Makar Sankranti 2026: భారతీయ సంస్కృతి, యోగా, యజ్ఞాలు, స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో స్వామి రామ్‌దేవ్ ప్రస్తావించారు. మకర సంక్రాంతి వంటి పండుగలను సనాతన సంప్రదాయానికి పునాదిగా అభివర్ణించారు.
తన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా పౌరులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, యోగా గురువు స్వామి రామ్‌దేవ్ భారత సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వాన్ని హైలైట్ చేశారు. మకర సంక్రాంతి, పొంగల్, బిహు వంటి పేర్లతో సనాతన సంప్రదాయాలకు ఆధారంగా అభివర్ణించారు. ఈ సందర్భాలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా, ప్రకృతి పట్ల గౌరవం, క్రమశిక్షణ, జీవితంలో బ్యాలెన్సింగ్ చేసుకోవడం ప్రాముఖ్యతను కూడా నేర్పుతాయని రామ్‌దేవ్ అన్నారు.
సింథటిక్ ఉత్పత్తుల ప్రమాదాలపై హెచ్చరిక
ఆధునిక జీవనశైలిలో రసాయనాలు, సింథటిక్ ఉత్పత్తుల వాడకం పెరగడంపై రామ్‌దేవ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రసాయనాలపై ఆధారపడటం మానవ ఆరోగ్యానికి హాని కలిగించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కూడా దెబ్బతీస్తుందని బాబా రాందేవ్ అన్నారు. యోగా గురువు ఈ రసాయనాలను జీవనశైలి రుగ్మతలకు కారణమని పేర్కొన్నారు. ప్రజలు సేంద్రియ, సహజ ఉత్పత్తులను స్వీకరించాలని ప్రజలకు ఆయన సూచించారు.
యోగా, యజ్ఞం, విద్య ప్రాముఖ్యత
యోగా, 'యజ్ఞం'లను భారతీయ సంస్కృతికి పునాదిగా బాబా రాందేవ్ అభివర్ణించారు. రాందేవ్ ప్రకారం, ఈ పద్ధతులు కేవలం శారీరక వ్యాయామం లేదా మతపరమైన ఆచారాలు మాత్రమే కాదు, వాటి వల్ల మానసిక ప్రశాంతత, సామాజిక సామరస్యం, సమగ్ర ఆరోగ్యానికి మార్గం లాంటివి అన్నారు. రాందేవ్ భారతీయ శిక్షా బోర్డ్ గురించి కూడా ప్రస్తావిస్తూ, ఆధునిక విద్యను భారత విలువలతో అనుసంధానం చేయడానికి ఇది స్థాపించినట్లు తెలిపారు. తద్వారా భవిష్యత్ తరాలు తమ మూలాలతో అనుసంధానమై ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
స్వదేశీ, మేక్ ఇన్ ఇండియాపై దృష్టి
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి రామ్‌దేవ్ 'మేక్ ఇన్ ఇండియా'కు మద్దతు తెలిపారు. విదేశీ వస్తువులకు బదులుగా స్వదేశీ ఉత్పత్తులను ఎంచుకోవాలని దేశ ప్రజలకు రాందేవ్ విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో తయారు చేసిన ఉత్పత్తులను ఉపయోగించినప్పుడు, మనం మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా, స్వదేశీ జ్ఞానాన్ని గౌరవిస్తామని, ప్రాధాన్యత ఇస్తామని అన్నారు.
పతంజలి ఉత్పత్తులను ఉదాహరణగా పేర్కొంటూ, సహజ జీవనశైలిని అవలంబించడం ద్వారా మాత్రమే ఆరోగ్యకరమైన, నాణ్యమైన జీవితాన్ని గడపవచ్చని అన్నారు. ఈ మారుతున్న మోడ్రన్ రోజుల్లో సైతం పండుగ సందర్భాలలో భారత సంప్రదాయాలు తెలుసుకోవాలని, పాత రోజులకు తిరిగి రావాలని ప్రజలను కోరారు. మరిన్ని వివరాల కోసం, కింద ఇచ్చిన పూర్తి లైవ్ వీడియోను చూడండి: