అన్వేషించండి

Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయర్స్ (NACE), ఇతర HR సర్వేల్లోని తాజా వివరాలు కొత్త గ్రాడ్యుయేట్ల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • జెన్-జీ యువత పనితీరు, ఆఫీస్ నైపుణ్యాలపై కంపెనీలకు అసంతృప్తి పెరుగుతుంది.
  • కమ్యూనికేషన్, చర్చలు, AI వినియోగంలో జెన్-జీకి అవగాహన లోపించిందని సర్వేలు తెలిపాయి.
  • కరోనా, ఆన్‌లైన్ విద్య ముఖాముఖి సంభాషణ నైపుణ్యాలపై తీవ్ర ప్రభావం చూపింది.
  • విద్యాసంస్థలు, కంపెనీలు కలిసి సాఫ్ట్ స్కిల్స్, ఆఫీస్ కల్చర్‌పై శిక్షణనివ్వాలి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు, కార్పొరేట్ లీడర్లలో వర్క్‌ఫోర్స్‌లో అడుగుపెడుతున్న జెన్ జీ (జెనరేషన్ Z) ప్రొఫెషనల్ ప్రవర్తన, ఆఫీసు స్కిల్స్ పై అసంతృప్తి వేగంగా పెరుగుతోంది. పలు అమెరికన్ కంపెనీలు, అధికారులు, ఇటీవల గ్రాడ్యుయేట్ అయిన యువతలో ప్రభావవంతమైన కమ్యూనికేషన్ స్కిల్స్, పనితీరు విధానం, వ్యాపార ఆలోచనలో భారీ లోపాలు కనిపిస్తున్నాయని స్పష్టంగా భావిస్తున్నారు.

కొత్త తరం ముందు వర్క్‌ప్లేస్ సవాళ్లు

ఉద్యోగం ద్వారా కెరీర్2లో అడుగుపెడుతున్న యువత ముందు ఆఫీస్ కల్చర్, రోజువారీ పనులతో సంబంధమైన అనేక ప్రాథమిక, ప్రాయోగిక సవాళ్లు నిలుస్తున్నాయి. వీటిలో ప్రధానమైనవి ఇక్కడ అందిస్తున్నాం. 

ఈమెయిల్ ప్రోటోకాల్ అవగాహన లేదు: ఆఫీస్ ఈమెయిల్ పంపేటప్పుడు ఎవరిని CC లేదా BCCలో పెట్టాలో సరైన అవగాహన లేకపోవడం.

అసమ్మతి వ్యక్తం చేసే విధానం: అధికారిక సమావేశాల సమయంలో సీనియర్లు లేదా సహచరుల అభిప్రాయాలతో ప్రొఫెషనల్‌గా అసమ్మతి తెలిపే విధానం తెలియదు. 

మేనేజర్లతో సంభాషణ: తమ రిపోర్టింగ్ మేనేజర్ లేదా బాస్‌ను ఎప్పుడు, ఎలా, ఏ వాయిస్‌తో ప్రశ్నలు అడగాలో అవగాహన లేకపోవడం.

AI టూల్స్ ఫలితాల పరిశీలన: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాధానాలు, డేటాను గుడ్డిగా నమ్ముతున్నారు. వాటి ప్రామాణికతను, వాస్తవాలను సరిగా చెక్ చేయలేకపోవడం.

సర్వేలోని షాకింగ్ గణాంకాలు, నివేదిక

నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయర్స్ (NACE) మరియు ఇతర మానవ వనరుల (HR) సర్వేల్లోని తాజా గణాంకాలు కొత్త గ్రాడ్యుయేట్ల పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. NACE అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ అండ్ ఎంప్లాయర్స్ అని చెప్పాలి. ఇది అమెరికాలోని ఒక ప్రముఖ ప్రొఫెషనల్ లాభాపేక్షలేని సంస్థ, ఇది ఉన్నత విద్య మరియు కార్పొరేట్ ప్రపంచం మధ్య ఒక వంతెనలా పనిచేస్తుంది.

NACE సర్వే ఏం చెబుతోంది

 71.2 శాతం కంపెనీలు కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగానికి కేవలం కొంతమేరకు సిద్ధంగా ఉన్నారని గుర్తించాయి. కేవలం 21.6% కంపెనీలు జెన్ జీలను జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని భావించాయి. 7.2% ఎంప్లాయర్లు వారు అసలు సిద్ధంగానే లేరని అభిప్రాయపడ్డారు.

 పనితీరుపై అసంతృప్తి: ఇటీవల నియమితులైన కొత్త గ్రాడ్యుయేట్ల ఆన్-జాబ్ పనితీరు అత్యంత సంతృప్తికరంగా లేదు అని 75 శాతం కంపెనీలు అంగీకరించాయి.

800+ HR లీడర్ల సర్వే: 800 మందికి పైగా HR అధికారులపై జరిగిన మరో సర్వేలో 37 శాతం అధికారులు, కొత్త గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం ఇవ్వడం కంటే రోబోట్ లేదా AI టెక్నాలజీతో పని చేసుకోవడం మంచిదని చెప్పారు.

30% ఎంప్లాయర్లు, సిద్ధత లేని, తక్కువ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను హైర్ చేయడం కంటే ఉద్యోగ పదవిని ఖాళీగా ఉంచడమే మంచిదని స్పష్టం చేశారు.

Gen-Z సమస్యకు ప్రధాన కారణాలు ఇవే..

