Weightlifting During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ చేయవచ్చా? గైనకాలజిస్ట్లు ఇచ్చే సూచనలివే
Weightlifting : గర్భిణులు బరువులు ఎత్తకూడదని చెబుతారు. కానీ ఢిల్లీకి చెందిన పోలీసు సోనికా 157 కిలోలు ఎత్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సమయంలో బేబీలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా?

Pregnant Woman Lifts 145 Kg is it Good or Bad : గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తారు వైద్యులు. ఈ సమయంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైన ఆహారం, సంరక్షణ చాలా అవసరమని చెప్తారు. అలాగే, బరువులు ఎత్తకుండా ఉండమని కూడా చెబుతారు. ఎందుకంటే అలా చేయడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అయితే ఇటీవల ఒక సంఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
ఢిల్లీకి చెందిన ఓ మహిళా కానిస్టేబుల్‌గా చేస్తుంది. ఆమె ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్‌లో 145 కిలోల బరువును ఎత్తింది. దీనిలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇంత బరువును ఎత్తిన సోనికా.. 7 నెలల గర్భవతి. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మరి గర్భిణీ స్త్రీలు వెయిట్ లిఫ్టింగ్ చేయడం సురక్షితమేనా? దీనిపై వైద్యుల అభిప్రాయం ఏంటో చూసేద్దాం.
ప్రెగ్నెన్సీలో వెయిట్ లిఫ్టింగ్ ప్రమాదమా?
గైనకాలజిస్ట్‌ల ప్రకారం.. గర్భధారణ సమయంలో వెయిట్ లిఫ్టింగ్ వైద్యుల సలహా మేరకు మాత్రమే చేయాలి. వాస్తవానికి గర్భధారణ సమయంలో శరీరంలో రిలాక్సిన్ అనే హార్మోన్లు ఏర్పడతాయి. ఇవి పెల్విస్ స్నాయువులను మృదువుగా చేస్తాయి. గర్భాశయ ప్రాంతాన్ని పెంచుతాయి. అటువంటి పరిస్థితిలో.. వెయిట్ లిఫ్టింగ్ వంటి భారీ బరువులు ఎత్తితే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి అలా చేయాలంటే మంచి శిక్షణ పొందడం అవసరమని చెప్తున్నారు. ఇది శరీర బలాన్ని పెంచుతుంది. దీనివల్ల ప్రమాద అవకాశాలు తగ్గుతాయి. లేదు ప్రెగ్నెన్సీలో ఇలాంటి వెయిట్ లిఫ్టింగ్ చేయాలి అనుకునేవారు ముందు నుంచే.. ప్రతి వారం 150 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయాలి. తద్వారా వెయిట్ లిఫ్టింగ్ సాధనను కొనసాగించవచ్చు.
వెయిట్ లిఫ్టింగ్ చేసేప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలివే
గర్భధారణ సమయంలో కూడా వెయిట్ లిఫ్టింగ్ చేయాలనుకునే మహిళలు.. దాని తీవ్రతను మునుపటి కంటే కొంచెం తగ్గించాలి. అంటే తేలికపాటి బరువుతో సాధన చేయాలి అని వైద్యులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో ముందుకంటే బరువు తగ్గించాలి. ప్రెగ్నెన్సీకి ముందు మీరు ఎత్తగలిగే బరువులో 70 శాతం మాత్రమే ఎత్తాలి. దీనినే రిపీట్‌గా చేస్తూ ట్రైన్ అవ్వాలి. అలాగే గర్భధారణ సమయంలో.. గురుత్వాకర్షణ కేంద్రం కారణంగా మహిళల బరువు ముందుకు పడుతుంది. దీనివల్ల వెనుక భాగంలో గాయాలయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో బిడ్డకు హాని కలగకుండా, వారికి గాయం కాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే మొదటి 5 నెలల వరకు వెయిట్ లిఫ్టింగ్ చేయవచ్చు. కానీ ఆ తర్వాత సాధన చేయడం ప్రమాదకరం కావచ్చని చెప్తున్నారు. మీరు అలా వెయిట్ లిఫ్టింగ్ వంటివి చేయాలనుకుంటే కచ్చితంగా వైద్యుల సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.






















