నాగ్‌పూర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డ్‌నెన్స్, ఆర్డ్‌నెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో 57వ బ్యాచ్ ట్రేడ్ అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీని  ద్వారా మొత్తం 5,395 ఐటీఐ, నాన్ ఐటీఐ ఖాళీలను భర్తీచేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు.


యంత్ర ఇండియా లిమిటెడ్ పరిధిలో ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర సంస్థలు పనిచేస్తున్నాయి.


వివరాలు..


* ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు


మొత్తం ఖాళీలు: 5,395 (ఐటీఐ- 3508; నాన్ ఐటీఐ-1887)


ట్రేడులు: మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ M/c టూల్ మెయింటెనెన్స్, టూల్ & డై మేకర్(ప్రెస్ టూల్స్ జిగ్స్ & ఫిక్స్చర్స్), మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్, ప్రోగ్రామింగ్ మరియు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, లేబొరేటరీ అసిస్టెంట్(కెమికల్ ప్లాంట్), ఆప్టికల్ వర్కర్, ఫోర్జర్ & హీట్ ట్రీటర్. 


అర్హత: ఐటీఐ కేటగిరీకి సంబంధించి అభ్యర్థులు కనీసం 50% మార్కులతో పదో తరగతి లేదా తత్సమానం; నాన్-ఐటీఐ కేటగిరీకికి సంబంధించి అభ్యర్థులు 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 28.03.2023 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు పదేళ్లు వయోసడలింపు ఉంటుంది.


దరఖాస్తు ఫీజు: రూ.200(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100).


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక ప్రక్రియ: నాన్-ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐ కేటగిరీకి పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.


స్టైపెండ్: నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000; ఐటీఐలకు రూ.7000 చెల్లిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.02.2023.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.03.2023.


Notification


Website


                                       


Also Read:


Assam Rifles: అస్సాం రైఫిల్స్‌లో 616 టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ పోస్టులు - అర్హతలివే!
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి సంబంధించి మే నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు మార్చి 19 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


MTS Application: 12,523 ఎంటీఎస్‌ పోస్టుల దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో 12,523 మల్టీ టాస్కింగ్ స్టాఫ్(నాన్‌టెక్నికల్), హవల్దార్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును వారంపాటు పొడిగిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఎంటీఎస్ పోస్టుల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 17తో దరఖాస్తు గడువు ముగియాల్సి ఉండగా.. ఫిబ్రవరి 24 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...