Steel Utensils Are Not Safe for These Foods : వంటగదిలో స్టీల్ గిన్నెలు వాడడం సహజం. చాలామంది ఇళ్లల్లో ఇవి ఉంటాయి. ఎక్కువమందిని వీటిని ఇష్టపడతారు కూడా. ఎందుకంటే స్టీల్ పాత్రలు మన్నికైనవి. శుభ్రం చేయడం కూడా ఈజీనే. కానీ కొన్ని ఆహార పదార్థాలు స్టీల్ పాత్రల్లో ఉంచడం అవి ప్రమాదకరంగా మారుతాయట. కొన్నింటిని స్టీల్ పాత్రల్లో ఉంచితే.. రుచిలో మార్పులు రావడమే కాకుండా.. ఆరోగ్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని చెప్తున్నారు.
వాస్తవానికి కొన్ని ఆహార పదార్థాలు స్టీల్‌తో చర్య జరిపే మూలకాలను కలిగి ఉంటాయి. అలాంటప్పుడు ఆహారాలు, స్టీల్ పాత్రల మధ్య రసాయన చర్య జరగవచ్చు. దీని వలన ఆహారం రుచి చెడిపోవచ్చు. పోషకాలను కూడా కోల్పోవచ్చు. దీని వలన ఫుడ్ టాక్సిక్‌గా లేదా ఫుడ్ పాయిజనింగ్ సమస్యలు పెంచుతుంది. కాబట్టి స్టీల్ పాత్రల్లో ఎప్పుడూ కొన్ని ఫుడ్స్ నిల్వ చేయకూడదు. అలాంటి ఆహార పదార్థాలు ఏమిటో.. వాటిని ఉంచడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.
స్టీల్ పాత్రల్లో పండ్లు వద్దు..
పండ్లలో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వాటిని సరిగ్గా నిల్వ చేయడం చాలా ముఖ్యం. స్టీల్ పాత్రల్లో పండ్లను ఉంచడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. వాటి రుచి కూడా చెడిపోతుంది. అంతేకాకుండా స్టీల్ పాత్రలు ఫ్రూట్స్ తేమను పెంచుతాయి. దీనివల్ల పండ్లు త్వరగా కుళ్లిపోతాయి. పండ్లను నిల్వ చేయడానికి గాలి చొరబడని గాజు కంటైనర్లు ఉత్తమ ఎంపికలు. మీరు కావాలనుకుంటే.. మంచి నాణ్యత గల ప్లాస్టిక్ కంటైనర్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఇది పండ్లను ఎక్కువ కాలం తాజాగా, సురక్షితంగా ఉంచుతుంది.
పచ్చళ్లు అస్సలు పెట్టకండి..
ఊరగాయ ప్రతి ఇంటి వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. ఎక్కువ కాలం వీటిని నిల్వ చేస్తారు. ఊరగాయల్లో సహజ ఆమ్లం ఉంటుంది. ఉప్పు స్టీల్‌తో రసాయన చర్య జరపవచ్చు. ఇది స్టీల్ పాత్రలకు తుప్పు పట్టే ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా ఊరగాయ రుచి కూడా పాడు చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ ప్రతిచర్య ఆహారానికి కూడా హాని కలిగించవచ్చు. అందువల్ల ఊరగాయలను ఎల్లప్పుడూ గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో మాత్రమే నిల్వ చేయాలి. దీనివల్ల నాణ్యత అలాగే ఉంటుంది. ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం ఉండదు.
పెరుగు కూడా వద్దట
పెరుగు మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ పెరుగును స్టీల్ పాత్రల్లో ఉంచడం మంచిది కాదు. పెరుగులో కొన్ని మూలకాలు ఉంటాయి. ఇవి స్టీల్‌తో కలిసి చెడు ప్రతిచర్యను కలిగిస్తాయి. పెరుగు రుచిని పాడు చేస్తాయి. దీనివల్ల పెరుగు త్వరగా పాడైపోతుంది. అంతేకాకుండా స్టీల్ పాత్రల్లో ఉంచడం వల్ల పెరుగు త్వరగా పులిసిపోవచ్చు. దీనివల్ల అది తినడానికి పనికిరాకుండా పోతుంది. కాబట్టి పెరుగును ఎల్లప్పుడూ గాజు లేదా మట్టి పాత్రల్లో నిల్వ చేయాలి. మట్టి పాత్రలు పెరుగును తాజాగా ఉంచడమే కాకుండా.. పెరుగు రుచిని కూడా అలాగే ఉంచుతాయి.
కాబట్టి స్టీల్ కంటైనర్స్‌లో లేదా పాత్రల్లో వీటిని ఉంచకండి. తినేందుకు స్టీల్ పాత్రలు వాడటం మంచిదే కానీ.. కొన్ని రకాల ఫుడ్స్ కోసం మాత్రం వీటిని ఉపయోగించకపోవడమే మంచిది.