్రెడీషనల్ లుక్స్​కోసం అయినా మీరు ఈ లుక్స్​ని ఫాలో అయిపోవచ్చు. 


కలర్​ ఫుల్​ లుక్​ కోసం.. 




శ్రీముఖి ధరించిన ఈ లెహంగా లుక్స్ ఏ ఫెస్టివల్​కి ఇట్టే నప్పేస్తాయి. ముఖ్యంగా బతుకమ్మ సమయంలో ఉపయోగించే పూలు ఎలాంటి రంగులు ఉంటాయో.. ఇలాంటి మల్టీపుల్ కలర్ లెహంగాలో చాలా అందంగా కనిపిస్తారు. న్యూడ్ కలర్ లెహంగాను ఇలాంటి మల్టీపుల్ కలర్ చున్నీ లేదా ఓణితో కలిపి పెయిర్ చేయవచ్చు. మ్యాచింగ్ బ్లౌజ్​ మీకు పర్​ఫెక్ట్ లుక్స్ ఇస్తుంది. లెహంగాకు తగ్గట్లు మల్టీపుల్ కలర్ బ్యాంగిల్స్, జ్యూవెలరీ ధరిస్తే పండుగకి మీ లుక్​ సెట్. 


నెక్ డిజైన్స్




లెహంగాలు ధరించేప్పుడు కొందరు ఓణి లేదా చున్నీలను వేసుకునేందుకు పెద్దగా ఇష్టపడరు. అలాంటివారు ఇలాంటి నెక్ లుక్స్ ట్రై చేయవచ్చు. పైగా బతుకమ్మకు సంబంధించి.. పూలతో కూడిన లెహంగాను డిజైన్ చేయించుకోవచ్చు. పైగా చున్నీ వద్దు అనుకున్నప్పుడు స్లీవ్స్ ఫుల్​గా ఉండే.. నెక్ డిజైన్ ట్రెండీగా ఉండే లెహంగా లుక్స్​ బాగుంటాయి. పైగా ఎలాంటి జ్యూవెలరీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ చెవిరింగులు పెట్టుకుంటే సరిపోతుంది. 


పండుగ కళ ఉట్టిపడేలా




ఫెస్టివల్ సమయంలో మనం వేసుకునే డ్రెస్​ని బట్టే పండుగ కళ వచ్చేస్తుంది. అయితే మీరు ఇలాంటి పట్టు లెహంగాకి ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్, ఓణి పెయిర్ చేయవచ్చు. ముఖ్యంగా పండుగను ఎలివేట్ చేసే ఎల్లో కలర్ బాగా సెట్ అవుతుంది. ఇలాంటి లెహంగాలు టెంపుల్, ఫెస్టివ్ వైబ్స్​ని ఇస్తాయి. పైగా ఎలాంటి వారికైనా ఈ తరహా లుక్స్ బాగా నప్పుతాయి. ఈ తరహా లెహంగాలను ఎంచుకుంటే స్టోన్స్​తో కూడిన జ్యూవెలరీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. 


పట్టు లెహంగా




పట్టు చీర అయినా లెహంగా అయినా పండుగ సమయంలో వేసుకుంటే చందమామల ఉండడం మాత్రం పక్కా. ముఖ్యంగా ఇలాంటి రెడ్, గ్రీన్ కాంబినేషన్ లుక్​ చాలా అందంగా ఉంటుంది. ఈ లెహంగాకు తగ్గట్లు గోల్డెన్ జ్యూవెలరీని పెట్టుకుంటే చాలా అందంగా ఉంటారు. మీరు కూడా ఈ బతుకమ్మ, దసరా టైమ్​లో ఈ లుక్స్​ని ట్రై చేయవచ్చు. 


ట్రెండీ, మోడ్రన్ లెహంగా లుక్​లో




పండుగల సమయంలో ట్రెండీ, మోడ్రన్ లుక్​లో  కనిపించాలనుకుంటే బ్లాక్ బెస్ట్ ఛాయిస్. గోల్డెన్ కలర్ లెహంగా లుక్స్​కి తగ్గట్లు బ్లాక్ కలర్ బ్లౌజ్ ధరించవచ్చు. ఎంబ్రాయిడరీ బోర్డర్ వచ్చిన బ్లాక్ చున్నీని దానికి పెయిర్ చేస్తే చాలా గ్రాండ్​గా కనిపిస్తారు. బ్లాక్ స్టోన్స్ ఉన్న జ్యూవెలరీ పెట్టుకుంటే మరింత స్టైలిష్​గా, ప్రెట్టీగా కనిపిస్తారు. 


లంగాఓణిలో




పండుగల సమయంలో లంగాఓణిలు మీకు పర్​ఫెక్ట్ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి నీలిరంగుల లంగాఓణిలు మంచి లుక్​ని ఇస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ తరహా లంగాఓణిలో ఏ అమ్మాయి అయినా చాలా అందంగా కనిపిస్తారు. మీరు కూడా ఈ తరహా లుక్స్​ని బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ట్రై చేయండి. 


Also Read :వినాయకచవితికి ఈ డ్రెస్​లు బెస్ట్ ఆప్షన్.. అమ్మాయిలు మీరు ఇలా ముస్తాబైపోండి..