కళ్లకు, మెదడుకు ఒకేసాని పని చెప్పే చిత్రాలు ‘ఆప్టికల్ ఇల్యూషన్’. కాసేపు మీ చూపుకు కఠినమైన పరీక్షను పెడతాయివి. ఇక్కడిచ్చిన చిత్రాన్ని కాసేపు చూడండి. అందులో అయిదు పక్షులు దాక్కున్నాయి. వాటిని మీరు వెతికి కనిపెట్టాలి. కాస్త పరీక్షగా చూస్తే ఆ పక్షులన్నీ దొరికిపోతాయి. మీకు చిన్న హింట్ కూడా ఇస్తున్నాం. ఈ చెట్టులో రెండు పెద్ద పక్షులు ఉన్నాయి, మూడు ఒకేలాంటి చిన్న పక్షులు ఉన్నాయి. ఈ హింట్‌ను బట్టి మీరు సులువుగా వాటిని వెతికి పట్టేయగలరు. ఎక్కువ సమయం చూస్తే ఎవరైనా ఆ పక్షులను పట్టేస్తారు. నిమిషంలోపు ఆ పక్షులను కనిపెడితేనే మీ కంటి చూపు, మెదడు చాలా షార్ప్ అని అర్థం. 


మీరు ఒక్కనిమిషంలో పెద్ద పక్షిని పట్టేయగలరు. రెండో పెద్ద పక్షి కూడా సులువుగానే దొరికిపోతుంది. కానీ చిన్న పక్షులు మూడు మాత్రం కాస్త కష్టపెడతాయి. వాటిని మీరు చూడాలంటే కాస్త ఫోటోను తలకిందులుగా చూడాల్సి వస్తుంది. అన్ని కోణాల్లోనూ చెట్టును తిప్పి చూస్తే మీకు కచ్చితంగా చిన్న పక్షులు దొరికిపోతాయి. జవాబు దొరకని వారి కోసం జవాబులను ఫోటోల రూపంలో ఇచ్చాము. ప్రయత్నించాకే జవాబులు చూడండి. 






ఆప్టికల్ ఇల్యూషన్లు ఎప్పట్నించో వాడుకలో ఉన్నాయి.వీటికి వేల ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు చరిత్రకారులు. టీవీలు వంటి వినోదాలు లేని కాలంలో ఇవే అప్పటి ప్రజలకు అలరించాయిట. అయితే వీటి సృష్టి కర్త  ఎవరో మాత్రం ఇంతవరకు తెలియలేదు . చరిత్రకారులు తెలుసుకునే ప్రయత్నం చేసినా జవాబు దొరకలేదు. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు మేలు చేస్తాయి. ఇలాంటివి మెదడుకు , కంటికి సమన్వయాన్ని పెంచుతాయి. అలాగే ఏకాగ్రతను పెంచుతుంది. అందుకే ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ప్రజాదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు క్రియేట్ చిత్రకారుల సంఖ్య పెరిగిపోయారు.  విదేశాల్లో చాలా మంది చిత్రకారులు ఇప్పుడు ఆప్టికల్ ఇల్యూషన్లు వేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఇల్యూషన్లు వైరల్ గా మారాయి. కళ్లను మాయ చేసే ఈ కళ ఇప్పుడు విదేశాల్లో చాలా పాపులర్ అయింది. ఆప్టికల్ ఇల్యూషన్లు గీసే కళాకారులు చాలా దేశాల్లో ఉన్నారు. అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇన్ స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో వీటిదే హవా. ఎంతో మంది వీటికి అభిమానులుగా మారారు. రోజుకు కనీస ఒక ఆప్టికల్ ఇల్యూషన్ అయిన పరిష్కరించేందుకు ప్రయత్నించండి, కచ్చితంగా మీ చూపు, మెదడు రెండు పదును దేలుతాయి.


Also read: చట్నీ పొడి ఇలా చేసి పెట్టుకోండి, నెల రోజుల పాటూ ప్రత్యేకంగా టిఫిన్లకు చట్నీ చేసుకోనక్కర్లేదు


Also read: అయిదు రోజులు ట్రిప్‌కెళ్లాడు, వచ్చాక చూస్తే ఒకేసారి మంకీపాక్స్, కోవిడ్, హెచ్ఐవీ పాజిటివ్



Also read: ఆహారంలో చేసే ఈ చిన్న మార్పు మీ జీవితకాలాన్ని పెంచుతుంది, చేసి చూడండి