పుర్రెకో వెర్రి అని ఊరికే అనరు. ప్రచారం పిచ్చి పీక్స్ కి వెళ్లిపోయింది ఓ బర్గర్ కంపెనీకి. అందుకే ఓ వింత బర్గర్‌ను తయారు చేసింది. దాన్ని రుచి మానవ మాంసంలా ఉంటుందట. దాన్ని తినేవారికి అవార్డు కూడా అందిస్తుందట. ఆ బర్గర్ సంస్థ స్వీడన్లో ఉంది. ఇది మొక్కల ఆధారిత ఆహారాన్ని తయారుచేసి అమ్మే షాపు. గత ఏడాది హాలోవీన్ పండుగ సందర్భంగా మానవ మాంసం రుచి తెలుసుకోవాలని తహతహలాడే వారి కోసం బర్గర్ తయారు చేస్తామని ప్రకటించింది. అలా ఇప్పడు మొక్కలతోనే మానవ మాంసం లాంటి రుచితో బర్గర్ తయారుచేశారు. ప్రపంచంలోనే ఇది భయంకరమైన మొక్కల ఆధారిత ఆహారంగా చెప్పుకుంటున్నారు నెటిజన్లు. 


ఆ బర్గర్ ప్రకటన కూడా భయానకంగా ఉంది. ఆ వాయిస్ ఓవర్, మ్యూజిక్ భయపెట్టేసేలా ఉంది. అంతేకాదు ఆ ప్రకటనలో ‘ఈ బర్గర్ ను తయారు చేసేటప్పుడు మనుషులెవరూ గాయపడలేదు’ అని కూడా చెప్పారు. ఆ ప్రకటన చూశాక ఆ బర్గర్ ఎవరూ తినడానికి కూడా ధైర్యం చూపించరేమో. ఆ వీడియోను ఇక్కడ ఎటాచ్ చేశాము చూడండి. 



దేనితో తయారు చేశారు?
ఈ బర్గర్‌ను సోయా, పుట్టగొడుగులు, గోధుమలతో పాటూ ఒక రహస్యమైన మొక్కల ఆధారిత మసాలా మిశ్రమంతో తయారు చేశారు. దీనిలో నాన్ వెజ్ కాస్త కూడా కలవలేదు.కేవలం ఈ పదార్థంతోనే మనిషి మాంసం రుచి వచ్చేలా చేశారు. మొక్కల ఆధారిత పదార్ధాలతోనే ఏ రకమైన ఆహారాన్ని అయినా చేయగలమని నిరూపించడమే మా అంతిమ లక్ష్యం అని చెప్పారు ఆ సంస్థ యజమాని. 





Also read: పనస తొనలు తినేసి పిక్కలు పడేస్తున్నారా? వాటిని ఇలా తింటే ఎన్ని లాభాలో


Also read: మీరు గలగల మాట్లాడేవారా లేక మూతి ముడుచుకునే టైపా? ఈ ఆప్టికల్ ఇల్యూషన్ తేల్చేస్తుంది