Dinner Mistakes for Weight Gain : బరువు తగ్గడం చాలా కష్టమని భావిస్తూ ఉంటారు. అయితే తెలియకుండా లేదా పర్లేదులే అని చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల బరువు పెరుగుతామని అంటున్నారు నిపుణులు. అలాగే డిన్నర్ సమయంలో చేసే కొన్ని తప్పుల వల్ల బరువు పెరుగుతారట. ఇవి చాలా కామన్, సింపుల్ అనుకుంటారు కానీ.. వీటిని ఇగ్నోర్ చేయకపోతే మీరు బరువు తగ్గాలనే గోల్‌కి చెక్ పెట్టేయడమే బెటర్ అంటున్నారు నిపుణులు. ఇంతకీ డిన్నర్ సమయంలో చేసే మిస్టేక్స్ ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
బరువు తగ్గాలంటే బ్రేక్‌ఫాస్ట్ ఇవి తీసుకోవాలని చెప్తారు కానీ.. డిన్నర్ విషయం గురించి అంతగా చెప్పారు. మధ్యాహ్నాం మీల్స్‌లో ఉన్నట్టే డిన్నర్ విషయంలో కూడా కొన్ని ఫాలో అవ్వాలట. అయితే డిన్నర్లో ఏమి తినాలి.. ఏమి తినకూడదు.. ఏ టైమ్‌లో తినొచ్చో.. ఎంత తినొచ్చో వంటి విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి అంటున్నారు. లేదంటే ఇవి మీరు బరువు పెరగడానికి దారి తీస్తాయంటున్నారు.
ఎక్కువగా తినడం..
ఆఫీస్ నుంచి రిలాక్స్ అవుతున్నామనుకుని.. టేస్టీగా ఫుడ్ ఉంది.. ఇప్పుడు పనేమి లేదనుకుని చాలామంది ఎక్కువగా తినేస్తారు. డిన్నర్ సమయంలో ఎక్కువ మీల్స్ అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. మెటబాలీజం ఎక్కువగా ఉంటే బరువు తగ్గుతారు. కానీ తక్కువగా ఉంటే బరువు పెరిగిపోతూ ఉంటారు. అందుకే సలాడ్స్, సూప్‌లు, వెజిటేబుల్స్ వంటివి తీసుకుంటే మంచిది. ఇవి బరువును తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
ఆలస్యంగా తినడం..
వివిధ కారణాల వల్ల చాలా మంది డిన్నర్‌ను ఆలస్యంగా చేస్తారు. అయితే లేట్ నైట్ భోజనం చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు. అలాగే బరువును వేగంగా పెంచుతుందని చెప్తున్నారు. ఫాస్టింగ్ ఎక్కువ సయమం ఉంటే కొవ్వు కరుగుతుంది కానీ.. తక్కువ సమయం ఉంటే చెడు కొవ్వు పెరిగి బరువు పెరుగుతారు. కాబట్టి వీలైనంత త్వరగా డిన్నర్ చేయడానికి ట్రై చేయండి.
ఫుడ్ కేలరీలు..
రాత్రి సమయంలో కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకుంటే బరువు పెరుగుతారు. అధిక కేలరీల తీసుకుంటే బరువు పెరిగిపోతారు కాబట్టి వీలైనంత వరకు లో కేలరీ ఫుడ్స్ తీసుకోవాలి అంటున్నారు. చిన్న ప్లేట్లో ఫుడ్ తింటే ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుందని చెప్తున్నారు.
అవి కచ్చితంగా ఉండాలి..
తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ కచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇవి బరువును తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. కాబట్టి ఈ పోషకాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులతో నిండిన ఆహారాన్ని వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నారు. పైగా ఫైబర్, ప్రోటీన్ ఎక్కువకాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ఇవి మంచి ఆప్షన్.
ఉప్పును తగ్గించండి..
ఉప్పును ఎక్కువగా తీసుకుంటున్నారా? అయితే మీరు బరువు పెరగడంలో ఇది కూడా ఓ ప్రధాన కారణమవుతుంది. ఎందుకంటే ఇది శరీరంలో నీటిని నిల్వ చేస్తుంది. దీనివల్ల బరువు పెరుగుతారు. ఈ సమస్యను నివారించుకోవాలంటే.. ఉప్పును తీసుకోవడాన్ని కంట్రోల్ చేయాలి.
వాటి జోలికి వెళ్లొద్దు
పుల్లటి ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. రాత్రి సమయంలో వీటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు డైటీషియన్లు. వెనిగర్, సాంబార్, పుల్లని సూప్స్, ఫుడ్స్ నీటిని శరీరంలో ఉంచుతాయి. వీటి వల్ల బరువు పెరుగుతారు. అందుకే పులుపు, ఉప్పు లేకుండా ఉండే ఫుడ్ తీసుకోండి.
ఈ మిస్టేక్స్‌ని చాలా తక్కువ అంచనా వేస్తారు కానీ.. ఇవి బరువును ఈజీగా పెంచేస్తాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండాలని చెప్తున్నారు నిపుణులు.
Also Read : వర్షాకాలంలో ఈ సూప్ డిన్నర్గా తీసుకుంటే చాలామంచిది.. బరువు కూడా తగ్గుతారు, మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా