సోషల్ మీడియాలో వచ్చే ట్రెండ్ కొన్ని సరదాగా ఉంటే మరికొన్ని ప్రాణాల మీదకు తీసుకొస్తాయి. అటువంటి ట్రెంట్ ఒకటి ఫాలో 13 ఏళ్ల బాలిక నిజంగానే ప్రాణాలు పోగొట్టుకుంటుంది. ప్రస్తుతం క్రోమింగ్ అనే ట్రెండ్ లో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌కు చెందిన ఎస్రా హేన్స్ ఫాలో అయింది. మీడియా నివేదికల ప్రకారం ఏరోసోల్ డియోడరెంట్ క్యాన్ నుంచి రసాయనాలు పీల్చింది. ఫలితంగా కార్డియాక్ అరెస్ట్ కు గురై ప్రాణాలు విడిచింది.


క్రోమింగ్ అంటే ఏంటి?


క్రోమింగ్ అంటే హఫింగ్ అని కూడా పిలుస్తారు. మెటాలిక్ పెయింట్, ఘాటైన ద్రావకాలు, పెట్రోల్, ఇతర గృహ రసాయనాలు ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా పీల్చడం చేస్తారు. విషపూరిత రసాయనాలు ఏరోసోల్ క్యాన్లు, పెయింట్ ద్రావకాలు, డియోడరెంట్, ఇల్లు శుభ్రపరిచే ఉత్పత్తులు, నైట్రస్ ఆక్సైడ్, పెట్రోల్, గది సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ వంటివి ఈ జాబితాలో ఉంటాయి. వీటి వాసన కొంత వరకు బాగున్నా కూడా నేరుగా ముక్కు దగ్గర పెట్టుకుని పీల్చడం హానికరం. ఈ ఘాటైన వాసనలకు కొంతమంది బానిసలుగా మారతారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఒక డ్రగ్ కిందకే వస్తుంది.


క్రోమింగ్ అంత ప్రమాదకరమా?


అత్యంత ప్రమాదకరమైన రసాయనాలలో నైట్రస్ ఆక్సైడ్ ఒకటి. బెలూన్లు, క్యాన్స్ లో ఎక్కువగా నింపుతారు. కొంతమంది దీన్ని సరదాకి పీలుస్తారు. దీన్ని గట్టిగా పీల్చడం వల్ల అది కేంద్ర నాడీ వ్యవస్థ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. ఫలితంగా మెదడు కార్యకలాపాలు మందగిస్తాయి. జర్నల్ ఆఫ్ ఆల్కహాల్ రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనాల ప్రకారం అటువంటి వాటిని పీల్చడం వల్ల దీర్ఘకాలికంగా దృష్టి లోపం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఐక్యూ తక్కువగా ఉండటం వంటి ప్రభావాలు ఎదురవుతాయి.


క్రోమింగ్ సైడ్ ఎఫెక్ట్స్


☀ మాటల్లో తడబాటు


☀ తలతిరగడం


☀ వికారం


☀ వాంతులు


దీర్ఘకాలికంగా విష పదార్థాలని పీల్చడం వల్ల


☀ గుండె పోటు


☀ మూర్చలు


☀ ఊపిరాడటంలో ఇబ్బందులు


☀ కోమా


☀ శాశ్వతంగా మెదడు దెబ్బతినడం


డ్రగ్ ఫ్రీ వరల్డ్ డేటా ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో సగటున 12-1 సంవత్సరాల మధ్య 5,93,000 మంది యువకులు క్రోమింగ్ లో పాల్గొంటున్నారు. వారిలో 22 శాతం మంది మరణిస్తున్నారు.


ఎస్రాకి కార్డియాక్ అరెస్ట్


వైద్యులు తెలిపిన దాని ప్రకారం ఎస్రా కార్డియాక్ అరెస్ట్ కి గురైంది. దాదాపు వారం రోజుల పాటు చికిత్స అందించినా కూడా ఫలితం లేకుండా పోయింది. కొన్ని రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత తన ఊపిరితిత్తులుల గుండె కొలుకున్నప్పటికీ మెదడు మాత్రం కోలుకోలేకపోయింది. దీంతో తను ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. తన బిడ్డలా ఏ ఒక్కరూ కూడ ప్రాణాలు పోగొట్టుకోకూడదని ఎస్రా క్రోమింగ్ వల్ల కలిగే నష్టాల మీద అవగాహన కల్పిస్తున్నారు.


2019 నుంచి ఈ ట్రెండ్ ఉంది. ఇందులో పాల్గొన్న ఇద్దరు 16 ఏళ్ల యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో టీనేజ్ అమ్మాయి క్రోమింగ్ చేయడానికి ప్రయత్నించి మెదడు దెబ్బతింది.


Also Read: షాకింగ్ స్టడీ - మైక్రోప్లాస్టిక్ వల్ల పిల్లలు పుట్టడం కష్టమేనట!