Dark Meaning Behind Alpine Divorce : సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ రావడం సహజం. వీటిని రిలేషన్ షిప్స్​కి కూడా వర్తిస్తూ తెరపైకి కొత్త రిలేషన్​షిప్ ట్రెండ్స్ తీసుకువస్తున్నారు. పైగా రిలేషన్​ నుంచి విడిపోవడం కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. విడాకులు కూడా ఇప్పుడు పెద్ద విషయం కాదనే రేంజ్​లో పోస్ట్​లు పెడుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో 'ఆల్పైన్ విడాకులు' అనే కొత్త, భయంకరమైన పదం వైరల్ అవుతోంది. వినడానికి ఇది నార్మల్​గా ఉన్నా.. ఆన్‌లైన్‌లో ఇది ఒక భయంకరమైన పద్ధతిలో ముడిపడి ఉంది. ఎందుకంటే ఈ ఆల్పైన్ విడాకుల పద్ధతిలో భాగస్వామిని పర్వతాలలో ఒంటరిగా వదిలివేస్తారు.

Continues below advertisement

ఈ కొత్త ట్రెండ్ వైరల్ పెంగ్విన్ వీడియో తరువాత బాగా వైరల్ అవుతుంది. ఆల్పైన్ విడాకులు అంటే.. ఆల్పైన్ విడాకులు అనేది చట్టపరమైన ప్రక్రియ కాదు. ఇది ఒక ఇంటర్నెట్ పదం. దీని అర్థం ట్రెక్కింగ్ లేదా పర్వత యాత్ర సమయంలో మీ భాగస్వామిని ప్రాణాంతక పరిస్థితుల్లో వదిలివేయడం. అంటే మీరు మంచుతో కప్పబడిన శిఖరాలు లేదా నిర్మానుష్య పర్వత మార్గాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నారని ఊహించుకోండి. అకస్మాత్తుగా మీ భాగస్వామి మిమ్మల్ని అక్కడే వదిలి వెళ్లిపోవడమే ఆల్పైన్స్ విడాకులు. స్విస్ ఆల్ప్స్ లేదా స్కాట్లాండ్ హైలాండ్స్ వంటి ఎత్తైన ప్రాంతాల పేరు దీనిని క్రియేట్ చేశారు. ఎందుకంటే అక్కడ వాతావరణం, పరిస్థితులు చాలా త్వరగా ప్రమాదకరంగా మారుతాయి.

ఆల్పైన్స్ విడాకులు ఎప్పుడు మొదలయ్యాయంటే..

ఈ పదం మూలాలు 1893లో రచయిత రాబర్ట్ బార్ రాసిన 'ఎన్ ఆల్పైన్ డివోర్స్' అనే కథనుంచి మొదలైంది. ఆ కథలో ఒక భర్త తన భార్యను స్విట్జర్లాండ్ యాత్రలో ప్రమాదకర పరిస్థితుల్లో వదిలివేయాలని యోచిస్తాడు. అది ఒక కల్పిత కథ అయినప్పటికీ.. నేడు ఇంటర్నెట్ అదే ఆలోచనను కొత్త, భయంకరమైన భాషగా మార్చింది. 2026 ప్రారంభంలో ఈ పదం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించింది. చాలా మంది మహిళలు ట్రెక్కింగ్ సమయంలో తాము అసురక్షితంగా లేదా ఒంటరిగా భావించిన అనుభవాలను పంచుకున్నారు. కొన్ని పోస్ట్‌లలో దీనిని 'సర్వైవర్ మూమెంట్'గా చూపించారు. ఎవరైనా సరదాగా లేదా కోపంతో భాగస్వామిని వదిలివేసినట్లుగా చెప్తే.. దానిని 'ఆల్పైన్ విడాకులు' అని పిలవడం ప్రారంభించారు.

Continues below advertisement

ఈ ట్రెండ్ రెడ్ ఫ్లాగా?

మానసికంగా ఈ ధోరణి నమ్మకద్రోహంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఒంటరితనం, అభద్రత అనేవి.. నిర్మానుష్య ప్రాంతంలో మరింత తీవ్రమవుతాయి. కొంతమంది దీనిని డార్క్ హ్యూమర్‌గా భావిస్తే.. మరికొందరు రిలేషన్స్ వరకు తీవ్రమైన రెడ్ ఫ్లాగ్‌గా చూస్తారు. హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా ఈ ట్రెండ్ మరింత వ్యాపించింది. దీనిపై పర్వతాలలో భద్రతా సలహాలు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఉదాహరణకు మీ సొంత మ్యాప్, వస్తువులను మీతోనే ఉంచుకోవడం. ఎవరిపైనా పూర్తిగా ఆధారపడకూడదు.