Chia Seeds in Summer Diet : పోషకాలతో నిండిన చియా సీడ్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్​గా తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సమ్మర్​లో దీనిని ఎక్కువమంది తీసుకుంటారు. దీనిలోని పోషకాలు వేసవిలో మంచి ఫలితాలు ఇస్తాయి. వేడిని తగ్గించి.. హైడ్రేటెడ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అయితే వీటిని సమ్మర్​లో తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో.. వాటిని ఎలా తీసుకోవాలో.. ఏ సమస్యలున్న వారు తీసుకోకపోతే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 


సమ్మర్​లో తీసుకుంటే కలిగే లాభాలివే (Benefits of Chia Seeds in Summer)


చియాసీడ్స్​ పదిరెట్లు నీటిని పీల్చుకోగలవు. ఇవి మిమ్మల్ని సమ్మర్​లో హైడ్రేటెడ్​గా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. సమ్మర్​లో హైడ్రేషన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి కూలింగ్ ఎఫెక్ట్​ ఇవ్వడంలో హెల్ప్ చేస్తాయి. ఎండకాలంలో వేడి వల్ల వచ్చే ఒత్తిడిని, ఇబ్బందులను దూరం చేస్తాయి. శరీరంలో ఎలక్ట్రోలైట్స్​ని బ్యాలెన్స్ చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎలక్ట్రోలైట్స్​ని అందించి.. డీహైడ్రేషన్​ని దూరం చేస్తాయి. 


వేసవిలో చాలామందికి జీర్ణ సమస్యలు వస్తాయి. ఎండవల్ల జీర్ణక్రియ కాస్త మందగిస్తుంది. అయితే చియాసీడ్స్​ని తీసుకుంటే జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. దీనిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది. చియా సీడ్స్​లోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఒత్తిడిని దూరం చేసి.. ఇన్​ఫ్లమేషన్​ని తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడుతాయి. 


చియాసీడ్స్​ని ఇలా తీసుకుంటే మంచిది.. (Chia Seeds into Your Summer Diet)


చియాసీడ్స్​లో వాటర్​ కలిపి తీసుకోవచ్చు. ఇది రిఫ్రెషింగ్, హైడ్రేషన్​ని ఇస్తుంది. దీనిని చాలామంది ఫాలో అవుతారు. అయితే చియా సీడ్స్​ని పుడ్డింగ్​లా కూడా తీసుకోవచ్చు. దీనిని బాదం మిల్క్ లేదా కొబ్బరి పాలలో వేసి.. నానబెట్టి.. క్రీమీ డిజెర్ట్​గా తీసుకోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్​ని హెల్తీగా దూరం చేసుకోవచ్చు. సలాడ్స్​లో స్మూతీలలో తీసుకోవచ్చు. పోషకాలు రెట్టింపు అవుతాయి. చియా సీడ్స్​ని ఐస్ క్యూబ్స్​లా చేసుకుని కూడా సమ్మర్​లో ఉపయోగించుకోవచ్చు. 


కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions)


చియా సీడ్స్ తీసుకుంటే కచ్చితంగా నీటని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే మలబద్ధకం సమస్య రావొచ్చు. అలాగే ఎక్కువ మోతాదులో ప్రారంభించకుండా.. రోజూ వాటిని తక్కువ మోతాదులో తీసుకుంటే.. మీ శరీరం ఇచ్చే రియాక్షన్​ని బట్టి వాటిని పెంచుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉండే చియాసీడ్స్​ని ఎంచుకుంటే మంచిది. 





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.