Jagannath Anasara Festival : జగన్నాథ రథ యాత్ర (Lord Jagannath Rath Yatra) కన్నుల పండుగగా జరుగుతుంది. ఎందరో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తారు. మరికొన్ని రోజుల్లో ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా సాగనుంది. అయితే జన్నాథుడి రథయాత్రకు ముందు దేవతలను భక్తులకు దూరంగా ఉంచే ఓ ప్రత్యేకమైన ఆచారం ఉందని తెలుసా. అదే అనసర ఆచారం. అసలు ఈ ఆచారం ఎందుకు చేస్తారు? దేవతలకు కూడా అనారోగ్యం ఉంటుందా? దీని నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
అనసరా ఆచారం..
జగన్నాథుడి రథయాత్రకు ముందు 15 రోజులు పాటు దేవతలను భక్తులకు దూరంగా ఉంచుతారు. ఇలా ఉంచే ఆచారాన్ని అనసరా అంటారు. ఈ సమయంలో దేవతలకు అనారోగ్యంగా ఉంటుందని భావిస్తూ.. ప్రత్యేక వైద్యం, మూలికా చికిత్సలు అందిస్తారని భక్తులు నమ్ముతారు. ఇలా దేవతలను అనసరా సమయంలో ఘర అనే ప్రదేశంలో ఉంచుతారు. అయితే దీనివెనుక మనం తెలుసుకోవాల్సిన మరో కోణం కూడా ఉందని చెప్తారు.
అనసరా కథ ఇదే..
జగన్నాథుడు తన సోదరుడైన బలభద్ర, సహోదరి అయిన సుభద్రతో కలిసి ఈ అనసరాలో భాగంగా 15రోజులు ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఈ సమయంలో విగ్రహాలను భక్తులకు కనిపించకుండా షెడ్యూల్డ్ చేసిన గదిలో ఉంచుతారు. భక్తులు దేవతలు అనారోగ్యంగా ఉన్నారని భావించే సమయం ఇదే.
రికవరీ
15 రోజుల అనసరా తర్వాత దేవతలకు స్నాన యాత్ర చేస్తారు. ఈ ప్రక్రియ అనారోగ్యం నుంచి కోలుకున్నట్లు, పునర్జన్మించినట్లు కొత్త ఉత్సాహంతో బయటకు రావడాన్ని సూచిస్తుంది. దీని తర్వాత నూతన ఉత్సాహంతో దేవతలు రథయాత్రలో పాల్గొంటారు.
అనారోగ్యానికి అసలైన అర్థమిదే..
జగన్నాథుడి ట్రెడీషన్లో భాగంగా దేవతలకు అనారోగ్యం అనేదానికి అర్థం వేరే ఉందట. అంటే ఈ అనారోగ్యం శారీరకమైనది కాదట. ఇది ఆధ్యాత్మికమైన డిటాచ్‌మెంట్‌గా భావిస్తారు. అంటే ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా కొన్నిరోజులు ఉండడమని అర్థం. వాడుక భాషలో చెప్పాలంటే ఐసోలేషన్. ఇది విశ్రాంతి, పునరుద్ధరణను సూచిస్తుంది.
ఈ ఆచారం జనన, మరణం, పునర్జన్మ అనే సైకిల్ని సూచిస్తుంది. అంతేకాకుండా లైఫ్‌లో సమస్యలు ఎక్కువైనప్పుడు లేదా అనుకోని ఇబ్బందులు ఎదురైనప్పుడు కోలుకోవడానికి సమయం ఇవ్వాలని.. అది శారీరకంగా అయినా మానసికంగా అయినా ఎంతో అవసరమని సూచిస్తుంది. రికవరీ తర్వాత నూతన ఉత్తేజంతో ముందుకు వెళ్లడాన్ని రథయాత్ర చెప్తోంది. అందుకే భక్తులు ఈ అనసరా ఆచారాన్ని శారీరకంగా, ఆధ్యాత్మికంగా కనెక్ట్ చేయగలిగే ఆచారంగా భావిస్తారు.
గమనిక : ఈ విషయాలు కేవలం అవగాన కోసమే. వివిధ సోర్స్‌ల నుంచి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు అందించడం జరిగింది. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.