WII Recruitment: డెహ్రాడూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 07 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 14 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 


వివరాలు..


ఖాళీల సంఖ్య: 07


1. ల్యాబ్‌ అంటెండెంట్‌: 04 పోస్టులు


అర్హత: 50% మార్కులతో 10వ తరగతి/ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 18- 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


2. డ్రైవర్‌: 02  పోస్టులు


అర్హత: 10వ తరగతి, లైట్ అండ్ హెవీ వెహికల్ రెండింటికీ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కనీసం మూడు సంవత్సరాల పాటు లైట్ & హెవీ వెహికల్స్ డ్రైవింగ్ చేసిన అనుభవం ఉండాలి. 


వయోపరిమితి: 18- 27 సంవత్పరాల మధ్య ఉండాలి. 


3. టెక్నికల్ అసిస్టెంట్‌: 01 పోస్టు


అర్హత: ఫస్ట్ క్లాస్ బీఎస్సీ(సీఎస్)/ బీఎస్సీ(ఐటీ)/బీసీఏ/బీటెక్(ఐటీ)/బీటెక్(సీఎస్) లేదా కంప్యూటర్/ఐటీ రంగంలో సమానమైన కోర్సులు లేదా ఆర్‌ఎస్/జీఐఎస్‌లో పీజీ డిప్లొమా లేదా తత్సమానం. లేదా 3 సంవత్సరాల ఫుల్ టైమ్ ఫస్ట్ క్లాస్ డిప్లొమా(ఇంజినీరింగ్/టెక్) లేదా తత్సమానం కలిగి ఉండాలి.


వయోపరిమితి: 18- 28 సంవత్సరాల మధ్య ఉండాలి.


దరఖాస్తు ఫీజు: రూ.700(రూ.500 దరఖాస్తు ఫీజు + రూ.200 ప్రాసెసింగ్ ఫీజు). ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు అండ్ మహిళా అభ్యర్థులకు మాత్రమే దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. వీరు రూ.200 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా.


ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Registrar, 
Wildlife Institute of India, 
Chandrabani, Dehradun 248001, 
Uttarakhand.


Notification & Application


Website


ALSO READ:


యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2024 నోటిఫికేషన్ విడుదల - 1056 ఉద్యోగాల భర్తీ, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Civil Services (Preliminary) Examination 2024:
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) - 2024 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) బుధవారం (ఫిబ్రవరి 14) విడుదల చేసింది. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సివిల్ సర్వీసెస్‌ విభాగాల్లోని ఖాళీలను భర్తీచేయనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మార్చి 5  వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 6 నుంచి 12 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం కల్పించనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 26న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా ఏటా 10 లక్షల వరకు అభ్యర్థులు పోటీ పడుతుంటారు. గతేడాది 1105 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలకాగా.. ఈ ఏడాది 1056 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు. వీటిల్లో 40 పోస్టులను దివ్యాంగులకు కేటాయించారు. మిగిలిన ఖాళీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రాత పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి గరిష్గంగా 6 సార్లు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఓబీసీ, దివ్యాంగులక 9 సార్లు అవకాశం ఉంది. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లు అయినా పరీక్ష రాయడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...