అన్వేషించండి

Summer Drinks : ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచాలంటే ఈ డ్రింక్స్ తాగేయండి.. కూల్ డ్రింక్స్ కంటే ఇవే బెస్ట్

Beat the Summer Heat : వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం బయట దొరికే కూల్ డ్రింక్స్ కంటే ఇంట్లో తయారుచేసుకోగలిగే ఈ డ్రింక్స్‌ మంచివని చెప్తున్నారు నిపుణులు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవి వేడి తగ్గించడానికి కూల్ డ్రింక్స్ బదులు సహజ పానీయాలు తాగాలి.
  • కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సబ్జా నీళ్లు తాగాలి.
  • పుచ్చకాయ, పెరుగు స్మూతీ, హెర్బల్ టీ వేడిని తగ్గిస్తాయి.
  • డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Natural Drinks That Keep Your Body Cool : వేసవిలో అధిక వేడి కారణంగా శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగిపోతుంది. దీంతో అలసట, దాహం, తలనొప్పి, చెమటలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తుంటాయి. అలాంటి సమయంలో చాలామంది కూల్ డ్రింక్స్ తాగితే రిలీఫ్ వస్తుంది అనుకుంటారు. కానీ అవి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. పైగా ఆరోగ్యానికి కూడా మంచివి కాదని.. ఇవి డీహైడ్రేషన్ సమస్యను మరింత రెట్టింపు చేస్తాయని.. దాహం ఎక్కువ అయ్యేలా చేస్తాయని చెప్తున్నారు నిపుణులు. 

ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ కాకుండా.. సహజసిద్ధమైన కొన్ని పానీయాలు ట్రై చేయాలని చెప్తున్నారు. ఇవి వేడిని తగ్గించి శరీరాన్ని లోపల నుంచి చల్లబరచడంలో హెల్ప్ చేస్తాయి. మరి వేసవిలో బాడీ హీట్ తగ్గించేందుకు ఉపయోగపడే నేచురల్ డ్రింక్స్ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

కొబ్బరి నీళ్లు

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి డీహైడ్రేషన్‌ను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే అలసటను దూరం చేసి తక్షణమే శరీరానికి ఎనర్జీ ఇస్తాయి. కాబట్టి వేసవిలో రోజుకు ఒకసారి అయినా తాగితే మంచిది. 

మజ్జిగ

శరీర వేడిని తగ్గించే సహజమైన డ్రింక్స్​లలో మజ్జిగ బెస్ట్ డ్రింక్ అని చెప్తారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగా చేసుకునేప్పుడు దానిలో కాస్త జీలకర్ర పొడి కలిపి తాగితే ఇంకా మంచిదని అంటున్నారు.

నిమ్మరసం

నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి తక్షణ ఎనర్జీ ఇవ్వడమే కాకుండా వేడి వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పెంచి సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది. 

సబ్జా సీడ్ వాటర్

సబ్జా గింజలు శరీరాన్ని చల్లబరచడంలో చాలా బాగా పనిచేస్తాయి. కాబట్టి వాటిని నీటిలో నానబెట్టి జ్యూస్ లేదా పాలలో కలిపి తాగితే బాడీ హీట్ తగ్గుతుంది. లేదంటే నీటిలో కలిపి.. కాస్త నిమ్మరసం వేసుకుని రోజంతా తాగినా మంచి ఫలితాలు ఉంటాయి. 

పుచ్చకాయ జ్యూస్

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి హైడ్రేషన్ అందించి వేడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. కాబట్టి దీనిని ఎలాంటి షుగర్ లేకుండా జ్యూస్​గా తాగినా.. నేరుగా తిన్నా మంచి ఫలితాలు అందుతాయి. 

పెరుగు స్మూతీ

పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. దీనిని ఫ్రూట్స్‌తో కలిపి స్మూతీలా తీసుకుంటే టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి. మ్యాంగోతో కలిపి తీసుకుంటే లిమిటెడ్​గా తీసుకోవాలి. 

హెర్బల్ టీ

పుదీనా, తులసి వంటి ఆకులతో తయారుచేసే లైట్ హెర్బల్ టీ శరీరాన్ని రిలాక్స్ చేసి వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మీకు టీ తాగాలనిపించినప్పుడు దానిని రిప్లేస్ చేస్తూ వీటిని తాగవచ్చు. అయితే మరీ వేడిగా కాకుండా కాస్త చల్లారిన తర్వాత తాగితే బెటర్. 

