West Central Railway RRC Act Apprentices Notification: మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్‌సీ) వెస్ట్ సెంట్రల్ రైల్వే (డబ్ల్యూసీఆర్) పరిధిలోని డివిజన్/ యూనిట్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 3,317 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నారు సెప్టెంబర్ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


* యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు


ఖాళీల సంఖ్య: 3,317 


పోస్టుల కేటాయింపు: యూఆర్-1344, ఎస్సీ-504, ఎస్టీ-242, ఓబీసీ-893, ఈడబ్ల్యూఎస్-334.


ఆర్‌ఆర్‌సీ డివిజన్‌/ యూనిట్‌ల వారీగా ఖాళీలు.. 


➥ జేబీపీ డివిజన్: 1262 పోస్టులు


➥ బీపీఎల్‌ డివిజన్: 824 పోస్టులు 


➥ కోటా డివిజన్: 832 పోస్టులు 


➥ సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌: 175 పోస్టులు 


➥ డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా: 196 పోస్టులు 


➥ హెచ్‌క్యూ/ జేబీపీ: 28 పోస్టులు


ట్రేడ్‌లు: ఏసీ మెకానిక్, అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ (కుకరీ), అప్రెంటిస్ ఫుడ్ ప్రొడక్షన్ (జనరల్), అప్రెంటీస్ ఫుడ్ ప్రొడక్షన్(వెజిటేరియన్), ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, బ్లాక్ స్మిత్(ఫౌండ్రీమ్యాన్), బుక్ బైండర్, కేబుల్ జాయింటర్, కార్పెంటర్, కంప్యూటర్ మరియు పెరిఫెరల్స్ హార్డ్‌వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ మెకానిక్, కంప్యూటర్ నెట్‌వర్కింగ్ టెక్నీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, డెంటల్ లేబొరేటరీ టెక్నీషియన్, డీజిల్ మెకానిక్, డిజిటల్ ఫోటోగ్రాఫర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్), డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, ఫ్లోరిస్ట్ & ల్యాండ్‌స్కేపింగ్, హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, హార్టికల్చర్ అసిస్టెంట్, హౌస్ కీపర్ (హాస్పిటల్), హౌస్ కీపర్ (ఇన్‌స్టిట్యూషన్), ఇన్ఫర్‌మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్, మెషినిస్ట్, మాసన్(బిల్డింగ్ అండ్ కన్‌స్ట్రక్టర్), మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ మెకానిక్ కమ్ ఆపరేటర్, మెకానిక్(రెఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషన్), మెకానిక్ (ఎలక్ట్రికల్ డొమెస్టిక్ అప్లయెన్సెస్), మెకానిక్ (మోటార్ వెహికల్), మెకానిక్ (ట్రాక్టర్), మెకానిక్-కమ్-ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (పాథాలజీ), మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ (రేడియాలజీ), మల్టీమీడియా అండ్ వెబ్ పేజీ డిజైనర్, పెయింటర్(జనరల్), ప్లంబర్, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్, రిసెప్షనిస్ట్ / హోటల్ క్లర్క్ / ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్, సెక్రటేరియల్ అసిస్టెంట్, సేయింగ్ టెక్నాలజీ (కటింగ్ & టైలరింగ్)/టైలర్(జనరల్), స్టెనోగ్రాఫర్ (ఇంగ్లీష్), స్టెనోగ్రాఫర్ (హిందీ), సర్వేయర్, టర్నర్, వెల్డర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), వైర్‌మ్యాన్.


అర్హత: మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులకు మినహాయించి మిగతా పోస్టులకు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఇంటర్ (ఎంపీసీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.  దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 


వయోపరిమితి: 05.08.2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు (ఎస్సీ, ఎస్టీలకు 15 సంవత్సరాలు; ఓబీసీలకు 13 సంవత్సరాలు) వయోసడలింపు వర్తిస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 10  సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. 
దరఖాస్తు ఫీజు: రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.41.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 


ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.08.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.09.2024. (23:59 hrs. )


Notification


Online Application


Website






మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..