కరోనా వ్యాప్తి సమయంలో సంవత్సరాల పాటు స్కూల్స్, కాలేజీలు మూసేశారు. ఈ సమయంలో అధిక స్క్రీన్ టైమ్, మనుషుల నుంచి దూరం పాటించడం, వర్క్ ఫ్రం హోమ్ లేదా ఆన్‌లైన్ క్లాసుల వాతావరణం కొనసాగింది. దాంతో  యువతలో ముఖాముఖి సంభాషణ, పరస్పర సమన్వయం లేకపోవడంతో, వీరిలో ఆఫీస్ నార్మ్స్ లో భారీ లోపం కనిపిస్తోంది.

కొత్త విద్యార్థులు కమ్యూనికేట్ చేయడంలో, నిజ జీవిత సమస్యలను ఎదుర్కొనడంలో గత తరాల కంటే చాలా వెనుకబడుతున్నారని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ ప్రొఫెసర్ టెస్సా వెస్ట్ అన్నారు. ఇప్పుడు ఈ లోపాలను సరిచేసి, వారిని ప్రవర్తనా నైపుణ్యాలు మెరుగుపరిచే బాధ్యత విద్యాసంస్థలపై పడింది.

పరిష్కారం మార్గాలు

ఈ పెరుగుతున్న స్కిల్స్ గ్యాప్‌ను తగ్గించి, యువతను వర్క్ ప్లేస్‌కు అనుగుణంగా మార్చేందుకు నిపుణులు అనేక ముఖ్య సూచనలు చేశారు:

టెక్నికల్ స్కిల్స్ వర్సెస్ సాఫ్ట్ స్కిల్స్: ప్రొఫెసర్ టెస్సా వెస్ట్ ప్రకారం, టెక్నికల్ స్కిల్స్ (Technical Skills) సులభంగా నేర్పించవచ్చు. కానీ మాట్లాడటం, చర్చించడం, అభిప్రాయ భేదాలను తెలపడం, టీమ్‌తో కలిసి పనిచేయడం నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల విద్యాసంస్థలు సాఫ్ట్ స్కిల్స్‌పై ఫోకస్ చేయక తప్పదు. 

ఆఫీస్ కల్చర్, AI శిక్షణ: కాలేజీలు, కంపెనీలు కలిసి పనిచేయాల్సి ఉంటుందిన తోషిబా చీఫ్ HR ఆఫీసర్ జేసన్ డెసెంట్జ్ అభిప్రాయపడ్డారు. యువతకు ప్రారంభ దశలోనే ఆఫీస్ కల్చర్, సామాజిక ప్రవర్తన, AIని సరైన విధంగా ఉపయోగించేలా  శిక్షణ ఇవ్వాలి.

కార్పొరేట్ బాధ్యత: యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రొఫెసర్ పీటర్ కాపెల్లీ మాట్లాడుతూ.. ఈ సమస్యకు కేవలం కాలేజీలు, విద్యా సంస్థలనే బాధ్యులుగా చేయడం సరికాదు. కంపెనీలు కూడా ఎంట్రీ లెవల్ ఉద్యోగుల శిక్షణ, మెంటార్షిప్‌పై ఫోకస్ చేయడం లేదు. 2000ల తర్వాత నుంచి కొత్త ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ గంటలు నిరంతరం తగ్గుతూ వస్తున్నాయని తెలిపారు. 

Frequently Asked Questions

జెన్ జీ ఉద్యోగుల పట్ల కంపెనీల అసంతృప్తికి ప్రధాన కారణం ఏమిటి?

వారికి సమర్థవంతమైన కమ్యూనికేషన్, పనితీరు విధానం, వ్యాపార ఆలోచనలో భారీ లోపాలు కనిపిస్తున్నాయని పలు అమెరికన్ కంపెనీలు భావిస్తున్నాయి.

Gen Z యువత కార్యాలయంలో ఏయే సవాళ్లను ఎదుర్కొంటున్నారు?

ఈమెయిల్ ప్రోటోకాల్ అవగాహన లేకపోవడం, వృత్తిపరంగా అసమ్మతి వ్యక్తం చేయలేకపోవడం, మేనేజర్లతో సంభాషణ విధానం తెలియకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు.

సర్వేల ప్రకారం, Gen Z గ్రాడ్యుయేట్ల పనితీరు ఎలా ఉంది?

71.2% కంపెనీలు వారిని పాక్షికంగా సిద్ధంగా ఉన్నారని, 75% కంపెనీలు వారి పనితీరు సంతృప్తికరంగా లేదని తెలిపాయి. 37% HR అధికారులు రోబోట్‌తో పనిచేయడం మంచిదని చెప్పారు.

Gen Zలో ఈ నైపుణ్యాల లోపానికి కారణాలు ఏమిటి?

కరోనా సమయంలో పాఠశాలలు మూసివేయడం, అధిక స్క్రీన్ సమయం, ముఖాముఖి సంభాషణలు, పరస్పర సమన్వయం లేకపోవడం ప్రధాన కారణాలు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Police Jobs: పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు
SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ. 92,000 పైగా జీతం
SSC CHSL 2026 నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్ అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
Telangana Police Recruitment: గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
గుడ్‌న్యూస్.. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు
GDS Recruitment 2026: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Family: వెడ్డింగ్ యానివర్శరీ - భువనేశ్వరికి చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమిటో తెలుసా?
వెడ్డింగ్ యానివర్శరీ - భువనేశ్వరికి చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమిటో తెలుసా?
Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Botsa Satyanarayana Cry: చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
Embed widget