గుర్తించుకోవాల్సిన విషయాలు.. 

వేసవిలో శరీరాన్ని చల్లబరచుకోవడానికి, తక్షణమే రిలీఫ్ కావాలనుకుని షుగర్ డ్రింక్స్ లేదా కూల్ డ్రింక్స్ జోలికి వెళ్లకండి. అలాగే రోజంతా దాహం వేసినా.. వేయకున్నా నీళ్లు తాగుతూ ఉండండి. ఎండలో బయటకు వెళ్లకుండా.. వెళ్లినా ఎక్కువసేపు ఉండకుండా, తలపై సూర్యుడు నేరుగా పడకుండా జాగ్రత్తలు తీసుకోండి. డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని గుర్తించుకోండి. 

ఇలాంటి సమ్మర్ స్పెషల్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yoga Career: యోగా నేర్చుకుంటే.. మీ లైఫ్‌ను మార్చే కెరీర్ ఆప్షన్స్ ఇవే!
యోగా నేర్చుకుంటే.. మీ లైఫ్‌ను మార్చే కెరీర్ ఆప్షన్స్ ఇవే!
Yoga Poses for Weight Loss : బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి
బరువు తగ్గాలన్నా.. పొట్టను తగ్గించుకోవాలన్నా.. ఈ ఎఫెక్టివ్ 7 యోగాసనాలు వేసేయండి
Banana Hair Mask : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
AI and Healthcare : ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?
ఆస్పత్రుల్లో AI వినియోగం పెరిగితే వైద్యులపై పనిభారం తగ్గొచ్చు.. కానీ రోగులకు మంచిదా? కాదా? రద్దీ పెరుగుతుందా?
Advertisement

వీడియోలు

Arshdeep Angry Gill For Gurbaz Wicket | రివ్యూతీసుకోకపోవడంతో గుర్బాజ్ సెంచరీ
Gurnoor Brar Debut vs Afghanistan | ఇంటర్నేషనల్ క్రికెట్‌లో గుర్నూర్ సంచలన డెబ్యూ
IND vs AFG 1st ODI Highlights | అఫ్గాన్‌పై టీమిండియా ఘన విజయం
Shubman Gill Slip Catch vs Afghanistan | రోహిత్ రనౌట్‌పై గిల్ షాకింగ్ కామెంట్స్
Rohit Sharma Breaks 37-Year-Old Record | 39 ఏళ్ల వయసులో హిట్ మ్యాన్ అరుదైన రికార్డు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Singapore Visit: ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
ఏపీలో పెట్టుబడులకు పెట్టుబడులకు మోదీ ఎకో సిస్టం భరోసా - సింగపూర్ ఇన్వెస్టర్లకు చంద్రబాబు పిలుపు
Razor OTT : ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి రవిబాబు డార్క్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Abhijeet Dipke Attacked in Jaipur: కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్‌పై జైపూర్‌లో ఎటాక్ - భయపెట్టాలనే చేశారా?
Kavitha Singareni Visit: సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
సింగరేణిలో కవిత బొగ్గుబాయి యాత్ర.. రూ. 50 వేల కోట్ల బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
British Kashmiris Protest outside UK parliament: ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
ఆక్రమిత కశ్మీర్‌లో పాక్ బలగాల దారుణాలు - యూకే పార్లమెంట్ ఎదుట కశ్మీరీల నిరసన
Robbery In Circar Express: బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. పారిపోతున్న దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
బాపట్ల వద్ద సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో దొంగల బీభత్సం.. దొంగలపై రైల్వే పోలీసుల కాల్పులు
Chandrababu Naidu Importance In NDA: ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
ఎన్డీఏకు తృణమూల్ చీలిక వర్గం మద్దతు - చంద్రబాబు కింగ్ మేకర్ పోస్టు పోయిందా?
Delimitation Bill 2026: ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
ప్రధాని ఆర్థిక సలహా మండలి చేసిన డీలిమిటేషన్ సిఫార్సులతో కలకలం - దక్షిణాది రాష్ట్రాలు ఆమోదిస్తాయా?
Embed widget